విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా
నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయూలని డిమాండ్
రెండు గంటలపాటు రాస్తారోకో
రెండు రోజుల్లో పరిష్కరిస్తానని సీఎండీ హామీ..ఆందోళన విరమణ
హన్మకొండ : ఎన్పీడీసీఎల్లో నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌తో విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా, రాస్తారోకో చేశారు. శుక్రవారం హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాల యం ఎదుట టీఆర్వీకేఎస్, టీఎస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం 327, టీఎస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104, తెలంగాణ పవర్ డిప్లొమో ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మహాధర్నా చేశారు. నలుగురు విద్యుత్ ఉద్యోగులపై విధించిన అక్ర మ సస్పెన్షన్‌ను ఎత్తివేయూలని డిమాండ్ చేశా రు. హన్మకొండ-కాజిపేట రహదారిపై రెండు గంటలకు పైగా రాస్తారోకో చేయగా వాహనా లు నిలిచారుు. హోంమంత్రి నారుుని నర్సింహా రెడ్డి జిల్లాపర్యటన నేపథ్యంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. హన్మకొండ సీఐ కిరణ్‌కుమార్, కేయూ సీఐ అలీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్దకు చేరుకుని వారిని శాంతింప జేశారు. ఆతర్వాత కార్యాలయ ఆవరణలోనూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఉద్యోగ సంఘాల నాయకుల ను సీఎండీ కొంటె వెంకటనారాయణతో చర్చలు జరిపేందుకు పంపారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని సీఎండీ హామీ ఇవ్వగా వారు ఆందోళన విరమించారు.
ఉద్యోగ సంఘా ల నాయకులు కేవీ.జాన్సన్, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, సాయిని రవీందర్ మాట్లాడుతూ సంగెం మండలానికి చెందిన ఏఈతో సహా మ రో ముగ్గురు ఉద్యోగులను ఎన్పీడీసీఎల్ యాజ మాన్యం అక్రమంగా సస్పెండ్ చేసిందని, వారి ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పవర్ డిప్లొమో ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు సంజీవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మల్లయ్య, లక్ష్మణ్‌నాయక్, వాలునాయక్, వంశీ, టీఆర్వీకేఎస్ ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు బండారి ప్రభాకర్, కార్యదర్శి విజయభాస్కర్, ప్రాంతీయ శాఖ అధ్యక్షుడు ఎండీ.రబ్బాని, నాయకులు రవికుమార్, వరప్రసాద్, సతీష్, శ్రీధర్, జగదీష్, రాజ్‌నారాయణ , వెంకన్న, రవీందర్, బీఆర్.సత్యనారాయణ, రాంరెడ్డి, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 డిస్కం కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, కార్యదర్శి హనుమంతరావు, నాయకులు లక్ష్మణ్‌నాయక్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 జిల్లా కార్యదర్శి సాయిని రవీందర్, విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు గాదె జితేందర్, డిస్కం కార్యదర్శి కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు డీఎస్.ప్రభాకర్, కార్యదర్శి మొగిళి, రాష్ట్ర నాయకుడు రౌతు రమేష్‌కుమార్ పాల్గొన్నారు.