Power Play Movie
-
కష్టాల్లో దర్శకుడు: హీరోలు దయచేసి ఆదుకోరూ!
'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో ప్రయాణం మొదలు పెట్టాడు నంద్యాల రవి. ఆరేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ కుమార్ కొండా తీసిన 'ఒరేయ్ బుజ్జిగా'తో రచయితగా మారాడు. ఈ మధ్యే వచ్చిన 'పవర్ ప్లే'కు సైతం స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశాడు. ఇదిలా వుంటే తాజాగా ఈ రచయిత కరోనా బారిన పడినట్లు సమాచారం. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అతడికి అందించిన వైద్యానికిగానూ ఆస్పత్రి రూ.7 లక్షల బిల్లు వేసిందట. ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా చెల్లించేది? అని రవి కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారట. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారట. ఒక్కో సినిమాకు కోట్లు తీసుకునే టాలీవుడ్ హీరోలు తలా రూ.50 వేలు ఇస్తే అతడిని ఆదుకున్నవారవుతారని పలువురూ అభిప్రాయపడుతున్నారు. లేదంటే సీసీసీ (కరోనా సంక్షోభ సహాయ నిధి) సాయం చేయాలని భావిస్తున్నారు. టాలీవుడ్లో ఇలా కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఎంతో మంది ఉన్నారని, వారికి సాయం చేసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకు వచ్చి గొప్ప మనసు చాటుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: అన్ని వుడ్స్ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు -
చేసిన తప్పులు చేయకూడదు
‘‘సినిమా హిట్ కావాలనే స్టార్ట్ చేస్తాం. అయితే ఆ సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ కావచ్చు. కాకపోవచ్చు. సినిమాను కొత్త జానర్లో ప్రయత్నించినప్పుడు మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం ఉండదు. కానీ చేసిన తప్పులు మాత్రం మళ్లీ చేయకూడదు’’ అన్నారు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో మహీధర్, దేవేష్ నిర్మించిన చిత్రం ‘పవర్ ప్లే’. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ చెప్పిన విశేషాలు... ► అమాయకుడైన ఓ వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తుల వేసిన ఎత్తుగడలో చిక్కుకుంటాడు. ఈ కష్టాల నుంచి అతను ఎలా బయటకు వచ్చాడు? తన కష్టాలకు కారకులైనవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. ► ప్రతి సినిమాకూ వందశాతం కష్టపడతాను. సినిమా పూర్తికాగానే డిస్కనెక్ట్ అవుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఏ ప్లాట్ఫామ్లో అయినా చూస్తారు. అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ► విజయ్‌గారితో కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టే ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్నాను. హిందీ సినిమా ‘డ్రీమ్‌గర్ల్’ రీమేక్‌ను విజయ్‌గారి డైరెక్షన్ లో చేస్తున్నాను. విరించి వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 60∙శాతం పూర్తయింది. శ్రీనివాస్ గవిరెడ్డితో నేను చేస్తున్న సినిమా దాదాపు పూర్తయింది.