‘‘సినిమా హిట్ కావాలనే స్టార్ట్ చేస్తాం. అయితే ఆ సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ కావచ్చు. కాకపోవచ్చు. సినిమాను కొత్త జానర్‌లో ప్రయత్నించినప్పుడు మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం ఉండదు. కానీ చేసిన తప్పులు మాత్రం మళ్లీ చేయకూడదు’’ అన్నారు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో మహీధర్, దేవేష్ నిర్మించిన చిత్రం ‘పవర్ ప్లే’. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ చెప్పిన విశేషాలు...
► అమాయకుడైన ఓ వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తుల వేసిన ఎత్తుగడలో చిక్కుకుంటాడు. ఈ కష్టాల నుంచి అతను ఎలా బయటకు వచ్చాడు? తన కష్టాలకు కారకులైనవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది.
► ప్రతి సినిమాకూ వందశాతం కష్టపడతాను. సినిమా పూర్తికాగానే డిస్‌కనెక్ట్ అవుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా చూస్తారు. అయితే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు.
► విజయ్‌గారితో కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టే ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్నాను. హిందీ సినిమా ‘డ్రీమ్‌గర్ల్’ రీమేక్‌ను విజయ్‌గారి డైరెక్షన్ లో చేస్తున్నాను. విరించి వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 60∙శాతం పూర్తయింది. శ్రీనివాస్ గవిరెడ్డితో నేను చేస్తున్న సినిమా దాదాపు పూర్తయింది.
చేసిన తప్పులు చేయకూడదు
Published Fri, Mar 5 2021 6:04 AM | Last Updated on Fri, Mar 5 2021 6:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment