power Transfer Department
-
నాలుగేళ్లుగా నలుగురే దిక్కు
సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ముఖ్యమైన మరమ్మతులు, నిర్వహణ విభాగం కేవలం నలుగురు సిబ్బందితోనే పని చేస్తోంది. ఆ నలుగురిలోనూ ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఉండడం గమనార్హం. అసలే వర్షాకాలం.. తుపానులొస్తున్నాయి.. వరదలు చుట్టుముడుతున్నాయి.. ఈదురు గాలులు విరుచుకుపడుతున్నాయి. ఏ క్షణంలో ఏ అవసరమొస్తుందో తెలియదు.. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వాటిని బాగుచేయడానికి ఆ నలుగురే దిక్కు. జిల్లా చూస్తే పెద్ద విస్తీర్ణంలోఉంది.. ఏ మూలకు వెళ్లాలన్నా జిల్లా కేంద్రం నుంచి సుమారు 4 గంటల సమయం పడుతోంది. అక్కడికివెళ్లిన తరువాత మరమ్మతులకు మరింత సమయం పడుతోంది. ఈ లోపు ఇతర ట్రాన్స్ఫార్మర్ల నుంచి విద్యుత్ పునరుద్ధరిస్తున్నా అది కూడా ట్రిప్ అయితే ఒక రోజంతా వినియోగదారులు చీకటిలో మగ్గిపోవాల్సి వస్తోంది. 2014లో 10 మంది.. ఇప్పుడు నలుగురే 2014– 15 సంవత్సరంలో ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో సుమారు 170 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉండగా వాటి నిర్వహణకు ఏలూరులోని ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ – మరమ్మతుల విభాగ కార్యాలయంలో 10 మంది సిబ్బంది అందుబాటులో ఉండే వారు. వివిధ కారణాల వల్ల ప్ర స్తుతం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. కానీ విద్యుత్ సర్వీసులు పెరిగిన నేపథ్యంలో వాటి సేవకుగాను ప్రస్తుతం ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో 255 విద్యుత్ ఉప కేంద్రాలు, 420 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. తక్కువ సబ్ స్టేషన్లు ఉన్న సమయంలో 10 మంది సిబ్బంది ఉండగా, ట్రాన్స్ఫార్మర్లు పెరిగిన అనంతరం సిబ్బంది తగ్గిపోవడంతో వాటి నిర్వహణ భారమంతా ఆ నలుగురిపైనే పడుతోంది. ఇరత చోట్ల పూర్తి సిబ్బంది ఈ కంపెనీ పరిధిలోని రాజమండ్రి సర్కిల్లో 166 ఉపకేంద్రాలు, 264 ట్రాన్స్ఫార్మర్లకు 9 మంది సిబ్బంది ఉండగా, విశాఖపట్టణం సర్కిల్లో 160 ఉపకేంద్రాలు, 266 ట్రాన్స్ఫార్మర్లకు 14 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అలాగే విజయనగరం సర్కిల్ పరిధిలో 87 ఉప కేంద్రాలు, 109 ట్రాన్స్ఫార్మర్లు, 7గురు సిబ్బంది, శ్రీకాకుళం సర్కిల్లో 90 ఉప కేంద్రాలు, 110 ట్రాన్స్ఫార్మర్లు 11 మంది సిబ్బంది ఉన్నారు. అంటే ఇతర సర్కిళ్లలో సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు తక్కువగా ఉన్నా అక్కడ సిబ్బంది అధికంగానే ఉండగా, కేవలం ఏలూరు సర్కిల్లో మాత్రమే సిబ్బంది కొరత ఉండడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ఎవరికీ పట్టని సిబ్బంది ఆందోళన ఈ కార్యాలయంలో ఉన్న నలుగురు సిబ్బంది ఇన్ని సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు, నిర్వహణ చేయాల్సి రావడంతో వారికి పనిభారం విపరీతంగా పెరిగింది. ఒక్కొక్కరూ సుమారు 18 గంటలు పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో ఇక్కడ సిబ్బందిని పెంచాలని, మారుమూల ప్రాంతాలకు వేగవంతంగా చేరుకోవడానికి మంచి వాహనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా వీరి మొరను ఆలకించే తీరిక అధికారులకు ఉండడం లేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది మాత్రం నాలుగేళ్లుగా తమకు వీలు కలిగినప్పుడల్లా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసన తెలియజేస్తున్నారు. అయినా అధికారులు ఈ కార్యాలయ సిబ్బందిని పెంచే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో సెక్షన్ మంజూరు చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏలూరు సర్కిల్లో ప్రజలకు అంతరాయంలేని విద్యుత్ అందించాలంటే మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి మరో సెక్షన్ కార్యాలయాన్ని మంజూరు చేయాలి. దానికి తగ్గట్టు సిబ్బందిని కూడాపెంచాలి. ఒక్క పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా ఒక మండలం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదముంది. దాసి ఆనంద కుమార్, సబ్ ఇంజినీర్ -
అమ్మో.. నల్లగొండ
నల్లగొండ విద్యుత్ శాఖ బదిలీల్లో నల్లగొండ డివిజన్ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ డివిజన్ పరిధిలోని నాలుగు సబ్డివిజన్ల ఏడీఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంట్లో నల్లగొండ, నల్లగొండ రూరల్, మునుగోడు, రామన్నపేట స్థానాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏడీఈలు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ కానున్నారు. నల్లగొండ ఏడీఈగా పనిచేస్తున్న నాగిరెడ్డి హుజూర్నగర్ వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఏడీఈ సూర్యాపేట వేళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మిగిలిన స్థానాల్లో పనిచేస్తున్న ఏడీఈలు కూడా వేరొక ప్రాంతాలకు వెళ్లనున్నారు. చాలా కాలం తర్వాత బదిలీలు జరుగుతుండటంతో శాఖా పరంగా ఇదొక ప్రక్షాళన లాంటిదే. కానీ జిల్లా మొత్తం మీద నల్లగొండ డివిజన్ అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. ఈ సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చే మండలాల్లో కాంట్రాక్టర్ల బెదిరింపులకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే డివిజన్ కావడంతో ఇక్కడ పోటీ ఒకింత ఎక్కువగానే ఉంటుంది. అయితే రామన్నపేట, నల్లగొండ సబ్ డివిజన్లలో అధికారులకు, ఏఈలకు మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారు. అయితే ఈ బదిలీల్లో ఇప్పటి వరకు పనిచేసిన వారందరికీ స్థాన చలనం కలుగుతున్నప్పటికీ కాంట్రాక్టర్లు వ్యవహార శైలి, రాజకీయ ఒత్తిళ్లు యథావిధిగానే ఉంటాయన్న అభిప్రాయంతో ఈ డివిజన్‌కు కొత్తవారు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ఈ స్థానాలకు జిల్లాతో సంబంధం లేని కొత్త వ్యక్తులను హైదరాబాద్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైరవీల జోరు... ఈ నెల 8 తేదీన బదిలీల షెడ్యూల్ జారీ అయింది. తొలుత 15వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ మూడేళ్లుదాటిన ప్రతి ఒక్కరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలని చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా 5 వందల మంది వరకు బదిలీ కానున్నారు. ఎస్ఈ స్థాయిలోనే నాలుగు వందల మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బదిలీల ప్రక్రియను ఈ నెల 30 వరకు పొడిగించారు. బదిలీ అయిన ఉద్యోగులు, అధికారులు జూన్ 6 తేదీలోగా తమ ప్రాంతాలకు వెళ్లాలి. కాగా బదిలీల షెడ్యూల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం దేవరకొండ డివిజన్ పరిధిలో పనిచేసే లైన్మన్లు, అసిస్టెంట్ లైన్మన్లు, హెల్పర్ల బదిలీలు మాత్రమే పూర్తయ్యాయి. కానీ ఎస్ఈ స్థాయిలో చేయాల్సిన ఏడీఈలు, ఏఈలు, జూనియర్ అసిస్టెంట్లు, జేఏఓల బదిలీల కసరత్తు ఇంకా జరుగుతోంది. ఎస్ఈ కొత్త వారు కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏడీఈల విషయానికొస్తే...కోదాడ, బీబీనగర్, నకిరేకల్, రామన్నపేట సబ్ డివిజన్లు రెవెన్యూ కలిగిన ప్రాంతాలు కావడంతో ఇక్కడికి వచ్చేందుకు పోటీ ఎక్కుగానే ఉంది. ఏఈలు మిర్యాలగూడ రూరల్, కోదాడ రూరల్, టౌన్, చివ్వెంల, ఆత్మకూరు (ఎస్), చౌటుప్పుల్ మండలాల మీద కన్నేశారు. హైదరాబాద్ పరిధిలోకి వచ్చే కొండమడుగు ఏఈ స్థానానికే రాష్ట్ర వ్యాప్తంగా 74 మంది పోటీలో ఉంటే దాంట్లో మన జిల్లాకు చెందిన వారు కూడా ఉండటం విశేషం. ఇక ఎస్ఈ కంట్రోల్ ఉండే జిల్లా స్టోర్స్ కార్యాలయంలో ఏఈలుగా పనిచేసేందుకు కూడా పోటీ పడుతున్నారు. నాలుగు చేతులా సంపాదన ఉన్న ప్రాంతాలు కావడంతో విద్యుత్ శాఖ బదిలీలు రాజకీయ జోక్యంతో రసవత్తరంగా సాగుతున్నాయి.