సుప్రీం ధర్మాసనం ఎదుటకురానున్న పీపీ పాండే కేసు
ఇష్రత్ జహన్ హత్య కేసులో తనను అరెస్ట్ చేయాడాన్ని సవాల్ చేస్తు గుజరాత్ రాష్ట్ర అడిషనల్ డీజీపీ పీపీ పాండే చేసుకున్న అభ్యర్థను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం పరిశీలించింది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు పాండే తరుపు న్యాయమూర్తి వాదనలు సోమవారం ధర్మాసనం ఎదుట వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం వెల్లడించారు.
2004, జూన్ 15న ఇష్రత్ జహన్ హత్య కేసుపై దర్యాప్తు చేసిన సీబీఐ పోలీసు అధికారులు పాండేతోపాటు మరో కొంత మంది ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను సీబీఐ విచారించి అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో పీ.పీ.పాండే పరారయ్యారు. ఆయన్ని ఇటీవలే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తాను చేయని తప్పుకు సీబీఐ అరెస్ట్ చేసిందని ఆయన సుప్రీం కోర్టును అశ్రయించారు. దీంతో పాండే కేసు సోమవారం ధర్మాసనం విచారించనుంది.