prabhakarrao
-
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు
= పోలీసు అధికారులకు డీఐజీ ప్రభాకర్‌రావు = జిల్లా పోలీసు కార్యాలయం, డీసీఆర్‌బీల తనిఖీ అనంతపురం సెంట్రల్ : ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదని అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం, డిస్టిక్ క్రైం రికార్డు బ్యూరో(డీసీఆర్బీ)లను డీఐజీ తనిఖీ చేశారు. ముందుగా పోలీసు కాన్ఫరె¯Œ్స హాలులో సమావేశం నిర్వహించారు. రోజువారి విధులు, పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పనితీరు, గణాంకాలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేష¯ŒS ద్వారా వివరించారు. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ‘సన్నిహితం’ పేరుతో మరో కొత్తయాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. కొత్త యాప్ విధివిధానాలను వివరించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది బాగా పని చేస్తే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, అధికారులు సంతృప్తి చెందుతారన్నారు. ప్రజల పిటిషన్లకు కూడా వేగంగా పరిష్కారం చూపించాలన్నారు. అలాగే ప్రతి అంశాన్నీ లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం, డీసీఆర్బీలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మాల్యాద్రి, శ్రీనివాసరావు, డీఎస్పీలు మల్లికార్జున, మల్లికార్జునవర్మ, చిన్నికృష్ణ, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సూర్యనారాయణ, డీఐజీ మేనేజర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకోవచ్చు
అనంతపురం అర్బన్: రేషన్ కార్డుల పోర్టబిలిటీ అమలు చేస్తున్నామని, జిల్లాలో ఏ చౌక దుకాణం నుంచైనా లబ్ధిదారులు సరుకులు తీసుకోవచ్చని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రభాకర్‌రావు తెలిపారు. కార్డుదారులు సరుకులు తీసుకోకపోయినా కార్డు రద్దు కాదని చెప్పారు. మంగâýæవారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. చాలా మంది పేదలు జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో సరుకుల కోసం సొంత గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పోర్టబిలిటీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డీలర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు సరుకులకు వచ్చినప్పుడు డీలర్లు కచ్చితంగా ఇవ్వాలని, ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. ఎవరైనా సరుకులు ఇవ్వకుండా కార్డుదారులను వెనక్కి పంపిస్తే సదరు డీలర్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
'2016లో రబీకి 9 గంటల విద్యుత్ ఇస్తాం'
గణపురం (వరంగల్ జిల్లా) : రైతాంగానికి ఇబ్బంది లేకుండా పంటలకు 9 గంటల విద్యుత్‌ను ఒకేసారి సరఫరా చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, 2016 రబీ నుంచి వ్యవసాయూనికి 9గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి మాట నిలుపుకుంటామని టీ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ 600మెగావాట్ల రెండో దశ నిర్మాణపు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 నాటికి జెన్కోకు సుమారుగా 2వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. కేటీపీపీ రెండో దశ 600 మెగావాట్లు, సింగరేణికి చెందిన 1200 మెగావాట్లు లోయర్ జూరాల180 మెగావాట్లు, పులిచింతల 30 మెగావాట్ల విద్యుత్ జెన్కో ఖాతాలో జమ అవుతాయన్నారు. మరో మూడు సంవత్సరాలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు. ఒక ప్రశృ్నకు సమాధానంగా 800మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ప్రభుత్వం దామరచర్లకు తృరలించిందన్నారు. రానున్న రోజుల్లో కేటీపీపీకి మరో ప్లాంట్ తప్పకుండా వస్తుందన్నారు.