అనంతపురం అర్బన్: రేషన్ కార్డుల పోర్టబిలిటీ అమలు చేస్తున్నామని, జిల్లాలో ఏ చౌక దుకాణం నుంచైనా లబ్ధిదారులు సరుకులు తీసుకోవచ్చని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రభాకర్‌రావు తెలిపారు. కార్డుదారులు సరుకులు తీసుకోకపోయినా కార్డు రద్దు కాదని చెప్పారు. మంగâýæవారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. చాలా మంది పేదలు జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో సరుకుల కోసం సొంత గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయమన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పోర్టబిలిటీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డీలర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు సరుకులకు వచ్చినప్పుడు డీలర్లు కచ్చితంగా ఇవ్వాలని, ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. ఎవరైనా సరుకులు ఇవ్వకుండా కార్డుదారులను వెనక్కి పంపిస్తే సదరు డీలర్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకోవచ్చు
Published Tue, Nov 1 2016 11:21 PM | Last Updated on Thu, Mar 28 2019 4:57 PM
Advertisement
Advertisement