Pradhan Mantri Adarsh Gram Yojana
-
PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆ ‘క్రీమీలేయర్’ రాజ్యాంగంలో లేదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల అమలు విషయంలో క్రీమీలేయర్ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. -
ఏ ఊళ్లోనూ 50% పైగా ఎస్సీలు లేరట!
సాక్షి, అమరావతి: ఎస్సీ జనాభా 50 శాతానికి పైగా ఉండే గ్రామాలు ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల్లో కనీసం ఒక్కటి కూడా లేదంట. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై) ద్వారా వెల్లడైంది. 500 మందికి పైగా జనాభా ఉండి, అందులో 50 శాతానికి పైగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏజీవై పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి ఎంపికైన గ్రామాలకు కేంద్రం రూ.21 లక్షల చొప్పున నిధులిస్తుంటుంది. దేశంలో 2.55 లక్షల గ్రామ పంచాయతీలుండగా.. ఇందులో 19,084 గ్రామ పంచాయతీల్లో ఈ పథకం అమలవుతోంది. ఏపీలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 501 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2011 నాటి లెక్కల ప్రకారం.. విజయనగరం, విశాఖ జిల్లాల్లో 50% ఎస్సీ జనాభా ఉన్న గ్రామం ఒక్కటీ లేకపోవడంతో ఈ పథకానికి ఎంపిక కాలేదని అధికారులు తెలిపారు. కాగా, కేంద్రం ఈ పథకం నిబంధనలను సవరిస్తూ ఈనెల 6న రాష్ట్రాలకు లేఖ రాసింది. కనీసం 40% ఎస్సీ జనాభా ఉండే గ్రామాల్లోనూ పథకం అమలుకు అనుమతిచ్చింది. (క్లిక్: రైల్వే శాఖ అద్భుతం.. కేవలం 5 గంటల్లోనే..)