Praful Hinge
-
నన్నే అంటావా?.. అందుకే చితక్కొట్టా: వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గతేడాది భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ ఆకట్టుకుంటున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా వైభవ్.. 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.బ్యాట్‌తోనే సమాధానంతద్వారా ఐపీఎల్లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. గతేడాది గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే వైభవ్ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సన్‌రైజర్స్‌పై కొట్టిన సెంచరీ తనకు అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నచ్చదని.. అందుకే బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు. పరోక్షంగా సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగేకు వైభవ్ కౌంటర్ వేశాడు.నన్ను వ్యక్తిగతంగా అంటే నచ్చదుసన్రైజర్స్తో మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తమ మేనేజర్ రోమీ భిందర్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆ బౌలర్ (హింగే)ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన వ్యూహంతోనే బ్యాటింగ్‌కు దిగాను. గత మ్యాచ్‌లో నన్ను అతడు అవుట్ చేశాడు.ఆరోజు నేను నా ఫోన్ చెక్ చేశా. నా గురించి ఎవరు ఏమన్నారో చూశాను. సాధారణంగా నేను ఇలాంటి విషయాలు పట్టించుకోను. అయితే, ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. అది నాపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. తనను టార్గెట్ చేసిన ప్రఫుల్ హింగే బౌలింగ్‌లోనే విశ్వరూపం ప్రదర్శించడం పట్ల పదిహేనేళ్ల వైభవ్ ఈ మేరకు స్పందించాడు.గత మ్యాచ్‌లో తొలి బంతికేకాగా సన్‌రైజర్స్‌తో ఆడిన గత మ్యాచ్‌లో ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో తొలి బంతికే అవుటైన వైభవ్ సూర్యవంశీ... ఈ సారి తొలి ఓవర్లోనే విశ్వరూపం కనబర్చాడు. నాలుగు సిక్స్‌లతో హింగేకు స్వాగతం పలికిన వైభవ్... కమిన్స్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికి సైతం భారీ సిక్స్ కొట్టాడు.మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా అవుట్ కాగా... వైభవ్ ఇచ్చిన క్యాచ్‌ను రైజర్స్ ఫీల్డర్ అనికేత్ వదిలేశాడు. ఇదే జోరులో మరో రెండు సిక్స్‌లు బాదిన సూర్యవంశీ 15 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వైభవ్‌పై హింగే కామెంట్స్సకీబ్ ఓవర్లో వరుసగా 6, 4, 6తో వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా వైభవ్ సెంచరీ వృథా అయింది.కాగా హైదరాబాద్‌లో వైభవ్‌ను అవుట్ చేసిన తర్వాత ప్రఫుల్ హింగే మాట్లాడుతూ.. ‘‘అతడికి (వైభవ్) బౌన్సర్ వేసి అవుట్ చేస్తానని మా వాళ్లకు ముందే చెప్పాను. అతడిని అవుట్ చేయాలన్నదే నా లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా జైపూర్‌లో వైభవ్ హింగేపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పిల్లాడే గానీ... మనసులో ఇంత పెట్టుకున్నాడా? వీడు మామూలోడు కాదు’’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాంA first-ball duck a few days ago to the fastest century by an Indian last night. Vaibhav Sooryavanshi just refuses to give up 👏💗 pic.twitter.com/IqDaWvkAu9— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2026 -
కావ్యా మారన్‌ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. హెన్రిచ్ క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28), సలీల్ అరోరా (24 నాటౌట్) రాణించారు. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ నుంచి సన్‌రైజర్స్‌కు గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, అనూహ్య రీతిలో సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే దూకుడు చూపిస్తూ రాజస్తాన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ముఖ్యంగా రాజస్తాన్ విధ్వంసకరవీరుడు వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపడంలో ఎస్ఆర్హెచ్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఆ సమయంలో సన్‌రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రఫుల్ ఊహించని రీతిలో బ్రేక్ ఇవ్వడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఇదసలు నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా తొలుత ఆశ్చర్యపోయిన కావ్యా మారన్.. ఆ తర్వాత లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు. కావ్యా వైల్డ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Kavya Marian reaction on Vaibhav Sooryavanshi Wicket 😭❤️#SRHvsRR #IPL2026 #TATAIPL #CricketTwitter #IPLMatchDay #CricketFever #Wickets #IPLDrama pic.twitter.com/aMqj8XP2Ay— Rushikesh Vadolkar (@RVadolkar) April 13, 2026ఇక వైభవ్‌తో పాటు రాజస్తాన్ కీలక బ్యాటర్లు ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను కూడా ప్రఫుల్ హింగే వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపించాడు. రవీంద్ర జడేజా (45), డొనోవాన్ ఫెరీరా (69) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులు చేసి రాజస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో 57 పరుగుల తేడాతో రైజర్స్ జయభేరి మోగించింది. ఫలితంగా హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం చేరగా.. రాజస్తాన్ తొలి ఓటమిని చూవిచూసింది. కాగా ఈ రెండు జట్లు ఇప్పటికి ఐదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి.It's all Orange in Hyderabad 🧡A dominant victory by 5⃣7⃣ runs for @SunRisers ✌️They end #RR's unbeaten streak this season 👏Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/ZRdkxcW2jh— IndianPremierLeague (@IPL) April 13, 2026 -
నిరాశలో హింగే.. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?
‘ఈ మ్యాచ్‌తో ప్రఫుల్ హింగే ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు’... పంజాబ్ కింగ్స్‌తో గత మ్యాచ్ టాస్ సమయంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పిన మాట ఇది. రైజర్స్ బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ సబ్‌గా హింగే రావాల్సింది. నిరాశకు లోనైన హింగేదురదృష్టవశాత్తూ జట్టు వ్యూహాల్లో భాగంగా చివరి నిమిషంలో అతడిని కాదని జయదేవ్ ఉనాద్కట్‌ను రైజర్స్ ఆడించింది. దీంతో హింగే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ చాన్స్ వచ్చిన ఆనందం అతనిలో ఆవిరైంది. ఒక 24 ఏళ్ల యువ ఆటగాడికి మానసికంగా ఇది ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. Hang it in the Louvre 🤌pic.twitter.com/3VbpYVQumP— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026అయితే ఈ బాధతో వచ్చిన కసిని అతను తాజా మ్యాచ్‌లో చూపించినట్లున్నాడు. రాజస్తాన్ రాయల్స్ డేంజరస్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి.. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు.దేశవాళీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రఫుల్ 2024–25 సీజన్‌తోనే రంజీ ట్రోఫీలో అడుగు పెట్టాడు. ఎరుపు బంతితోనే బాగా ప్రభావం చూపించగల పేసర్‌గా గుర్తింపు పొందిన అతను 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 27 వికెట్లు పడగొట్టాడు. కేవలం 6 వన్డేలే ఆడిన ప్రఫుల్‌కు ఐపీఎల్‌కు ముందు ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఉమేశ్ యాదవ్‌ను అభిమానించే ప్రఫుల్ అభిమాన బౌలర్ ప్యాట్ కమిన్స్. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ ఒక్కసారిగా సీన్లోకి రాలేదు. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?2022 నుంచి హింగే చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్నాడు. భవిష్యత్తు కోసం ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సానబెట్టే బీసీసీఐ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన ఆటగాళ్లలో ప్రఫుల్ కూడా ఉన్నాడు. 2024లో బ్రిస్బేన్‌లో జరిగిన పేస్ బౌలర్ల ప్రత్యేక శిక్షణా శిబిరంలో కూడా అతను పాల్గొన్నాడు. విదర్భ టి20 లీగ్‌లో నెకో మాస్టర్ బ్లాస్టర్స్ జట్టు విజేతగా నిలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ ట్రయల్స్‌లో జట్టు బౌలింగ్ కోచ్ ప్రఫుల్ ప్రతిభను గుర్తించాడు. వేలంలో అతని కనీస ధర రూ. 30 లక్షలకు సన్‌రైజర్స్ తీసుకుంది. మరోవైపు.. బిహార్‌కు చెందిన పేసర్ సాకిబ్ హుస్సేన్ కూడా ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2024లో కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా, ఈసారి రైజర్స్ రూ. 30 లక్షలకు ఎంచుకుంది. చదవండి: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ -
హీరో నుంచి జీరో, బొక్క బోర్ల పడ్డ బుడోడు....
-
వైభవ్‌ను ఔట్ చేయడంపై హింగే సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అరంగేట్రం పేసర్లు ప్రఫుల్ హింగే (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా హింగే పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసి రాయల్స్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.తొలి ఓవర్లో హింగే ఔట్ చేసిన ముగ్గురు బ్యాటర్లు (వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, ప్రిటోరియస్) డకౌట్ కావడం విశేషం. వీరిలో వైభవ్ వికెట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌పై అతి భారీ అంచనాలు ఉండేవి. ఈ సీజన్లో అతను తొలి మ్యాచ్ నుంచి విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దండయాత్ర తప్పదని అంతా అనుకున్నారు.అయితే వైభవ్ విషయంలో హింజ్ ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను అతను రెండో బంతికే ఔట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హింగే సంధించిన అద్భుతమైన డెలివరీ కారణంగా వైభవ్ గోల్డెన్ డకౌటయ్యాడు. హింగే వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో బంతి వైభవ్ బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ సలీల్ అరోరా చేతుల్లోకి వెళ్లింది.వైభవ్ వికెట్‌పై మ్యాచ్ అనంతరం హింగే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ముందే ప్లాన్ చేశాను. వైభవ్‌కి బౌన్సర్ వేసి ఔట్ చేస్తానని 2–3 మందికి చెప్పాను. నా తొలి మ్యాచ్‌లో నాలుగైదు వికెట్లు తీస్తానని గతేడాదే రాసుకున్నాను. పవర్‌ప్లేలో ఆధిపత్యం చూపుతానని ఊహించాను. అదే నిజమైంది అని అన్నాడు. హింగే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అతని అరంగేట్రంపై ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడని స్పష్టమవుతుంది. నిన్నటి మ్యాచ్‌లో ప్లాన్ ప్రకారమే వైభవ్‌ను ఔట్ చేసిన విషయమూ తెలుస్తుంది. తన అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్న హింగే రాబోయే మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్కు కీలక బౌలర్‌గా మారిపోయాడు. రాత్రిరాత్రే స్టార్ డమ్ సంపాదించి హీరో హైప్ తెచ్చుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, ఇషాన్ కిషన్ (91) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో హింగే, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ను రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) ఆదుకున్నారు. ఆఖర్లో తుషార్ దేశ్‌పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది. -
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
-
ప్రఫుల్ ప్రచండ రూపం
217 పరుగుల లక్ష్యఛేదన... అందరి కళ్లూ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే... ఎన్ని సిక్సర్లు కొడతాడు, రాజస్తాన్ ఎంత వేగంగా విజయం సాధిస్తుందనేదానిపైనే చర్చ... కానీ సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే ఒక్కసారిగా దూసుకొచ్చాడు. రెండో బంతికే వైభవ్ డకౌట్... నాలుగో బంతికి జురేల్ డకౌట్... చివరి బంతికి ప్రిటోరియస్ డకౌట్... ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడటం మొదటిసారి కాగా, అరంగేట్ర మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ చరిత్రకెక్కాడు. ఆపై రాజస్తాన్ స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు. అంతే... అక్కడే సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిచేసింది... మిగతా ఆటంతా ఇక లాంఛనంగానే మిగిలింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో రెండు సార్లు 200కుపైగా స్కోరు చేసి కూడా ఓటమిని మూటగట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి భారీ స్కోరును కాపాడుకుంది. అయితే జట్టు బలహీనతగా కనిపించిన బౌలింగ్ విభాగం ఇప్పుడు మ్యాచ్‌ను గెలిపించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో ఇషాన్ కిషన్ బృందం 57 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. డొనొవాన్ ఫెరీరా (44 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (32 బంతుల్లో 45; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 72 బంతుల్లో 118 పరుగులు జోడించి పోరాడినా అది సరిపోలేదు. కీలక భాగస్వామ్యం... అభిషేక్ శర్మ (0) వెనుదిరిగిన తర్వాత ట్రవిస్ హెడ్ (18) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఆర్చర్ ఓవర్లో 4, 6 కొట్టిన అతను బర్గర్, సందీప్ ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలో జట్టు 51 పరుగులు చేయగలిగింది. ఇషాన్, క్లాసెన్ భాగస్వామ్యంలో రైజర్స్ ఇన్నింగ్స్ దూసుకుపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 39 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. బిష్ణోయ్ ఓవర్లో సిక్స్‌తో 30 బంతుల్లో కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తుషార్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయిన కిషన్... ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే సెంచరీకి చేరువలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే క్లాసెన్ కూడా అవుట్ కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్స్‌లు) దూకుడుతో స్కోరు 200కు చేరువైంది. చివర్లో సలీల్ అరోరా (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరికొన్ని కీలక పరుగులు జోడించాడు. అభిషేక్ మళ్లీ డకౌట్... సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ హైదరాబాద్ అభిమానులను మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. సొంత మైదానంలో అతని మెరుపు బ్యాటింగ్‌ను చూసేందుకు ఎంతో ఉత్సాహంతో మైదానానికి వచ్చిన ఫ్యాన్స్ రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌ను చూడాల్సి వచ్చింది. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో రెండో బంతికి సున్నా చుట్టిన అభిషేక్ ఈసారి తొలి బంతికే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నితీశ్ మళ్లీ మూడు సిక్స్‌ల మోత... హైదరాబాద్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేశ్ రాఠీ వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు బాదిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లాంగాన్ మీదుగా రెండు వరుస సిక్స్‌లు బాదిన అతను అదే ఓవర్ చివరి బంతికి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా మరో సిక్స్‌తో తన ధాటిని ప్రదర్శించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) బిష్ణోయ్ (బి) ఆర్చర్ 0; హెడ్ (సి) ఫెరీరా (బి) పరాగ్ 18; ఇషాన్ కిషన్ (సి అండ్ బి) సందీప్ 91; క్లాసెన్ (సి) పరాగ్ (బి) తుషార్ 40; నితీశ్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 28; సలీల్ (నాటౌట్) 24; అనికేత్ (రనౌట్) 6; దూబే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–0, 2–55, 3–143, 4–162, 5–195, 6–209. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–2, బర్గర్ 4–0–31–0, సందీప్ 4–0–52–1, తుషార్ 4–0–55–1, పరాగ్ 1–0–5–1, బిష్ణోయ్ 3–0–35–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) నితీశ్ (బి) సాకిబ్ 1; వైభవ్ (సి) అరోరా (బి) ప్రఫుల్ హింగే 0; జురేల్ (బి) ప్రఫుల్ హింగే 0; ప్రిటోరియస్ (సి) నితీశ్ (బి) ప్రఫుల్ హింగే 0; పరాగ్ (సి) అభిషేక్ (బి) ప్రఫుల్ హింగే 4; జడేజా (సి) అరోరా (బి) ఇషాన్ మలింగ 45; ఫెరీరా (బి) సాకిబ్ 69; ఆర్చర్ (సి) ప్రఫుల్ హింగే (బి) సాకిబ్ 2; తుషార్ (సి) కిషన్ (బి) ఇషాన్ మలింగ 25; బిష్ణోయ్ (సి) కిషన్ (బి) సాకిబ్ 0; బర్గర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–1, 4–2, 5–9, 6–127, 7–129, 8–140, 9–140, 10–159. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–34–4, సాకిబ్ 4–0–24–4, ఇషాన్ మలింగ 4–0–31–2, శివాంగ్ 3–0–28–0, నితీశ్ 2–0–19–0, హర్ష్ దూబే 2–0–22–0. -
హడలెత్తించిన ప్రఫుల్, సాకిబ్.. ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (91) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్లాసెన్ (40) పరుగులు చేశాడు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, తుషార్, పరాగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనోవన్ ఫెరీరా (69) టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా (45) పర్వాలేదనిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్‌లు చెరో 4 వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ను శాసించారు. సంచలన బౌలింగ్‌తో మెరిసిన ప్రఫుల్ హెంగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే! -
తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో సంచలనం నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్రఫుల్ హింగే సంచలన ప్రదర్శనతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన ప్రఫుల్ నాలుగో బంతికి ధ్రువ్ జురేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివరి బంతికి ప్రిటోరియస్‌ను వెనక్కి పంపాడు. తద్వారా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ నిలిచాడు. గతంలో తొలి ఓవర్లో బౌలర్లు 32 సార్లు రెండు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ తరఫున 2024లో ఇదే రాజస్తాన్‌పై భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రఫుల్ పటేల్ బౌలింగ్‌లో ఔటైన ముగ్గురు రాజస్తాన్ బ్యాటర్లు డకౌట్లుగానే వెనుదిరగడం విశేషం.ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు ఓవర్లలో నాలుగు అంతకంటే ఎక్కువ పడగొట్టిన బౌలర్ల జాబితాలోనూ ప్రఫుల్ హింగే చోటు దక్కించు కున్నాడు. ప్రఫుల్హింగే కంటే ముందు ఇషాంత్ శర్మ, షోయ్ అక్తర్, అజిత్ చండీలా, దావల్ కులకర్ణి, పాట్ కమిన్స్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ ఈ ఫీట్ సాధించారు.ఎవరీ ప్రఫుల్ హింగే?విదర్భకు చెందిన ప్రఫుల్ హింగే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. వేలంలో ఎస్ఆర్హెచ్ ప్రఫుల్ హింగేను రూ. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్కు బ్యాకప్ బౌలర్‌గా వచ్చిన ప్రఫుల్ హింగే రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ప్రఫుల్ హింగే 10 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 27 వికెట్లు తీశాడు. 6 లిస్ట్-ఏ మ్యాచ్‌లాడి 5 వికెట్లు తీశాడు. అయితే తన కెరీర్లో ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడడం గమనార్హం.LADIES & GENTLEMEN - MEET PRAFUL HINGE:- The first bowler in history of the IPL to take 3 wickets in the opening over. 🥶🔥 pic.twitter.com/KuYFeai4HT— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026🚨 HISTORY CREATED BY PRAFUL HINGE. 🚨- Hinge becomes the first bowler in 19 years of the IPL to claim 3 wickets in the opening over. 🤯🔥 pic.twitter.com/osukqE6HBg— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026చదవండి: గోల్డెన్ డక్.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు


