prajasakti
-
ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి భవనాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శుక్రవారం రోజున సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యం, సిబ్బందికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్) జీవీడీ కృష్ణమోహన్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధుతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా) -
కాకినాడలో జనసేన కార్యకర్తల వీరంగం
-
సమాచారాన్ని సరకుగా మార్చేస్తున్నారు
పీపుల్స్ డెమోక్రసీ సంపాదకులు ప్రకాష్ కారత్ విజయవాడ సెంట్రల్: కార్పొరేట్ గుప్పెట్లోకి మీడియా వెళ్లడంతో సమాచారాన్ని సరుకుగా మార్చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రసీ సంపాదకులు ప్రకాష్ కారత్ అన్నారు. ‘ప్రజాశక్తి’ 35వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో ‘వర్తమాన పరిస్థితులు - మీడియా’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కారత్ మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, హిందుత్వ అజెండా తీవ్రతరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యాపారం, రాజకీయం పెనవేసుకొని దుష్ట కూటమిగా మారిందన్నారు. నలభయ్యేళ్ల పత్రికా ప్రస్థానంలో తాను ఏనాడూ నయవంచన చేసుకోలేదని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి చెప్పారు. ప్రత్యామ్నాయ పత్రికలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని తెలిపారు. మోదీభావజాలంతో పనిచేసే మీడియా ఎక్కువైందన్నారు. నేటి జర్నలిజంలో సత్యశోధన కష్టంగా మారిందని విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారి అన్నారు. ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విశాలాంధ్ర, నవతెలంగాణ సంపాదకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు, ఎస్.వీరయ్య, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ చైర్మన్ వి.కృష్ణయ్య ప్రసంగించారు.