అండర్ స్టాండింగ్ ఉంది
అట్టకత్తి ఫేమ్ దినేష్‌కు తనకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండటంతో చిత్ర అవుట్‌పుట్ బాగా వచ్చిందని నటి బిందుమాధవి తెలిపారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం తమిళుక్కు ఎన్ 1 ఐ అళుత్తువుం. మరో జంటగా నకుల్, ఐశ్వర్యదత్ నటిస్తున్నారు. రామ్ ప్రకాష్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీఎల్‌కే రాక్ సినిమా పతాకంపై నిర్మాత వి.చంద్రన్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం వివరాలను తెలియచేయడానికి చిత్ర యూనిట్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిందుమాధవి మాట్లాడారు. తానింతవరకు నటించిన చిత్రాల్లోనే వైవిధ్యభరిత పాత్రను ఈ చిత్రంలో పోషించానని చెప్పారు. చిత్ర హీరో దినేష్‌కు తనకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో తాము నటించిన సన్నివేశాలకు మంచి అవుట్‌ఫుట్ వచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు, ఛాయాగ్రాహకుడితోను తనకు మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని తెలిపింది. అనంతరం ఈ చిత్రానికి పని చేసిన సహాయ దర్శకులందరినీ వేదిక పైకి పిలిచి వీరి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. భాషరాని తనకు వీరి సహకారం లేనిదే పాత్రకు న్యాయం చేయడం సాధ్యం కాదని వారి శ్రమను బిందుమాధవి ప్రశంసించారు.