కలాం పాత్రలో ఇర్ఫాన్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతున్నాడు. మిసైల్ మ్యాన్‌గా భారత రక్షణ వ్యవస్థ విశేష సేవలు అందించటంతో పాటు భారత రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్ కలాం పాత్రలో నటించనున్నాడు. మరాఠీ నిర్మాత ప్రమోత్ గోరె, కలాం జీవితంపై సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలాం సాధించిన విజయాలతో పాటు ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు.
ఇప్పటికే కలాం జీవితంపై ఎంతో రీసెర్చ్ చేసిన ప్రమోద్, ఆయన కుటుంబసభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఏపీజే అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను జూలై లేదా ఆగస్టులో ప్రారంభించి 2017లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ ను కలాం పాత్రకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్న నిర్మాత ప్రమోద్, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయనున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.