pratapa reddy
-
గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి
గన్‌ఫౌండ్రీ/కవాడిగూడ(హైదరాబాద్): సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కుల, మత పిచ్చితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నటువంటి వారికి సురవరం జీవితం ఓ సమాధానమన్నారు. ఆయన లాంటి వ్యక్తిత్వమున్న నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, సురవరం ప్రతాప్‌రెడ్డి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అందజేసింది. పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, రచయిత ఈమణి శివనాగిరెడ్డి, డాక్టర్ సింకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్.శేషశాస్త్రి, జె.చెన్నయ్యకు రూ.లక్ష చెక్కుతో పాటు స్మారక పురస్కారాలను ప్రదానం చేసింది. ప్రజల పక్షాన నిలిచిన సురవరం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మం త్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. శనివారం సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
పెన్నా చార్జిషీట్ విచారణకు స్వీకరణ
జగన్, ప్రతాప్‌రెడ్డి ఇతర నిందితులకు సమన్లు సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ కంపెనీల్లో పెన్నా సిమెంట్స పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంపై దాఖలైన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ చార్జిషీట్‌కు సీసీ నంబర్‌ను 26/2013గా కేటాయించారు. చార్జిషీట్లో నిందితులుగా ఉన్న జగన్, పెన్నా సిమెంట్స అధినేత ప్రతాపరెడ్డి సహా ఇతర నిందితులకు సమన్లు జారీచేసిన కోర్టు నవంబర్ 11న ప్రత్యక్షంగా హాజరుకావాలని పేర్కొంది. నిందితులంతా కోర్టు ముందు హాజరై పూచీ కత్తు బాం డ్లను సమర్పించాల్సి ఉంటుంది. రిమాండ్‌లో ఉన్న విజయసాయిరెడ్డికి పీటీ వారెంట్ జారీ చేశారు. 11న ఆయన్ను ప్రత్యక్షంగా హాజరుపర్చాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ‘‘పెన్నా సిమెంట్సకు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు జిల్లాలో 304 ఎకరాల్లోని గనులకు ప్రాస్పెక్టివ్ లెసైన్‌స మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 82.1 ఎకరాల మైనింగ్ లీజును రెన్యువల్ చేశారు. బంజారాహిల్సలో పెన్నా సిమెంట్స యజమాని నిర్మించిన హోటల్ కోసం నిబంధనలు సడలించారు. ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కి చెందిన కం పెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడిగా పెట్టారు’’ అని సీబీఐ చార్జిషీట్లో ఆరోపించింది. -
సీఎం చెప్పినందువల్లే వెనక్కి తగ్గాం: ఏరాసు
ఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినందు వల్లే రాజీనామా అంశంపై వెనక్కి తగ్గామని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు. సీమాంధ్ర మంత్రుల రాజీనామాలకు సంబంధించి సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో అందరం కలిసి సమిష్టి నిర్ణయానికి వస్తామన్నారు. సీఎంను కలిసిన రాజీనామాల అంశంపై మాట్లాడతామని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ఒకప్రక్క అంగీకరిస్తూనే.. ఇంకా ముందుం నుంచి చేస్తే బాగుండేదన్నారు. లక్షలాది సీమాంధ్రలు ఢిల్ల్లీలో ఆందోళన చేస్తే విభజన ప్రకటన వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుదని మరోమంత్రి టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో విద్యా సంస్థలు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. 55 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఈ నెల 30 వరకు మూసివేయనున్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సీమాంధ్ర నేతలు ఆందోళన చెందుతూ రాజీనామాల అంశంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు.