ఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినందు వల్లే రాజీనామా అంశంపై వెనక్కి తగ్గామని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు. సీమాంధ్ర మంత్రుల రాజీనామాలకు సంబంధించి సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో అందరం కలిసి సమిష్టి నిర్ణయానికి వస్తామన్నారు. సీఎంను కలిసిన రాజీనామాల అంశంపై మాట్లాడతామని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ఒకప్రక్క అంగీకరిస్తూనే.. ఇంకా ముందుం నుంచి చేస్తే బాగుండేదన్నారు. లక్షలాది సీమాంధ్రలు ఢిల్ల్లీలో ఆందోళన చేస్తే విభజన ప్రకటన వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుదని మరోమంత్రి టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో విద్యా సంస్థలు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. 55 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఈ నెల 30 వరకు మూసివేయనున్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సీమాంధ్ర నేతలు ఆందోళన చెందుతూ రాజీనామాల అంశంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు.