జగన్, ప్రతాప్‌రెడ్డి ఇతర నిందితులకు సమన్లు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ కంపెనీల్లో పెన్నా సిమెంట్‌స పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంపై దాఖలైన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ చార్జిషీట్‌కు సీసీ నంబర్‌ను 26/2013గా కేటాయించారు. చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న జగన్, పెన్నా సిమెంట్‌స అధినేత ప్రతాపరెడ్డి సహా ఇతర నిందితులకు సమన్లు జారీచేసిన కోర్టు నవంబర్ 11న ప్రత్యక్షంగా హాజరుకావాలని పేర్కొంది. నిందితులంతా కోర్టు ముందు హాజరై పూచీ కత్తు బాం డ్లను సమర్పించాల్సి ఉంటుంది. రిమాండ్‌లో ఉన్న విజయసాయిరెడ్డికి పీటీ వారెంట్ జారీ చేశారు. 11న ఆయన్ను ప్రత్యక్షంగా హాజరుపర్చాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ‘‘పెన్నా సిమెంట్‌సకు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు జిల్లాలో 304 ఎకరాల్లోని గనులకు ప్రాస్పెక్టివ్ లెసైన్‌స మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 82.1 ఎకరాల మైనింగ్ లీజును రెన్యువల్ చేశారు. బంజారాహిల్‌సలో పెన్నా సిమెంట్‌స యజమాని నిర్మించిన హోటల్ కోసం నిబంధనలు సడలించారు. ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కి చెందిన కం పెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడిగా పెట్టారు’’ అని సీబీఐ చార్జిషీట్‌లో ఆరోపించింది.
పెన్నా చార్జిషీట్ విచారణకు స్వీకరణ
Published Tue, Oct 1 2013 1:41 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement