Penna Cements
-
అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సంస్థల విలీనం
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్), పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను విలీనం చేసుకోనున్నట్లు అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. వచ్చే 9–12 నెలల వ్యవధిలో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.సంస్థ స్వరూపాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు, గవర్నెన్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ఈ కన్సాలిడేషన్ ఉపయోగపడగలదని ఒక ప్రకటనలో వివరించింది. అదానీ గ్రూప్‌లో అంబుజా సిమెంట్స్ భాగంగా ఉంది. 2023లో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్‌లో కంపెనీకి 58.08 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ సంస్థ పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసింది.విలీన స్కీము ప్రకారం ప్రతి 100 ఎస్ఐఎల్ షేర్లకు గాను అంబుజా సిమెంట్స్ 12 షేర్లను జారీ చేస్తుంది. అలాగే, పెన్నా సిమెంట్స్ ఈక్విటీ షేర్హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ. 321.50 లభిస్తుంది. ఎస్ఐఎల్, పెన్నా సిమెంట్స్ షేర్ల ముఖ విలువ రూ. 10గా ఉండగా, అంబుజా సిమెంట్స్ షేరు ముఖవిలువ రూ. 2గా ఉంది. -
‘తెలుగురాష్ట్రాలకు చెందిన సంస్థ అప్పు మేమే తీరుస్తాం’
తెలుగురాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంట్‌కు ఉన్న రూ.3,000 కోట్ల అప్పును తామే తీరుస్తామని అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఇటీవల పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు అంబుజా ప్రకటించింది. దాంతో కంపెనీ ఇతర సంస్థలకు బకాయిపడిన రుణాలను సైతం తీరుస్తామని అంబుజా సిమెంట్స్ హామీ ఇచ్చింది.పెన్నా సిమెంట్స్‌లోని 100 శాతం వాటాను అదానీ గ్రూప్‌లో భాగంగా ఉన్న అంబుజా సిమెంట్స్ రూ.10,422 కోట్లుకు కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరో 3-4 నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని, ఆ తర్వాత పెన్నాకు ఉన్న రుణాన్ని చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంబుజా వద్ద ఇప్పటికే రూ.15,676 కోట్ల మిగులు నిల్వలున్నాయి. పెన్నా అప్పులను ఈ మిగులు నుంచి చెల్లించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెన్నా రుణంపై వడ్డీ వ్యయాలను తగ్గించడంతో పాటు, క్రెడిట్ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘ఏఏఏ’గా మార్చేందుకు ఇది సహాయపడుతుందని అంబుజా అంచనావేస్తుంది.సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్ రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
అంబుజా చేతికి పెన్నా సిమెంట్
సాక్షి, అమరావతి/హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంటును అంబుజా సిమెంట్ కొనుగోలు చేసింది. అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్, పి. ప్రతాప్ రెడ్డి కుటుంబానికి చెందిన పెన్నా సిమెంట్ 100 శాతం వాటాను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియచేసింది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్ రంగాల్లో విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది. ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ అనుమతులు అన్నీ పూర్తి చేసుకొని మూడు నుంచి 4 నెలల్లో ఈ అక్విజిషన్ ప్రక్రియ పూర్తవుతుందని అంబుజా సిమెంట్ సీఈవో అజయ్ కపూర్ తెలిపారు. అలాగే పెన్నా సిమెంట్‌కు ఉన్న సున్నపురాయి గనులు కూడా అదానీ గ్రూపునకు కలిసి వస్తాయన్నారు.తాడిపత్రితో ప్రారంభంపి.ప్రతాప్ రెడ్డి కుటుంబం 1994లో అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తలారి చెరువులో ఏడాదికి 0.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో తొలి సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి వేగంగా విస్తరించింది. ప్రస్తుతం తాడిపత్రి యూనిట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 1.8 మిలియన్ టన్నులకు చేరడమే కాకుండా అక్కడ 1.3 మిలియన్ టన్నుల క్లింకర్ యూనిట్‌నుకూడా ఏర్పాటు చేశారు. అదే జిల్లా బోయరెడ్డి పల్లి వద్ద మరో రెండు మిలియన్ టన్నుల సిమెంట్, 4 మిలియన్ టన్నుల క్లింకర్, 25 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తాండూరు వద్ద రెండు మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు, 1.5 మిలియన్ టన్నుల క్లింకర్, నల్గొండ జిల్లా గణే‹Ùపహడ్ వద్ద 1.2 ఎంటీ సిమెంట్, 1 ఎంటీ క్లింకర్, 7 డబ్ల్యూహెచ్ వేస్ట్ హీట్ రికవరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాజస్థాన్‌లో జోథ్‌పూర్‌లో నిర్మిస్తున్న 2 ఎంటీ, కృష్ణపట్నం వద్ద నిర్మిస్తున్న మరో 2 ఎంటీ యూనిట్లు మరో ఆరు నుంచి ఏడాదిలోగా అందుబాటులోకి రానున్నాయి. నల్గొండ జిల్లా గణేష్ పçహాడ్ వద్ద 77 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను పెన్నా సిమెంట్ కలిగి ఉంది. ఈ ఒప్పందంతో కోల్‌కతా, గోపాల్పూర్, కరైకల్, కొచ్చి, కొలంబోలోని బల్క్ సిమెంట్ టెరి్మనల్స్ ద్వారా అదానీ సీ ట్రాన్స్‌పోర్టేషన్ లాజిస్టిక్ సామర్థ్యం పెరుగుతుందని కపూర్ చెప్పారు. -
మార్కెట్ రన్.. ఐపీఓలు ధనాధన్!
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. దీంతో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 61,000 పాయింట్ల మైలురాయినీ అధిగమించింది. ఈ ప్రభావంతో మరోపక్క ప్రైమరీ మార్కెట్ సైతం స్పీడందుకుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. మరిన్ని సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు సై అంటున్నాయి. వెరసి 2017లో ప్రైమరీ మార్కెట్ సాధించిన నిధుల సమీకరణ రికార్డ్ తుడిచిపెట్టుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముంబై: గతేడాదిని మించుతూ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనూ పలు సుప్రసిద్ధ కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటోసహా పలు కంపెనీలు విజయవంతంగా లిస్ట్‌కాగా.. ఇకపైనా మరిన్ని సంస్థలు ప్రైమరీ మార్కెట్ తలుపు తట్టనున్నాయి. తద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్నాయి. సుమారు 35 కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూలకు రానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడిగా ఈ కంపెనీలు రూ. 80,000 కోట్లను సమకూర్చుకోనున్నట్లు అంచనా వేశారు. ఫలితంగా 2017లో ఐపీవోల ద్వారా 35 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 67,147 కోట్ల రికార్డు మరుగున పడనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాదిలో లిస్టింగ్‌ను సాధిస్తే చరిత్రాత్మక రికార్డు నమోదవుతుందని తెలియజేశారు. పేటీఎమ్ భారీగా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో పలు ప్రయివేట్ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్‌గా ఆవిర్భవించనున్నాయి. మార్కెట్లు నిలకడగా కొనసాగితే డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా 35 కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. క్యూ3లో ఐపీవోకు రానున్న జాబితాలో రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన పేటీఎమ్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అధిక స్థాయిలో నిధులను ఆశిస్తున్న ఇతర కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 7,300 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్(రూ.7,000 కోట్లు), పాలసీ బజార్ (రూ. 6,000 కోట్లు), ఎమ్క్యూర్ ఫార్మా(రూ. 5,000 కోట్లు), వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), బ్యూటీ ప్రొడక్టుల సంస్థ నైకా(రూ. 4,000 కోట్లు), పెన్నా సిమెంట్స్ తదితరాలున్నాయి. 14 కంపెనీలు రెడీ క్యూ3లో లిస్టింగ్ బాట పట్టనున్న ఇతర సంస్థలలో పారదీప్ ఫాస్ఫేట్స్, వేదాంత్ ఫ్యాషన్స్, సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, నార్తర్న్ ఆర్క్ సైతం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు రూ. 2,000–2,500 కోట్ల స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టే వీలున్నట్లు తెలియజేశాయి. ఇప్పటికే 14 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్, గో ఎయిర్‌లైన్స్, రుచీ సోయా ఇండస్ట్రీస్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ చేరాయి. ఇవి రూ. 22,000 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఈ బాటలో ఇప్పటికే మరో 64 కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడం గమనార్హం! నాణ్యమైన కంపెనీలు చేపట్టే ఐపీవోల కోసం కొంతమంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్ఐసీ వంటి భారీ ఇష్యూల సమయంలో సెకండరీ మార్కెట్లో కొంతమేర లిక్విడిటీ కొరత నెలకొనవచ్చని వివరించారు. 6 కంపెనీలకు సెబీ ఓకే పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. జాబితాలో నైకా, అదానీ విల్మర్, స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్, లేటెంట్ వ్యూ అనలిటిక్స్, సిగాచీ ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది మే– ఆగస్ట్ మధ్యకాలంలో దరఖాస్తు చేశాయి. వీటికి ఈ నెల 11–14 మధ్య అనుమతులు మంజూరయ్యాయి. మరోవైపు ఐఎల్ఎస్ హాస్పిటల్స్ నిర్వాహక సంస్థ జీపీటీ హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 450–500 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పెన్నా సిమెంట్స్ రూ1,300 కోట్లు... పబ్లిక్ ఇష్యూలో భాగంగా హైదరాబాద్ కంపెనీ పెన్నా సిమెంట్స్ రూ. 1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. కాగా.. ఐపీవోలో భాగంగా లేటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ. 474 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో రూ. 126 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఈ బాటలో సెల్యులోజ్ ఆధారిత ప్రొడక్ట్ తయారీ కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్ ఐపీవోకింద 76.95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి!
సాక్షి, అమరావతి : జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏసియాలో పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీలు పెట్టిన రూ.53 కోట్ల పెట్టుబడులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ‘లంచం’గా పరిగణించడాన్ని మనీలాండరింగ్ అప్పిలెట్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఈ పెట్టుబడులను ‘లంచం’ అని చెప్పేందుకు ప్రత్యక్ష, నిర్ధిష్టమైన, విశ్వసించదగ్గ ఆధారాలు ఏమీలేవని తేల్చిచెప్పింది. పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీల ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జుడికేటింగ్ అథారిటీల తీరు సరికాదంది. క్విడ్ ప్రో కో కింద లబ్ధి చేకూర్చినందుకు జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏసియాలో రూ.53 కోట్లు పెట్టుబడులు పెట్టామని ఆరోపిస్తూ.. ఈడీ తమ ఆస్తులను జప్తుచేయడాన్ని సమర్థిస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ 2015లో జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెన్నా సిమెంట్స్, పయనీర్ ఇన్‌ఫ్రాలు అప్పిలెట్ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన అప్పిలెట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ ఇటీవల తన తీర్పు వెలువరించారు. అభియోగాలు నమోదు కాక ముందే.. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాక ముందే.. పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్‌ఫ్రాలు మనీలాండరింగ్ కింద ‘షెడ్యూల్డ్ నేరం’ చేశాయని అడ్జుడికేటింగ్ అథారిటీ చెప్పడాన్ని అప్పిలెట్ ట్రిబ్యునల్ తన తీర్పులో ఆక్షేపించింది. అలాగే, జప్తుచేసిన ఆస్తులు నేరానికి సంబంధించినవేనని కూడా నిర్ధారించడాన్ని తప్పుబట్టింది. అదే రీతిలో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు జారీచేసిన వాటాలకు ఎటువంటి విలువ లేదన్న ఈడీ వాదనను అప్పిలెట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. బహిరంగ మార్కెట్లో ఈ వాటాల విలువ పెరిగిందన్న విషయాన్ని గుర్తుచేసింది. పెన్నా సిమెంట్స్‌కు భూముల బదలాయింపులో చట్ట నిబంధనలను అనుసరించలేదన్న ఈడీ వాదనను సైతం ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ వాదన ఎంతమాత్రం సరికాదంది. చట్ట నిబంధనలకు లోబడే భూముల బదలాయింపు జరిగిందనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలున్నాయంది. ఆస్తుల జప్తు ఖరారు ఉత్తర్వులను జారీచేసే ముందు ఈ ఆధారాలను న్యాయబద్ధంగా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. జప్తు నుంచి హోటల్ భవనం విడుదల.. ‘సీబీఐ చార్జిషీట్లో పెన్నా సిమెంట్స్ తదితరులపై ఆరోపణలున్నాయి. అయితే, మేం ఇప్పుడు వాటి జోలికి వెళ్లడంలేదు. ఈ ఆరోపణలు వాస్తవమో కాదో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేలుస్తుంది. ప్రస్తుతం మేం చూసేది ఏమిటంటే మనీలాండరింగ్ కింద ఈడీ చేసిన దర్యాప్తు, అలాగే.. ఆస్తుల జప్తునకు జారీచేసిన ఉత్తర్వులు చట్ట నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అన్నదే.’ అని అప్పిలెట్ ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. పెన్నా సిమెంట్స్ దాఖలు చేసిన అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. పెన్సా సిమెంట్స్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ గడువు ముగిసిన నేపథ్యంలో అనంతపురం జిల్లా, యాడకి మండలంలో జప్తు చేసిన 231 ఎకరాల భూమిని జప్తు నుంచి విడుదల చేయడంలేదంది. అయితే, ఆ భూమిని తమ స్వాధీనంలోకి తీసుకోరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించింది. ఇక పయనీర్ ఇన్ఫ్రా విషయానికొస్తే.. ఇది బంజారాహిల్స్‌లో నిర్మించిన హోటల్ భవనానికి సంబంధించి అడ్జుడికేటింగ్ అథారిటీ జారీచేసిన జప్తు ఖరారు ఉత్తర్వులను సవరించింది. ఆ భవనాన్ని జప్తు నుంచి విడుదల చేస్తూ, ఆ భవనం తాలుకు విలువను ఫిక్స్డ్ డిపాజిట్ కింద వసూలు చేసుకోవాలని ఈడీకి స్పష్టంచేసింది. రూ.6.69 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ కింద రెండు నెలల్లో ఈడీకి జమచేయాలని పయనీర్ ఇన్ఫ్రాను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈడీ ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఆ భవనంలోని అంతస్తులను విక్రయించరాదని పయనీర్ ఇన్ఫ్రాను అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ‘రూ.1.5 కోట్ల లాభం కోసం ఎవరైనా రూ.53 కోట్లు పెట్టుబడి పెడతారా! ఎలా సాధ్యమో కూడా అర్థంకాకుండా ఉంది. ఇలా పెట్టుబడి పెట్టడాన్ని లంచం అనడం ఊహకు అందనిది. ‘సాక్షి’లో పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీ పెట్టుబడులు నిఖార్సైన వ్యాపార లావాదేవీలు. ఇందుకు సాక్ష్యం.. ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే సర్క్యులేషన్ పరంగా ‘సాక్షి’ రెండో అతిపెద్ద పత్రికగా ఆవిర్భవించడమే. జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏసియాలో పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీ పెట్టిన రూ.53 కోట్ల పెట్టుబడులు ‘లంచం’ అని చెప్పేందుకు ఎటువంటి ప్రత్యక్ష, నిర్ధిష్టమైన, విశ్వసించదగ్గ ఆధారాలు ఏమీలేవు.’ ‘పెన్నా సిమెంట్స్ కోసం అవసరమైన భూములను తీసుకునే విషయంలో రైతులను, అసైనీదారులను బలవంతం చేశారనడం శుద్ధ అబద్ధం. అంతేకాక.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాయింట్ డైరెక్టర్‌ది ఊహాతీత కట్టుకథ. ఒకవేళ అలా బలవంతం చేయడమే నిజమైతే పెన్నా సిమెంట్స్‌పై రైతులు, అసైనీదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదుచేసి ఉండేవారు. అటువంటి ఫిర్యాదుగానీ, సివిల్ ప్రొసీడింగ్స్గానీ ఏవీ పెండింగ్‌లో లేవని దర్యాప్తు అధికారి ద్వారా తెలుసుకున్నాం. వాణిజ్య ఆస్తులను జప్తుచేసే ముందు ఆ ఆస్తులపై వందల మంది ఉద్యోగుల భవిష్యత్తు, జీవితాలు ఆ«ధారపడి ఉంటాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల ఇటువంటి ఆస్తుల జప్తు కొనసాగరాదు. ఇందుకు బదులు ఆ ఆస్తుల విలువను డిపాజిట్ చేయించుకోవాలి.’ ‘జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్నది పెన్నా సిమెంట్స్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల నిర్ణయం. 1996లో కూడా జగన్ కంపెనీల్లో ప్రతాప్‌రెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఇందుకు మా ముందు ఆధారాలు కూడా ఉన్నాయి. మిగిలిన మీడియా కంపెనీల పురోగతిని పోల్చుకున్న తరువాతే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రతాప్‌రెడ్డి నిర్ణయించారు. జగతిలో పెట్టుబడులు పెట్టే సమయానికి ఈనాడు దినపత్రిక వాటా ఒక్కొక్కటి రూ.5.28 లక్షలుగా ఉంది. ఇదే సమయంలో జగతి పబ్లికేషన్స్ ప్రీమియం రూ.350, కార్మెల్ ఏసియా ప్రీమియం రూ.252గా ఉంది.’ ‘సీబీఐ చార్జిషీట్‌ను.. అందులో చేసిన ఆరోపణలను.. ఇంకేదైనా ఎఫ్ఐఆర్ను.. ఏదైనా నేర ఫిర్యాదును ఈడీ లేదా అడ్జుడికేటింగ్ అథారిటీలతో సహా ఏ దర్యాప్తు సంస్థ కూడా దైవిక వాస్తవం (గాస్పెల్ ట్రూత్)గా భావించడానికి వీల్లేదు. ఆ ఆరోపణలు ఇంకా చట్ట ప్రకారం న్యాయస్థానం ముందు రుజువు కాలేదన్న విషయాన్ని విస్మరించరాదు. స్వతంత్ర సంస్థగా చెబుతున్న ఈడీ.. ఆయా వ్యక్తులు, సంస్థలకు మనీలాండరింగ్‌తో సంబంధం ఉందని నిరూపించేందుకు అవసరమైన స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలను సేకరించాలి. కేవలం ఆరోపణల ఆధారంగా ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీచేయడానికి వీల్లేదు. ఆ ఆస్తులు మనీలాండరింగ్ ద్వారానే సమకూర్చారని నమ్మేందుకు కారణాలు ఉంటే తప్ప వాటిని జప్తు చేయడానికి ఏ మాత్రం వీల్లేదు.’ -
తాడిపత్రి మండలంలో నెలకొన్న ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం ఊరుచింతలలో పెన్నా సిమెంట్స్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నకారణంతో మనస్తాపం చెందిన పెద్దిరాజు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రామస్తులు అడ్డుకున్నారు. -
పెన్నా సిమెంట్ ఐపీఓకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్... ఈ ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా రూ.250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, జేఎమ్ ఫైనాన్షియల్, యస్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. పెన్నా సిమెంట్ కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో నాలుగు సిమెంట్ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్ యూనిట్లున్నాయి. -
పెన్నా సిమెంట్స్ ఐపీఓ త్వరలో
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్స్ సంస్థ త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయటంతో పాటు ఆఫర్ ఫర్ సేల్‌లో (ఓఎఫ్ఎస్) భాగంగా కంపెనీ ప్రమోటర్ పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ రూ.250 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, జేఎం ఫైనాన్షియల్, యస్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. దక్షిణ భారత దేశంలో ప్రముఖ సిమెంట్ కంపెనీల్లో పెన్నా సిమెంట్ ఒకటి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో నాలుగు సిమెంట్ తయారీ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. ఏడాదికి ఈ కంపెనీ 10 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా గత నెలలోనే ఇమామి సిమెంట్స్ సంస్థ రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఐపీఓకు అనుమతివ్వాలంటూ సెబీకి దరఖాస్తు చేసింది. -
10 రోజులు ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దు
పెన్నా, పయనీర్ రిసార్ట్స్‌ల విషయంలో ఈడీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో జప్తు చేసిన పెన్నా సిమెంట్స్, పయనీర్ హాలిడే రిసార్ట్స్ లిమిటెడ్‌లకు చెందిన ఆస్తులను పది రోజుల పాటు స్వాధీనం చేసుకోవద్దని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పది రోజుల తరువాత ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకోవచ్చునని ఈడీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ ఈడీ జాయింట్ డెరైక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెన్నా సిమెంట్స్ లిమిటెడ్, పయనీర్ హాలీడే రిసార్ట్స్ లిమిటెడ్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీతారామ్మూర్తి వాదనలు వినిపించారు. పిటిషనర్లకు చెందిన అనంతపురం జిల్లా యాడికి మండలంలో ఉన్న 231 ఎకరాలు, పయనీర్ రిసార్ట్స్‌కు చెందిన భవనంలోని పలు అంతస్తులను ఈడీ గతేడాది జప్తు చేసుకుందని తెలిపారు. ఆస్తుల స్వాధీనానికి ఈడీ జాయింట్ డెరైక్టర్ గత నెల 29న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను తమకు ఏప్రిల్ 2న అందచేశారన్నారు. ఇప్పుడు వాటి ని స్వాధీనం చేసుకుంటే పెన్నా సిమెంట్ కర్మాగారానికి దారి ఉండదని సీతారామ్మూర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తుల స్వాధీనం చెల్లదని, కనీసం పది రోజుల గడువు ఇవ్వాలని ఆయన తెలిపారు. తరువాత ఈడీ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ స్పందిస్తూ.. జప్తు చేసిన ఆస్తులను పదిరోజుల పాటు స్వాధీనం చేసుకోబోమని హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
పెన్నా కేసులో కోర్టుకు హాజరైన జగన్
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, పెన్నా సంస్థల చైర్మన్ పి.ప్రతాప్‌రెడ్డిలు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. న్యాయమూర్తి నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రూ.25వేల చొప్పున వీరి తరఫున ఇద్దరు పూచీకత్తు బాండ్లను సమర్పించారు. నిందితుల జాబితాలో ఉన్న పీఆర్ ఎనర్జీస్, పెన్నా సిమెంట్స్, పయనీర్ హోల్డింగ్స్ సంస్థల తరఫున ప్రతాప్‌రెడ్డి పూచీకత్తు బాండ్లు సమర్పించారు. వాటిని ఆమోదించిన న్యాయమూర్తి ఎంవీ రమేష్.. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. ఇందూ సంస్థ పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఈనెల 13న జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. -
పెన్నా చార్జిషీట్ విచారణకు స్వీకరణ
జగన్, ప్రతాప్‌రెడ్డి ఇతర నిందితులకు సమన్లు సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ కంపెనీల్లో పెన్నా సిమెంట్స పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంపై దాఖలైన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ చార్జిషీట్‌కు సీసీ నంబర్‌ను 26/2013గా కేటాయించారు. చార్జిషీట్లో నిందితులుగా ఉన్న జగన్, పెన్నా సిమెంట్స అధినేత ప్రతాపరెడ్డి సహా ఇతర నిందితులకు సమన్లు జారీచేసిన కోర్టు నవంబర్ 11న ప్రత్యక్షంగా హాజరుకావాలని పేర్కొంది. నిందితులంతా కోర్టు ముందు హాజరై పూచీ కత్తు బాం డ్లను సమర్పించాల్సి ఉంటుంది. రిమాండ్‌లో ఉన్న విజయసాయిరెడ్డికి పీటీ వారెంట్ జారీ చేశారు. 11న ఆయన్ను ప్రత్యక్షంగా హాజరుపర్చాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ‘‘పెన్నా సిమెంట్సకు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు జిల్లాలో 304 ఎకరాల్లోని గనులకు ప్రాస్పెక్టివ్ లెసైన్‌స మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 82.1 ఎకరాల మైనింగ్ లీజును రెన్యువల్ చేశారు. బంజారాహిల్సలో పెన్నా సిమెంట్స యజమాని నిర్మించిన హోటల్ కోసం నిబంధనలు సడలించారు. ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కి చెందిన కం పెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడిగా పెట్టారు’’ అని సీబీఐ చార్జిషీట్లో ఆరోపించింది. -
మూడు నాల్కల ముచ్చట
జగతిలో పెట్టుబడులుపై సీబీఐ రకరకాల వాదనలు ప్రాజెక్టులు చేపట్టిన వారి పెట్టుబడులు ‘క్విడ్ ప్రో కో’ అట అలా చేపట్టని వారి విషయంలో రెండు రకాల వాదన కొందరి విషయంలో పెట్టుబడులు కరెక్టేనంటూ సమర్థన మరికొందరి విషయంలో వారు మోసపోయారనే వాదన తాజా మెమోతో మరింతగా బయటపడ్డ సీబీఐ డొల్ల వాదన రాజకీయ కుట్రతోనే 16 నెలలుగా జైల్లో జగన్ ఏ కేసులోనూ జరగనన్ని విచిత్రాలు ఈ కేసులో జరిగిన తీరు ‘ముక్కల చార్జిషీట్ల’ నుంచి... మీడియా సంచలనాల దాకా చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో దర్యాప్తు ముగించిన సీబీఐ దర్యాప్తు ముగియడంతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు వాళ్లంతా ఇన్వెస్టర్లే. అంతా ఒకే ధరకు షేర్లు కొన్నవాళ్లే. కాకపోతే వాళ్లలో కొందరు మాత్రమే అసలైన ఇన్వెస్టర్లట..!! వాళ్ల ఇన్వెస్ట్మెంట్లే అసలైనవట! మిగతా వాళ్ల ఇన్వెస్ట్మెంట్లు మాత్రం ‘క్విడ్ ప్రో కో’ అట. ఇదీ... వైఎస్ జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ చెబుతూ వచ్చిన కథ, కథనం. సీబీఐ చెబుతూ వచ్చిన కథనం ఆధారంగానే జగన్మోహన్రెడ్డిని 16 నెలల పాటు జనానికి దూరం చేశారు. ఈ స్క్రీన్‌ప్లేతోనే జగన్మోహన్రెడ్డి సంస్థలను నానా ఇబ్బందులూ పెట్టారు. ఆఖరికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికీ బురద పులిమే ప్రయత్నాలు చేశారు. అసలు ఈ కథనాన్ని ఎవరైనా నమ్ముతారా? ఒక కంపెనీలో షేర్ హోల్డర్లంతా ఒకే ధరకు షేర్లు కొన్నపుడు వారిలో కొందరివి అసలైన ఇన్వెస్ట్మెంట్లని, మరికొందరివి ‘క్విడ్ ప్రో కో’ ఇన్వెస్ట్మెంట్లని చెప్పటంలో అర్థమేమైనా ఉందా? ఇదంతా ఎందుకంటే జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి సీబీఐ సోమవారం కోర్టుకు ఒక మెమో అందజేసింది. దాన్లో జగతి పబ్లికేషన్స్ ఇన్వెస్టర్లకు సంబంధించి కొన్ని కంపెనీల పేర్లను వెల్లడిస్తూ... ఎలాంటి క్విడ్ ప్రో కో ఉన్నట్లు తేలలేదని స్పష్టం చేసింది. ఇలా సీబీఐ పేర్కొన్న కంపెనీల్లో పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వంటివి ఉన్నాయి. వీటిలో పీవీపీ బిజినెస్ వెంచర్స్ రూ.55 కోట్లు, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్ రూ.30 కోట్లు, ఆర్ఆర్ గ్లోబల్ రూ.49 కోట్లు చొప్పున జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. అంటే మూడు సంస్థలూ కలిపి రూ.134 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మూడు సంస్థలూ ఒక్కో షేరు రూ.350 చొప్పునే కొనుగోలు చేశాయి. వీటి పెట్టుబడులు క్విడ్ ప్రో కో అనేందుకు ఆధారాలు లేవని చెప్పిన సీబీఐ... ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 10 చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రతి చార్జిషీట్లోనూ కొందరిని పేర్కొంటూ... వారికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వపరంగా ఏ ప్రాజెక్టు దక్కిందో చెబుతూ... అందుకు ప్రతిఫలంగానే వారు జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టారనే వాదన చేసుకుంటూ వచ్చింది. దానికి క్విడ్ ప్రో కో అని పేరు పెట్టింది. ఇలా చార్జిషీట్లలో సీబీఐ పేర్కొన్న సంస్థల్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్, రాంకీ ఇన్ఫ్రా, వాన్‌పిక్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి పలు సంస్థలున్నాయి. అవి కూడా జగతి పబ్లికేషన్స్‌లో షేరు రూ.350 చొప్పునే కొన్నాయి. మరి ఈ సంస్థలు కూడా పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా, ఆర్ఆర్ గ్లోబల్ మాదిరి లాభాల కోసమే ఇన్వెస్ట్మెంట్ చేశాయని భావించాల్సిన పని లేదా? ప్రభుత్వపరంగా వీటికి ప్రాజెక్టులు దక్కడమే తప్పా? అయినా ఈ సంస్థలన్నీ ప్రభుత్వం నుంచి అప్పుడే ప్రాజెక్టులు తీసుకున్నవేమీ కాదే? ప్రభుత్వమేమీ వీటికి నిబంధనల్ని పక్కనపెట్టి ప్రాజెక్టులు కేటాయించలేదే? అరబిందో, హెటెరో రాష్ట్రంలో ఫార్మా దిగ్గజాలు. అలాంటి సంస్థలకు ఒక చోట ప్లాంటు కోసం భూమి కేటాయిస్తే... దాన్ని తక్కువ రేటుకిచ్చారని, అందుకే అవి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని వాదించడం కరెక్టా? రాంకీదీ అలాంటి కథే. వాన్‌పిక్ వ్యవహారమైతే మరీ ఘోరం. ఆ సంస్థ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ జాతీయ స్థాయిలోనూ పలు సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్లు చేశారు. వాటి ద్వారా లాభాలు కూడా ఆర్జించారు. అగ్రశ్రేణి ఇన్వెస్టర్‌గా రుజువు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే... అది కేవలం వాన్‌పిక్ ప్రాజెక్టును పొందినందుకే అని చెప్పారంటే ఏమనుకోవాలి? జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌లో కూడా ప్రసాద్ పెట్టుబడి పెట్టి, తన వాటాను విక్రయించుకుని లాభాన్ని ఆర్జించారు. దాన్నీ క్విడ్ ప్రో కో అన్నారంటే ఏమనుకోవాలి? ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కూడా అంతే. అవి సిమెంట్ కంపెనీలు కాబట్టి, సహజంగానే మరో సిమెంట్ కంపెనీలో వాటా తమకు అనుకున్న ధరకు, అనుకున్నట్టుగా వస్తే కొనటానికి మొగ్గు చూపుతాయి. అదే రీతిన అవి భారతి సిమెంట్‌లో పెట్టుబడి పెట్టాయి. అవకాశం రాగానే విక్రయించుకుని లాభాలు కూడా ఆర్జించాయి. అయినా సరే, వాటి పెట్టుబడులను క్విడ్ ప్రో కో అన్నారంటే ఏమనుకోవాలి? అసలు క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? అంతా రాజకీయమయం... ఇక్కడ గమనించాల్సిందొక్కటే. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఈ రాష్ట్రంలో ఒక వర్గానికి అస్సలు గిట్టదు. అందుకే వైఎస్ మరణానంతరం జనమంతా ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిని అక్కున చేర్చుకోవడాన్ని వారు సహించలేకపోయారు. మరో రాజశేఖరరెడ్డి తయారు కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే కాంగ్రెస్‌లోని వైఎస్ వ్యతిరేకులతో చేతులు కలిపారు. కొన్ని రాజకీయ పక్షాలు, వారికి వత్తాసు పలికే మీడియా, దర్యాప్తు సంస్థలు, కొందరు వ్యక్తులు కలిసి నడిపిన ఈ కుట్ర ఏ స్థాయిలో సాగిందంటే... ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ కేసులోనూ జరగని వైపరీత్యాలు ఈ కేసులో మాత్రమే జరిగాయి. ఆదినుంచీ రాంగ్ రూట్లోనే... ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ క్విడ్ ప్రో కో. అంటే ఇచ్చిపుచ్చుకోవటం. వైఎస్ హయాంలో పలు సంస్థలకు భూములు కేటాయించడంతో పాటు అనుమతులు మంజూరు చేశారని, అందుకు ప్రతిగా అవి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది ప్రధానారోపణ. కేంద్రంలోనైనా... ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు వచ్చినప్పుడు మొదట తేల్చేది ఆ నిర్ణయం తప్పా, కాదా అని. ఆ నిర్ణయాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారా. లేక అదంతా నిబంధనల ప్రకారమే జరిగిందా అని. ప్రభుత్వ నిర్ణయం తప్పని తేలితే ఆ పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కో అనొచ్చు. కానీ ఇక్కడ సీబీఐ ఆ నిర్ణయాల జోలికి పోలేదు. అవి తప్పో ఒప్పో పట్టించుకోలేదు. జగన్‌ను టార్గెట్ చేసి... ఆయన సంస్థల్లోకి పెట్టుబడిగా వచ్చిన ప్రతి రూపాయినీ అనుమానించింది. సదరు ఇన్వెస్టర్లు ప్రభుత్వ ప్రాజెక్టులేమైనా పొందారో లేదో చూసింది. పొంది ఉంటే... అవన్నీ క్విడ్ ప్రోకోలేనంటూ వారిని వేధించింది. దారుణమేంటంటే.. ఒకవేళ ఏ ప్రభుత్వ ప్రాజెక్టూ చేపట్టని ఇన్వెస్టర్లుంటే... వారు పెట్టుబడులు పెట్టి మోసపోయారని మరీ కేసు పెట్టింది. పెపైచ్చు వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే ఒక వర్గం మీడియాకు లీకులిచ్చి మరీ కథనాలు రాయిస్తూ... వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. అసలు కేటాయింపుల్లో తప్పేంటి? అసలు సీబీఐ నెత్తీనోరూ బాదుకుంటున్న ఈ కేటాయింపుల్లో తప్పేముంది? భూములు, గనుల కేటాయింపు... సెజ్‌లు, ప్రాజెక్టులకు అనుమతులు... కంపెనీలకు లెసైన్సులు, రాయితీలు, మినహాయింపులు ఇస్తే తప్పేంటి? ఒక్క వైఎస్ హయాంలోనే ఇలా ఇచ్చారా? అంతకు ముందరి ప్రభుత్వాలేవీ ఇవ్వలేదా? ప్రస్తుత ప్రభుత్వం ఏ భూ కేటాయింపులూ చేయడం లేదా? రాయితీలివ్వడం లేదా? ఏ జీవోనైనా అంతకు ముందరి జీవోల్ని అనుసరించో, నిబంధనల్ని పాటించో జారీ చేస్తారు కదా? దర్యాప్తులో ఇవన్నీ చూడాలి కదా! వైఎస్ హయాంలో కంపెనీలకు నీళ్లిచ్చినందుకు కూడా క్విడ్ ప్రో కో పెట్టుబడులొచ్చాయని తాను చేస్తున్న వాదన ఎంత అసంబద్ధమో సీబీఐకి తెలియదా? ప్రభుత్వ కేటాయింపులు, అనుమతులు ఏమాత్రం తప్పు కాదని దానికి తెలియదనుకోగలమా? మొన్నటికి మొన్న కిరణ్ సర్కారు పలు పరిశ్రమలకు పన్ను రాయితీలివ్వలేదా? గతేడాది ప్రిజమ్ సిమెంట్స్‌కు కర్నూలు జిల్లాలో 1,000 ఎకరాలు కేటాయించలేదా? ఇలాంటివాటన్నిటినీ సీబీఐ ఎందుకు అధ్యయనం చేయడం లేదు? వైఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పుగా చూపించాలన్న తహతహ ఎందుకు? చార్జిషీట్లలోనూ రెండునాల్కలే... పెట్టుబడి అంటే ఇన్వెస్టర్, ప్రమోటర్ మధ్య ఒప్పందం. తమకు అన్యాయం జరిగిందనో, తాము మోసపోయామనో వారిలో ఎవరూ ఫిర్యాదు చేయనంతవరకూ దాన్లో ఏ దర్యాప్తు సంస్థా జోక్యం చేసుకోదు. కానీ సీబీఐ మాత్రం ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి... దానికి అనుగుణంగా కేసును తయారు చేసుకుంటూ వెళ్లింది. ఇన్వెస్టర్లను వేధిస్తూ... వారు వైఎస్ హయాంలో ఏ ప్రాజెక్టులు చేపట్టారో వెతికి మరీ చూసి... వాటికి బదులుగానే ఆ పెట్టుబడులు పెట్టారని సీబీఐ వాదించింది. వారిని వేధించింది. కానీ సీబీఐ ఎంత వెదికినా కొంతమంది ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టులూ చేపట్టినట్టు కనిపించలేదు. దాంతో, వారికి మోసపూరిత నివేదికలిచ్చి, లాభాలొస్తాయని ఆశ చూపించి జగతి ప్రతినిధులు వారితో పెట్టుబడులు పెట్టించారని, వారికి వడ్డీ కూడా దక్కలేదని, వారు మోసపోయారని తెగ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మేరకు ఏకంగా ఒక చార్జిషీటు (నంబర్-2) కూడా వేయడం మరీ విచిత్రం. మళ్లీ అదే సీబీఐ... కొందరి పెట్టుబడులేమో క్విడ్ ప్రో కో అనటానికి ఆధారాలేమీ లేవని పేర్కొంది. అంటే... ఒకే ఒరలో రెండు కాదు, మూడు కత్తులన్నమాట! ఇన్వెస్టర్లు మోసపోయారా? ‘‘2008లో టి.ఆర్.కణ్ణన్ అనే వ్యక్తిని విజయసాయిరెడ్డి కలిశారు. జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగారు. కణ్ణన్ ఓకే చేశారు. 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లిలో సిమెంట్ ప్లాంట్ పెట్టారు. 2010 ఆగస్టు 19న (రోశయ్య హయాంలో) ఆయనకు లెసైన్స్ మంజూరయింది. దుబాయ్ ఎన్నారై మాధవ్ రామచంద్రతో 2008లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. త్వరలో జగతి పబ్లికేషన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోందని, భారీ లాభాలు వస్తాయని ఆశపెట్టారు. డెలాయిట్ నివేదిక ప్రతిని కూడా ఆయనకు పంపడంతో ఆయన రూ.19.65 కోట్లు పెట్టుబడి పెట్టారు. దండమూడి అరుణ్‌కుమార్ కూడా సాయిరెడ్డి మాటలు నమ్మి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. వారికి ఇప్పటిదాకా ఎలాంటి డివిడెండూ రాలేదు. పెట్టుబడిపై వడ్డీ కూడా రాలేదు. లాభాలపై తప్పుడు సమాచారమిచ్చి వారి ద్వారా పెట్టుబడి పెట్టించారు. తరవాత వారెన్ని ఫోన్లు చేసినా జగతి ప్రతినిధులు స్పందించలేదు’’ ఇదీ రెండో చార్జిషీట్లో సీబీఐ మోపిన అభియోగం. ఈ ప్రశ్నలకు బదులుందా? . అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడులనా, లేక ఇన్వెస్టర్లు మోసపోయారనే అంశాన్నా? ఒకే విచారణలో ఈ రెండంశాలూ ఉండటం ఎలా సాధ్యం? ప్రాజెక్టులు దక్కిన వారినైతే అందుకే పెట్టారని చెప్పడం... లేనివారైతే మోసపోయారని చెప్పడం... కొందరి పెట్టుబడులు క్విడ్ ప్రో కో కాదని చెప్పడం... ఒకే కంపెనీలో ఈ మూడు రకాల పెట్టుబడులూ ఉంటాయా? . అసలు జగతిలో గానీ, భారతి సిమెంట్‌లో గానీ పెట్టుబడి పెట్టి తాము మోసపోయామంటూ ఏ ఇన్వెస్టరైనా ఫిర్యాదు చేశారా? కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసినపుడు లాభనష్టాలు సహజమని సీబీఐకి తెలియదా? మరి భారతి సిమెంట్‌లో ప్రతి ఇన్వెస్టరుకూ లాభం వచ్చింది కదా? దాన్నెందుకు పట్టించుకోవడం లేదు? . డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించారని, మోసం చేశారని చెబుతున్న సీబీఐ... అదే నివేదికలో ఉన్న ‘డిస్‌క్లెయిమర్’ను ప్రస్తావించలేదెందుకు? ఆ నివేదిక ఆధారంగా పెట్టినవారు దాన్లోని డిస్‌క్లెయిమర్‌ను చూసుకోరా? ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాల్ని విచారించటానికా సీబీఐ ఈ దర్యాప్తును చేస్తున్నది? . ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’తో సమానంగా సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ తన గ్రూప్ విలువను రూ.7,800 కోట్లుగా అంచనా కట్టినప్పుడు ‘సాక్షి’ విలువ దాన్లో సగం కూడా చెయ్యదా? ‘సాక్షి’ కొత్త సంస్థ. కానీ 35 ఏళ్లుగా నడుస్తున్న ‘ఈనాడు’ 2008 నుంచి తన దగ్గర పెట్టుబడి పెట్టిన అంబానీకి ఒక్క పైసా అయినా డివిడెండ్ ఇచ్చిందా? అఏ కేసులోనైనా ఒక ఎఫ్ఐఆర్కు ఒకటే చార్జిషీటు. కానీ ఈ కేసులో వీలైనంత ఎక్కువకాలం జగన్‌ను జైల్లో ఉంచటానికి వీలైనన్ని ఎక్కువ చార్జిషీట్లు వేసేందుకు కుట్ర పన్నారు. అఅసలు జగన్మోహన్రెడ్డిని కనీసం విచారణకు కూడా పిలవకుండానే ఆయన్ను మొదటి నిందితుడిగా పేర్కొంటూ మూడు చార్జిషీట్లు వేశారు. దేశంలో ఏ కేసులోనూ ఇలా జరగలేదు. చిన్న కేసైనా, పెద్ద కేసైనా నిందితుడిని విచారించాకే చార్జిషీటు వేస్తారు. అచార్జిషీటును విచారణకు స్వీకరించే నిమిత్తం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా జగన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కోర్టు ఎదుట హాజరయితే... వ్యక్తిగత పూచీపై అక్కడికక్కడే బెయిలొచ్చే అవకాశముండేది. అది తెలిసిన సీబీఐ... అలా హాజరవడానికి మూడు రోజుల ముందే, తన ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చింది. మూడు రోజులు విచారించాక... కొన్ని గంటల్లో కోర్టు ఎదుట హాజరవుతారనగా అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. చరిత్రలో ఏ కేసులోనూ ఇలా జరిగిన దాఖలాలు లేవు. అజగన్కు చెందిన మీడియా గొంతు నులమటానికీ సీబీఐ ప్రయత్నించింది. సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సాక్షి ఆస్తులనూ అటాచ్ చేయబోయింది. మరో వంక సీబీఐతో ప్రభుత్వమూ జతకలిసింది. సాక్షికి ప్రకటనలివ్వడాన్ని నిషేధిస్తూ ఏకంగా జీవోలనే జారీ చేసింది. అనిజానికి తన అరెస్టును జగన్ ముందే ఊహించారు. అందుకే ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేశారు. కానీ చట్టప్రకారమే అంతా జరుగుతుందని భావించిన కోర్టు... అరెస్టు జరగదని, అదంతా ఆయన భయం మాత్రమేనని చెప్పింది. ఒకవేళ ఆయనది భయమే అనుకున్నా... ఆయన భయపడ్డట్టే జరిగింది. అఅరెస్టు అక్రమమంటూ జగన్ దిగువ కోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి హైడ్రామా మొదలయింది. బెయిల్‌పై తీర్పు వచ్చే ముందు... సంచలనాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం మొదలయ్యాయి. అవి ఏ స్థాయిలో అంటే న్యాయం సైతం నివ్వెరపోయేంతగా!! ఇంతకుముందు జగన్ ఆరుసార్లు బెయిల్ కోసం వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తే, ప్రతిసారీ ఏదో ఒక సంచలనమే. ప్రతిసారీ ఎల్లో మీడియాలో తీర్పు ముందు రోజున జగన్‌కు వ్యతిరేకంగా తాటికాయలంత అక్షరాలతో పతాక కథనాలే. ప్రతిసారీ ఏదో జరిగిపోతోందన్న రీతిలో చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఢిల్లీకి వెళ్లి మరీ నానాయాగీ చేయడమే. జగన్ కేసులో ఎప్పుడేం జరిగింది..? 2010 నవంబర్ 5: హైకోర్టుకు 5 పేజీల లేఖ రాసిన శంకర్రావు. 75 పేజీల అనుబంధ పత్రాల సమర్పణ 2011 జనవరి 24: ఆ లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు 2011 ఫిబ్రవరి 9: శంకర్రావు మరో అఫిడవిట్. 2011 మార్చి 14: జగన్ ఆస్తులపై సీబీఐ, ఏసీబీ దర్యాప్తు కోరుతూ టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పిల్. 2011 జూలై 11: ఎమ్మార్‌పై సీబీఐ ప్రాథమిక దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం 2011 జూలై 12: వైఎస్ జగన్, సాక్షిలో పెట్టుబడులపై సీబీఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశం 2011 జూలై 22: హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 2011 జూలై 26: సీల్డ్ కవర్లో హైకోర్టుకు సీబీఐ నివేదిక 2011 ఆగస్టు 1: హైకోర్టుకు సీబీఐ రెండో నివేదిక 2011 ఆగస్టు 4: శంకర్రావు, టీడీపీ నేతల పిటిషన్లపై తీర్పు వాయిదా 2011 ఆగస్టు 10: ఎమ్మార్, జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం 2011 ఆగస్టు 17: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ (ఆర్సీ 19(ఎ)) నమోదు చేసిన సీబీఐ 2011 ఆగస్టు 18: జగన్ సంస్థలు, సాక్షి కార్యాలయాల్లో సీబీఐ సోదాలు 2011 నవంబర్ 4: ఓఎంసీ కేసులో సాక్షిగా సీబీఐ ఎదుట హాజరైన జగన్ 2012 జనవరి 2: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి అరెస్టు 2012 మార్చి 31: ఫార్మా కంపెనీల పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2012 ఏప్రిల్ 13: ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ 2012 ఏప్రిల్ 24: వ్యక్తుల పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2012 మే 7: జగన్ కంపెనీల్లో రాంకీ ఫార్మా పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2012 మే 7: మొదటి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు. జగన్‌కు సమన్లు జారీ. మే 28న హాజరవాలంటూ జగన్‌కు కోర్టు సమన్లు 2012 మే 8: జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రా సంస్థల బ్యాంకు (ఎస్బీఐ, ఓబీసీ) ఖాతాలను స్తంభింపజేసిన (ఫ్రీజ్) సీబీఐ 2012 మే 9: జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ఫ్రా సంస్థలకు చెందిన మరో రెండు బ్యాంకు (ఎస్బీఐ, ఓబీసీ) ఖాతాలను స్తంభింపజేసిన సీబీఐ 2012 మే 22: విచారణకు హాజరు కావాలంటూ జగన్‌కు సీబీఐ నోటీసులు 2012 మే 23: ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్మోహన్రెడ్డి 2012 మే 24: అరెస్టు చేస్తారని జగన్‌ది కేవలం అపోహ మాత్రమేనంటూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు 2012 మే 25: విచారణకు హాజరైన జగన్ 2012 మే 27: జగన్ అరెస్టు.. 2012 మే 28: ప్రత్యేక కోర్టులో హాజరు... రిమాండ్‌కు తరలింపు, బెయిల్ పిటిషన్ దాఖలు. 2012 ఆగస్టు 13: వాన్‌పిక్‌పై చార్జిషీట్ దాఖలు 2012 అక్టోబర్ 5: జగన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు... దర్యాప్తు పూర్తయిన తర్వాత జగన్ బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని ఆదేశం 2013 ఏప్రిల్ 8: దాల్మియా పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2013 మే 9: నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశం. దర్యాప్తు తర్వాత బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టీకరణ 2013 సెప్టెంబర్ 10: పెన్నా, ఇండియా, రఘురామ్ సిమెంట్స్‌కు సంబంధించి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ 2013 సెప్టెంబర్ 11: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ 2013 సెప్టెంబర్ 12: కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ, విచారణ 18కి వాయిదా 2012 సెప్టెంబర్ 17: ఇందూ టెక్, లేపాక్షి నాలెడ్జి హబ్‌కు సంబంధించి రెండు చార్జిషీట్లు దాఖలు 2013 సెప్టెంబర్ 18: బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి... తీర్పును 23కు వాయిదా వేసిన ప్రత్యేక కోర్టు 2013 సెప్టెంబర్ 23: జగన్‌కు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు -
మరో 3 చార్జిషీట్లు
* జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో పెన్నా, ఇండియా, భారతి సిమెంట్లపై వేర్వేరుగా దాఖలు చేసిన సీబీఐ * సీల్డ్కవర్లో కోర్టుకు సమర్పించిన డీఐజీ వెంకటేష్ * నిందితులుగా ఐఏఎస్‌లు శామ్యూల్, ఆదిత్యనాథ్ దాస్ మరికొందరు * పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ తదితరులు కూడా * మూడు రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేస్తామన్న సీబీఐ * దర్యాప్తుపై సోమవారంతో ముగిసిన సుప్రీంకోర్టు గడువు సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ మరో మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ డీఐజీ, ఈ కేసు ప్రధాన దర్యాప్తు అధికారి హెచ్.వెంకటేష్ మంగళవారం మూడు చార్జిషీట్లను సీల్డ్ కవర్లో సీబీఐ రెండో అదనపు ప్రత్యేక జడ్జి ఎం.వి.రమేష్‌కు అందజేశారు. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు అనారోగ్యంతో రెండురోజులు సెలవులో ఉండడంతో... ఇన్చార్జిగా ఉన్న రెండో కోర్టు న్యాయమూర్తికి ఈ చార్జిషీట్లు సమర్పించారు. జగన్ సంస్థల్లో పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టాయి. వీటికి సంబంధించి రెండు చార్జిషీట్లు వేయటంతో పాటు జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లోకి వచ్చిన పెట్టుబడులపై మరో చార్జిషీటు వేశారు. ఈ చార్జిషీట్లకు అనుబంధంగా ఉండే డాక్యుమెంట్లు, సాక్షుల వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి వచ్చిన తర్వాత సమర్పిస్తామని నివేదించారు. అలాగే రెండు మూడురోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేస్తామని వెంకటేష్ కోర్టుకు తెలిపారు. ఈ చార్జిషీట్లలోని నిందితులపై ప్రధానంగా ఐపీసీ 120(బి), రెడ్‌విత్ 420, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డి), 13(2)లను చేర్చినట్లు తెలుస్తోంది. చార్జిషీట్ల దాఖలు సందర్భంగా కోర్టు హాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. నిందితుల వివరాలు తెలపండి... ‘‘గతంలో విచారణ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి నాలుగు నెలలు గడువిచ్చింది. ఆ గడువు ఈ నెల 9తో ముగిసింది. గడువు తరవాత జగన్మోహన్రెడ్డి తరఫున మేం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా సుప్రీం చెప్పింది. సుప్రీం తీర్పు ప్రకారం జగన్మోహన్రెడ్డికి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తాం. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల వివరాలు మాకు తెలిస్తే తప్ప బెయిల్ పిటిషన్లో ఆ విషయాలను పేర్కొనలేం. అందుకే చార్జిషీట్లలో నిందితుల వివరాలను మాకు తెలియజేయండి. చార్జిషీట్ చూసుకునేందుకు ఐదు నిమిషాలు అనుమతించండి’’ అని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి... మూడు చార్జిషీట్లలో ఉన్న నిందితుల వివరాలను తెలపాలని డీఐజీకి సూచించారు. దీంతో ఆయన నిందితుల వివరాలను అశోక్‌రెడ్డికి తెలియజేశారు. గతంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.... నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని ఈ ఏడాది మే నెల మొదటి వారంలో సీబీఐని ఆదేశించింది. ఆ గడువు సోమవారంతో ముగిసింది. సోమవారం సెలవు కావటంతో మంగళవారం సీబీఐ ఈ చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రజలు ఇది గమనించాలి: సీబీఐ చార్జిషీట్లలోని వివరాలు తెలియజేసిన సీబీఐ... తన ప్రకటనలో చివర ఒక అంశాన్ని పొందుపరిచింది. ఈ వివరాలన్నిటికీ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలే ఆధారమని ప్రజలు గమనించాలని స్పష్టం చేసింది. ‘‘భారతీయ చట్టాల ప్రకారం తుది విచారణలో వారు నేరం చేశారో లేదో తేలేదాకా నిందితులు ఏ నేరమూ చేయలేదనే భావించాలి. ఇది ప్రజలు గమనించాలి’’ అని పేర్కొంది. చార్జిషీట్లలో ఏం పేర్కొన్నారంటే... మూడు చార్జిషీట్లలో ఏమేం పేర్కొన్నదీ సంక్షిప్తంగా తెలియజేస్తూ సీబీఐ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్లో కంపెనీల పేర్లు గానీ, వ్యక్తుల పేర్లు గానీ పేర్కొనకుండా... వారి హోదాలు మాత్రమే పేర్కొన్నారు. కానీ జడ్జి సూచన మేరకు న్యాయవాది అశోక్‌రెడ్డికి నిందితుల పేర్లు తెలపటంతో వివరాలు వెల్లడయ్యాయి. వాటి ప్రకారం... ఇండియా సిమెంట్స్ ఆరోపణ: చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్‌కు నియమ నిబంధనలకు విరుద్ధంగా లీజు రెన్యువల్ చేయటం... కాగ్నా, కృష్ణా నదుల నుంచి నీటిని కేటాయించటం వంటి ప్రయోజనాలు కల్పించారు. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ ఎండీ దాదాపు రూ.140 కోట్లను వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన మూడు కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. నిందితులు: 1. వైఎస్ జగన్మోహన్రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. ఎన్.శ్రీనివాసన్ (చైర్మన్, ఇండియా సిమెంట్స్), 4. శామ్యూల్ (సీనియర్ ఐఏఎస్ అధికారి), 5. ఆదిత్యనాథ్ దాస్ (సీనియర్ ఐఏఎస్ అధికారి), 6. రఘురామ్ సిమెంట్స్, 7. ఇండియా సిమెంట్స్ 8. జగతి పబ్లికేషన్స్, 9. కార్మెల్ ఏషియా. పెన్నా సిమెంట్స్ ఆరోపణ: హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్స్‌కు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అదికాక కర్నూలు జిల్లాలో 304 ఎకరాల్లో గనులకు ప్రాస్పెక్టివ్ లెసైన్స్ మంజూరు చేశారు. ఇంకా రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల మైనింగ్ లీజును రెన్యువల్ చేశారు. బంజారాహిల్స్‌లో పెన్నా సిమెంట్స్ యజమాని నిర్మించిన హోటల్ కోసం నిబంధనలు సడలించారు. ఈ ప్రయోజనాలు పొందినందుకు ప్రతిగా ఆయన జగన్ కంపెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడి పెట్టారు. నిందితులు: 1. వైఎస్ జగన్మోహన్రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. ప్రతాప్‌రెడ్డి (పెన్నా గ్రూప్స్ చైర్మన్), 4. పీఆర్ ఎనర్జీస్, 5. జగతి పబ్లికేషన్స్, 6. కార్మెల్ ఏషియా, 7. పెన్నా సిమెంట్స్, 8. పయనీర్ హోల్డింగ్స్ భారతి సిమెంట్స్ ఆరోపణ: కడప జిల్లాలో రఘురామ్ సిమెంట్స్‌కు (భారతి సిమెంట్స్‌గా పేరు మారింది) 2,037 ఎకరాల సున్నపురాయి గనులను ప్రభుత్వం లీజుకిచ్చింది. ఇలా లీజుకివ్వటంలో పలు అవకతవకలకు పాల్పడ్డారు. (ఈ ఆరోపణలకు సంబంధించిన పలు అంశాలు ఈ చార్జిషీట్లో చోటు చేసుకున్నాయి) నిందితులు: 1. వైఎస్ జగన్మోహన్రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. రఘురామ్ సిమెంట్స్, 4. జె.జగన్మోహన్రెడ్డి (డెరైక్టర్, రఘురామ్ సిమెంట్స్), 5. వీడీ రాజగోపాల్ (గనుల శాఖ మాజీ డెరైక్టర్), 6. వీఎన్ ప్రభు, 7. బి.కృపానందం, 8. శంకర్‌నారాయణ.