న్యూఢిల్లీ: పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్... ఈ ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా రూ.250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్, జేఎమ్ ఫైనాన్షియల్, యస్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. పెన్నా సిమెంట్ కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో నాలుగు సిమెంట్ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్ యూనిట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment