Prathipadu constituency
-
తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ
సాక్షి, ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఓ అంశం చర్చనీయాంశమవుతోంది. అందరి నోళ్లలోనూ ఇదే నానుతోంది. ఇది ప్రత్తిపాడు నియోజకవర్గమా లేక తాడికొండ నియోజకవర్గమా అంటూ ఓటర్లు ఛలోక్తులు విసురుతున్నారు. కారణం ప్రత్తిపాడు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గ వాసులు, ఆ నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే కావడంతో పొలిటికల్ కారిడార్లో చక్కర్లు కొడుతుందీ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం. ఈమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో సైతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్బాబుది సైతం తాడికొండ నియోజకవర్గమే. తాడికొండ మండలం రావెల గ్రామం. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా తాడికొండ నియోజకవర్గానికి సుపరిచితులే. స్వగ్రామం ఆ నియోజకవర్గం కాకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తాడికొండ నియోజకవర్గ అల్లుడికే ప్రత్తిపాడు సీటును కేటాయించింది. వృతిరీత్యా వైద్యుడైన డాక్టర్ చల్లగాలి కిషోర్ తాడికొండకు చెందిన డాక్టర్ సబితను వివాహం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. -
అందరికీ అను‘గృహం’..
సాక్షి, ప్రత్తిపాడు : పేదవాని గూడు గోడుగానే మిగిలిపోతోంది. కలల సౌథం కూలిపోతోంది. అర్హత ఉండీ ఇళ్లు మంజూరు కాని వారు కొందరు..మంజూరై బిల్లులు రాని వారు ఇంకొందరు.. బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన వారు మరికొందరు.. ఇలా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకున్న వారి బాధ అంతులేకుండా ఉంది. ఇలాంటి పేదలందరికీ గూడు కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఇచ్చిన రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన పథకం వివరాలు పేదలందరికీ పక్కా ఇళ్లు ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణ సదుపాయం పక్కా ఇళ్ల నిర్మాణాల వివరాలు.. టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్లు : 3,61,732 అసంపూర్తిగా నిలిచిన ఇళ్లు : 21,568 ప్రారంభం కాని ఇళ్లు : 60,279 అందరికీ ఇళ్లు గొప్ప విషయం టీడీపీ ప్రభుత్వ హయాం లో పక్కా ఇళ్లు నిర్మించుకోవాలంటే జన్మభూమి కమిటీల దయ తప్పని సరి. అలాంటి వారికే ఇల్లు మంజూరు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులకు ఇస్తామని చెప్పడం గొప్ప విషయం. – కొత్త అమేష్, బీకేపాలెం జగన్ హామీ హర్షణీయం ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక లబ్ధిదారులు అగచాట్లు పడుతున్నారు. మండలాల్లోని హౌసింగ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. నిర్మించుకున్న ఐదారు నెలలకు కూడా బిల్లులు రాని దుస్థితి ఉంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఆయన మాటిస్తే నెరవేరుస్తారు. అందుకే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. – బాపతు శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడు -
ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు