సంచలన విషయాలు చెప్పిన ప్రత్యూష ఫ్రెండ్స్
బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె సన్నిహితులు, స్నేహితులు నమ్మలేకపోతున్నారు. ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్తో ఆమెకు విబేధాలున్నాయని చెప్పారు. రాహుల్, ప్రత్యూషల అనుబంధం గురించి మీడియా సమావేశంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రత్యూషకు ఇటీవల ఓ ఆఫర్ ఇచ్చిన నిర్మాత వికాస్ గుప్తా మాట్లాడుతూ.. రాహుల్‌తో సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని ప్రత్యూష భావించిందని చెప్పాడు. రాహుల్ అందరిముందు ఆమెను కొట్టాడని వెల్లడించాడు. ప్రత్యూష సన్నిహితులు ఇంకా ఏం చెప్పారంటే..
రాహుల్ తనను మోసం చేశాడని ప్రత్యూష చెప్పింది - కామ్యా పంజాబీ
ఆర్థిక సమస్యల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు - శశాంక్ వ్యాస్
ప్రత్యూష ఎత్తు చాలా తక్కువ. ఐదు అడుగులా రెండు అంగులాల పొడవు ఉంది. ఆమె ఎలా ఉరి వేసుకోగలదు? - కామ్యా పంజాబీ
పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నా. సలోని (రాహుల్ మాజీ గర్ల్ ఫ్రెండ్) తనను బెదిరించిందని మరణించడానికి ముందు రోజు ప్రత్యూష చెప్పింది - న్యాయవాది ఫాల్గుణి
రాహుల్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో కలసి ప్రత్యూషను మోసం చేశాడని, చాలాసార్లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చాలా మంది చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు రాహుల్‌ను సుదీర్ఘంగా విచారించారు. గత శుక్రవారం ముంబైలోని ప్లాట్‌లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.