మెళవాయి ఘటనలో మేనేజర్ అరెస్ట్
మడకశిర : అనంతపురం జిల్లా మెళవాయి ఘటనపై అధికారులు స్పందించారు. విద్యుత్ పనులు నిలిపివేయాలని కర్ణాటక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.
(చదవండి : పరిహారమడిగితే వేలాడదీశారు! )
విద్యుత్ తీగలపై రైతులను వేలాడదీసిన కాంట్రాక్ట్ సంస్థ మేనేజర్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొలంలో చేపట్టిన 220 కేవీ విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన తండ్రీకొడుకులు నబీరసూల్, వన్నూర్సాబ్పై కాంట్రాక్టర్ అధికారులు అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక కోరారు.