Praveen kumar kasam
-
ఇక్కడ వేసిన గొంగడి..
పల్లెటూరి తాతయ్య భుజాన బాధ్యతలా కనిపించేది.. పశువులు కాసే సిన్నోడికి కవచంలా ఉండేది. తాతల జ్ఞాపకంగా మిగిలిపోయిన గొంగడిని.. ఎక్కడ వేసింది అందరం మరచిపోయాం. తెలంగాణ జనపదాల్లో అడుగడుగునా కనిపించే గొంగడి.. ప్రపంచీకరణ ఫలితంగా ప్రాభవం కోల్పోయింది. మేడ్ ఇన్ తెలంగాణగా పేరొందిన ఈ పేదోడి దుప్పటి కాల క్రమంలో తెరమరుగైంది. ఈ పరిస్థితిని మార్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘అంత్ర’ స్వచ్ఛంద సంస్థ నడుంబిగించింది. గొంగడికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. గొంగడి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో వర్గాలను కలిపే బంధం. వాటి తయారీకి కావాల్సిన ఉన్ని కోసం కొందరు గొర్రెలు పెంచేవారు. గొర్రెల నుంచి ఉన్నిని దారంగా మలిచే వారు ఇంకొందరు. ఆ దారాలను మగ్గంతో గొంగడిగా తీర్చిదిద్దేవారు మరికొందరు. ఇలా గొంగడి ఎందరికో జీవనోపాధి కల్పించేది. దీని తయారీకి మూలమైన ఉన్నిని డెక్కనీ జాతి గొర్రెల నుంచి తీసేవారు. దక్కన్ పీఠభూమి పరిధిలో మాత్రమే ఉండటంతో వీటిని డెక్కనీ గొర్రెలని పిలుస్తుంటారు. వీటి నుంచి ఏటా రెండుసార్లు సమృద్ధిగా ఉన్ని లభించేది. 1990 తర్వాత అధిక మాంసం ఉత్పత్తి కోసం డెక్కనీ జాతిని మరో జాతితో సంకరం చేయడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకమైంది. కొత్తరకం గొర్రెల రాకతో ఉన్ని ఉత్పత్తి పడిపోయి.. గొంగళ్ల తయారీదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆదుకున్న ‘అంత్ర’.. ‘అంత్ర’.. హైదరాబాద్ కేంద్రంగా గ్రామీణుల స్వయం సమృద్ధికి చేయూతనిచ్చే ఓ స్వచ్ఛంద సంస్థ. గొంగడికి పునరుజ్జీవం తీసుకురావాలని సంకల్పించింది. గొంగళ్లు ఎక్కువగా తయారయ్యే మెదక్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో పర్యటించి ఉన్ని వేదికలు, డెక్కని గొర్రెల సంఘాలను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా నిపుణుల సలహాలు కూడా అందించింది. పదేళ్ల అంత్ర కృషికి ఫలితం ఇప్పుడు లభిస్తోంది. డెక్కనీ గొర్రెలతో పలు గ్రామాలు కళకళలాడుతున్నాయి. గొంగళ్ల మగ్గాలతో పల్లెలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. ఇటీవల అంత్ర సహకారంతో ఉన్ని వేదిక సభ్యులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గొంగళ్ల ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. నగరవాసులెందరో గొంగళ్లను కొనుగోలు చేసి పాత జ్ఞాపకాలను పదిలంగా ఇళ్లకు మోసుకెళ్లారు. ప్రభుత్వం చేయూతనివ్వాలి.. గొంగడికి పూర్వ వైభవం తీసుకురావాలని ఎంతో కృషి చేశాం. ఇప్పుడు తెలంగాణలో 60 వేల వరకు డెక్కనీ జాతి గొర్రెలున్నాయి. హైదరాబాద్‌లో గొంగడి ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు సంఘాలు స్వయం సమృద్ధి సాధిస్తుండటం ఆనందంగా ఉంది. వీరికి మరింత చేయూతనివ్వాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. - సాగరి (అంత్ర స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు) - ప్రవీణ్‌కుమార్ కాసం -
కలర్‌ఫుల్.. రూబిక్ క్యూబింగ్
రూబిక్ క్యూబ్.. లాజిక్, మ్యాజిక్ కలగలిపిన ఆట. భుజబలంతో కాదు.. బుర్రతో ఆడాల్సిన ఆట. విజ్ఞానం, వినోదం పంచే ఆట. అందుకే క్యూబింగ్కు ఇప్పుడు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. రూబిక్ క్యూబ్‌కు ఏకంగా క్లబ్బే ఏర్పాటైంది. ఔత్సాహికులకు శిక్షణనిస్తూ రికార్డులు కూడా సృష్టిస్తోంది. రూబిక్ క్యూబింగ్ అంటే రంగులు కలపడం వూత్రమే కాదు. టైం పాస్ గేమ్ అంతకంటే కాదు. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచే రంగుల పజిల్. రూబిక్లో రంగులను కలపడం అంటే క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే. ఎన్ని రకాలుగా క్యూబింగ్ చేయిగలిగితే ఒకే సమస్యను అన్ని రకాలుగా పరిష్కరించనట్లు. క్యూబింగ్ చేయుడం వల్ల మొదడులో న్యూరాన్లు ఉత్తేజితవువుతారుు. ఇప్పుడిప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయం గ్రహిస్తున్నారు. 40 ఏళ్ల కిందే పుట్టింది.. రూబిక్ క్యూబ్ కు దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది. 1974లో హంగెరీకి చెందిన ప్రొఫెసర్ ఎర్న్యో రూబిక్ ఆవిష్కరించాడు. ఆయున పేరుమీదే దీన్ని రూబిక్గా పిలుస్తుంటారు. మొదట్లో 3బై3 క్యూబ్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 7బై 7 క్యూబ్‌ల వరకూ వూర్కెట్లో దొరుకుతున్నారుు. సంప్రదాయ రూబిక్ కేవలం క్యూబ్ రూపంలోనే ఉంటుంది. ఇప్పడు కొత్తగా పెంటామిక్స్, పైరామిక్స్ అంటూ వివిధ రకాల రూబిక్లు కూడా వస్తున్నారుు. రూబిక్ క్యూబింగ్లో ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు, అమెరికా అగ్రభాగంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దీనిపై మనదేశంలో క్రేజ్ పెరుగుతోంది. దేశంలో మనమే టాప్.. నగరానికి చెందిన విక్రమ్ అతడి సోదరుడు వివేక్‌లకు క్యూబింగ్ అంటే చాలా ఇష్టం. దీన్ని హాబీగా నేర్చుకొని ఇప్పుడు రికార్డులు సృష్టించే స్థాయికి ఎదిగారు. మరోవైపు కనిష్కర్ అనే మరో కుర్రాడు కూడా ఆసక్తితో క్యూబింగ్ చేస్తూ మరిన్ని మెళుకవులు తెలుసుకునేందుకు విక్రమ్‌తో కలిశాడు. తర్వాత వీళ్లందరూ కలసి రెండేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా రూబిక్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రసుత్తం ఈ క్లబ్లో 200 మంది సభ్యులున్నారు. క్యూబింగ్పై ఔత్సాహికులకు అవగాహన,శిక్షణ కల్పించాలనేది ఈ క్లబ్ ఉద్దేశం. ఇందులోని సభ్యులు ఇప్పుడు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు కూడా కొల్లగొడుతున్నారు. దేశంలో క్యూబింగ్లో యాక్టివ్‌గా ఉన్నది హైదారాబాదే. తర్వాత ముంబై, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ క్లబ్లో 6 నుంచి 65ఏళ్ల వయసువారు కూడా ఉన్నారు. క్యూబింగ్ వేగంగా చేసినప్పుడే మనకంటూ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈ క్లబ్లో సభ్యులు ఎంత వేగంగా క్యూబింగ్ చేస్తున్నామనే దానిపైనే ఎక్కువగా దృష్టిపెడుతుంటారు. శిక్షణ సంస్థలు కూడా.. క్లబ్ మాత్రమే కాదు క్యూబింగ్ కోసం ఇందులో ఉన్న కొంతమంది నగరంలోని వివిధ చోట్ల శిక్షణకూడా ఇస్తున్నారు. విక్రమ్ మారేడ్‌పల్లిలో పిల్లలకు శిక్షణ ఇస్తుంటే. అతడి తమ్ముడు బెంగళూరులో పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌నే ఏర్పాటు చేశాడు. లిమ్కాబుక్ రికార్డు... భగత్‌సింగ్ వర్థంతిని పురస్కరించుకొని గతేడాది ప్రసాద్ ఐమాక్స్‌లో క్లబ్‌లోని సభ్యులు వినూత్న ప్రయత్నం చేసి రికార్డు సృష్టించారు. క్యూబింగ్తో పాటు తమ దేశభక్తిని నిరూపించుకునే విధంగా ఏకంగా 8వేల క్యూబ్లతో భగత్‌సింగ్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న రికార్డును అధిగమించి లిమ్కాబుక్‌లో చోటుసంపాదించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని క్లబ్ సభ్యులు కనిష్కర్, విక్రమ్‌లు చెబుతున్నారు. - ప్రవీణ్ కుమార్ కాసం -
పంచ్ :మోడీ.. బొమ్మరిల్లు డాడీ
నేనేమో ‘కారు’లో వెళ్లాలనుకుంటాను. మీరు ‘సైకిల్’ తొక్కమంటారు. మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు.. చాలు.. ఇప్పటిదాకా మీరు నాకు చేసింది చాలు. మీ వల్ల నేను కోల్పోయింది చాలు. ఇంకా అర్థం కాలేదా మీకు.. నేనేమో ‘కారు’లో వెళ్లాలనుకుంటాను. మీరు ‘సైకిల్’ తొక్కమంటారు. అవును 1000 సార్లు అదే బావుందనే ఆలోచిస్తారు. కానీ.. ఒక్కసారన్నా వీడికి ఏది నచ్చుతుంది..? అని ఆలోచించారా? అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంలో ఉన్న సంతోషం మీకు తెలుసు. కానీ కోరుకున్నది దొరక్కపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు! పనికిరాని సైకిల్ మీద వెళ్తుంటే.. అందరూ నవ్వుతున్నారు మోడీ. మీరే పొత్తు కుదురుస్తారు. మీరే బావుంది అంటారు..అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే ఒప్పిస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా..? నాకు నచ్చలేదు.. సైకిల్ తొక్కను.. బాబుతో వెళ్లను.. అని గట్టిగా అరవాలనిపిస్తోంది. మీ భవిష్యత్ కోసం తొమ్మిదేళ్ల నుంచి మేం ఓడిపోతూనే ఉన్నాం మోడీ. - ప్రవీణ్‌కుమార్ కాసం