prc implement
-
పీఆర్సీపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్ నివేదికపై అధ్యయనానికి సీఎస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా సీఎం ముఖ్యసలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ అధికారులను నియమించింది. ఆర్టీసీ విలీనంతో సిబ్బందికి పీఆర్సీ అమలుపై కమిటీ చర్చించనుంది. పీఆర్సీ సిఫార్సులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. చదవండి: మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం: ఎన్ఐఏ సోదాలు -
2018 జూలై నుంచి కొత్త పీఆర్సీకి యోచన
-
వచ్చే నెలలో పదకొండో పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : వచ్చే నెలలో పదకొండో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్థిక శాఖ పీఆర్సీకి సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. ముఖ్యమంత్రి త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పీఆర్సీపై చర్చించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పదో పీఆర్సీనే అమల్లో ఉంది. వీకే అగర్వాల్ చైర్మన్‌గా ఉన్న పదో పీఆర్సీ చేసిన సిఫార్సులనే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేసే కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కానుంది. జనవరిలో కమిషన్‌ను ఏర్పాటు చేసి జూలై నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కసరత్తు ప్రారంభించింది. చైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ ఉద్యోగులు, వేతన సంబంధిత వ్యవహారాల్లో అనుభవమున్న సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్‌లకు పీఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే ఆనవాయితీ కొనసాగుతోంది. చైర్మన్ నియామకం పూర్తిగా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైరైన సీనియర్ ఐఏఎస్ ప్రదీప్‌చంద్రతో పాటు స్పెషల్ సీఎస్‌లుగా రిటైరైన ఎంజీ గోపాల్, మహంతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1998 జూలై నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నారు. దాని ప్రకారం పదో పీఆర్సీ కాల పరిమితి 2018 జూలై 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కనీసం ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిషన్ ఆరు నెలల పాటు అధ్యయనం చేయటం తప్పనిసరి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలపై ఉద్యోగుల అభిప్రాయాలను, ప్రతిపాదనలను స్వీకరించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ క్రోడీకరించి కమిషన్ తమ సిఫార్సులను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గత అనుభవాలతో చెబుతున్నారు. ఆ తర్వాత పీఆర్సీ నివేదికను పరిశీలించి, ఏయే ప్రతిపాదనలను ఆమోదించాలి, వేటిని పక్కనబెట్టాలి, ఏయే ప్రతిపాదనలను సవరించాలి అనే అంశాలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ఎంత సుదీర్ఘంగా ఈ ప్రక్రియ కొనసాగినప్పటికీ 2018 జూలై నుంచి ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పలుమార్లు పీఆర్సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించాయి. పూర్తికాని బకాయిల చెల్లింపు.. ఉమ్మడి రాష్ట్రంలోని పదో పీఆర్సీ ప్రకారమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లిస్తోంది. 2014 జూన్‌లో రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ 2013 జూలై 1 నుంచే పీఆర్సీ సిఫారసులను వర్తింపజేసింది. 43 శాతం ఫిట్మెంట్తో వేతనాల చెల్లింపులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉన్న కాలాన్ని నోషనల్‌గా పరిగణించి.. ఆవిర్భావం నాటి నుంచి నగదు రూపంలో పీఆర్సీ బకాయిలను చెల్లించేందుకు అంగీకరించింది. ఇప్పటికీ బకాయిల చెల్లింపు పూర్తి కాలేదు. ఇటీవలే నెలసరి వాయిదాల్లో ఈ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఈ నెలసరి కిస్తులు పూర్తవుతాయి. అందుకే పాత పీఆర్సీ బకాయిల చెల్లింపు పూర్తి కాలేదని, ఇప్పటికిప్పుడు కొత్త పీఆర్సీ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా మరింత భారం పెరుగుతుందని ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో కొత్త పీఆర్సీని ఇప్పుడే వేయాలా.. కొంత కాలం ఆలస్యం చేయాలా..? అనేది పూర్తిగా సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
అంధకారం
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాను చీకటి కమ్మేసింది. పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఆందోళన సోమవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో ఉద్యోగులు అదే స్థాయిలో భీష్మించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయాన్నే విద్యుత్ భవన్‌కు తాళం వేశారు. విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాన్నీ మూసేశారు. సమ్మె కారణంగా జెన్కో సిబ్బంది విధులకు దూరంగా ఉండటంతో వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విజయవాడ, కొత్తగూడెం, ఇతర పవర్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి మందగించింది. సాధారణ రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద 11,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా.. సమ్మె కారణంగా ఆరు వేల మెగావాట్లకు పడిపోవడం గమనార్హం. ఫలితంగా జిల్లాలోనూ విద్యుత్ కష్టాలు చుట్టుముట్టాయి. మొత్తం 10.55 లక్షల మంది వినియోగదారుల అవసరాలకు రోజుకు 90.20 లక్షల యూనిట్లు అవసరం కాగా.. సమ్మె కారణంగా 25 లక్షల యూనిట్ల లోటు తలెత్తింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచే కష్టాలు మొదలయ్యాయి. గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, నందికొట్కూరు తదితర సబ్ డివిజన్లలో రాత్రి 10 గంటల వరకు కోతలు విధించారు. అప్పటి నుంచి నంద్యాల డివిజన్లోని ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, ఆదోని డివిజన్లలోని గ్రామాలకు సరఫరా నిలిపేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లోనూ నాలుగైదు గంటలకు పైగా కోత అమలైంది. సోమవారం సమస్య మరింత జటిలమైంది. జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సరఫరా నిలిపేశారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు కోత విధించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి కరెంట్ కోత కొనసాగుతోంది. గ్రామాల్లో చీకటి అలుముకుంది. 244 భారీ పరిశ్రమలకు సైతం విద్యుత్ సరఫరా నిలిపేయడంతో యజమానులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు ఉద్యోగులు సమ్మె విరమించారు. కొనసాగిన నిరసన విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన సోమవారం రెండో రోజు కొనసాగింది. స్థానిక విద్యుత్ భవన్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రామకృష్ణ మాట్లాడుతూ వేతన సవరణ జీవోను వెంటనే విడుదల చేయాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఏర్పడిన చీకటి కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరసనలో అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.