Pregnant and lactating women
-
అంగన్వాడీల్లో పౌష్టికాహార పరిమాణం పెంపు
సాక్షి, హైదరాబాద్: గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహార పరిమాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు అమలుచేస్తున్న ఒక పూట భోజనం (కోడిగుడ్డు, పాలతోపాటు) పథకాన్ని, పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డును అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించింది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్పీ) కింద అన్ని ప్రాజెక్టుల్లో డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఒకపూట భోజన పథకాన్ని అమలు చేసేందుకు రూ. 94.8 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఆదేశాలు జారీచేశారు. మొత్తం 35,973 అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిగా నెలరోజుల పాటు గర్భిణులు, బాలింతలు,పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనిలో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డును ప్రతిరోజు అందిస్తారు. ఆరేళ్లలోపు పిల్లలకు రోజుకు ఒకటి చొప్పున కోడి గుడ్డును నెల రోజులపాటు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. -
అందని ద్రాక్షలా.. కోడిగుడ్లు
హన్మకొండ చౌరస్తా : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు కోడిగుడ్డు అం దని ద్రాక్షలా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ద్వారా అంగన్వాడీ సెంటర్ల పరిధిలోని లబ్ధిదారులకు ప్రతీ వారం కోడి గుడ్డు సరఫరా చేయాల్సి ఉండగా, రెండు నెలలుగా అలా చేయడం లేదు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవ డం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడా లేని విధంగా రవాణా చార్జీలు మార్కెట్లో గుడ్డు ధర రూ.4 ఉంటే లబ్ధిదారుడి వద్దకు తీసుకువెళ్లినందుకు రవాణా చార్జీ కింద 60 పైసలు చెల్లిస్తున్నారు. సాధారణంగా అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే గుడ్లకు ట్రాన్స్పోర్ట్ చార్జీ 5 నుంచి 10 పైసలకు మించదు. అయితే, ఐకేపీకి గుడ్ల సరఫరా అప్పగించాక రవాణా చార్జీ 60 పైసలు చెల్లిస్తున్నారు. ఇంత ఎక్కువ చార్జీ రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేద ని తెలుస్తోంది. నెలకు రూ.15లక్షల అదనపు భారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,196 అంగన్వాడీ సెంటర్లకు ప్రతి నెలా దాదాపు 36 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నట్లు ఆ శాఖ అ ధికారులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం గుడ్ల సరఫరా బాధ్యతలు ఐకేపీకి అప్పగించాక ట్రాన్‌సపోర్‌ట చార్జీ 60 పైసల చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో దాదాపు రూ.15లక్షలకు పైగా అదనపు భారం పడుతోంది. ఇంత ఖర్చు చేస్తున్నా రెండు నెల లుగా జిల్లాలోని అంగన్ వాడీ సెంటర్లకు కోడిగుడ్లు సరఫరా కాకపోడం గమనార్హం. కలెక్టర్ ఆదేశించినా.. గుడ్లు సరఫరా కావడం లేదనే విషయమై పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన కలెక్టర్ కిషన్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ల సరఫరా సాఫీగా జరిగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది జ రిగి వారం గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. ఏప్రిల్‌లో ఐకేపీకి గుడ్ల సరఫరా అప్పగిస్తే అతికష్టంగా కొద్ది రోజులే సరఫరా చేసినట్లు ఐసీడీఎస్ సిబ్బంది చెబుతున్నారు. చర్యలకు కూడా అవకాశం లేదు ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో అంగన్వాడీ సెంటర్లకు కోడిగుడ్డు సరఫరా చేసేందుకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిం చారు. ట్రాన్స్పోర్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఈఎండీ రూపంలో ఐసీడీఎస్ అకౌంట్ లో జమ చేస్తారు. కాంట్రాక్టర్ సకాలంలో గుడ్లు సరఫరా చేయకున్నా, చిన్న సైజు గుడ్లు సరఫరా చేసినట్లు రుజువైనా ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడం లేదా బిల్లుల చెల్లింపులో కోత విధించడం వంటివి చేస్తారు. దీంతో కాంట్రాక్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ మన జిల్లాలో గుడ్ల సరఫరా బాధ్యతలు ఐకేపీకి అప్పగించడంతో ఎవరిపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. పాత పద్ధతే మేలు.. అంగన్వాడీ సెంటర్లకు కాంట్రాక్ట్ పద్ధతిన గుడ్లు సరఫరా చేయడానికి పౌల్ట్రీ ఫార్మర్స్, ఐకేపీతో పాటు స్వయం సహా యక సంఘాల సభ్యులు టెండర్లు దాఖలు చేయొచ్చు. ఇందులో ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికే కాంట్రాక్టు దక్కు తుంది. కానీ ఇక్కడ ఏకపక్ష నిర్ణయంతో ఐకేపీకి బాధ్యతలు అప్పగించడం, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కోడి గుడ్లు అందక గర్భిణులు, బాలింతలు, చిన్నారులు.. సమాధా నం చెప్పలేక ఐసీడీఎస్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు అధికారులు స్పందించి జిల్లాలో కూడా టెండర్లు ఆహ్వా నించి కోడిగుడ్ల సరఫరా బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. అప్పటి వరకు ఐకేపీ ద్వారా కోడిగుడ్లు సక్ర మంగా చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.