prelims examination
-
ప్రిలిమ్స్ స్కోరే ‘మెయిన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువ డటంతో పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మొదటిసారి ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా అత్యధిక సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగనుంది. వివిధ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ తొలిసారిగా నిర్వహించే గ్రూప్–1 ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లోనూ ఆత్రుత, అయోమయం నెలకొంది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధిస్తే మెయిన్ పరీక్షలకు మార్గం సుగమమవుతుందనే భావన అభ్యర్థుల్లో ఉంది. దీంతో చాలా మంది మెయిన్ పరీక్షలపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ప్రిలిమ్స్ వరకు సాధారణ స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ విధానం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్ మార్కులే కీలకం కానున్నాయి. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను ర్యాంకింగ్‌లోకి పరిగణించరని టీఎస్పీఎస్సీ చెబుతున్నప్పటికీ.. ఈ పరీక్షలో వచ్చే స్కోర్ ఆధారంగానే మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది ఎంపిక... గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష జూలై/ఆగస్టులో నిర్వహిం చనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌ను జనరల్ స్టడీస్, మెంటల్ ఎబి లిటీ(ఆబ్జెక్టివ్ టైప్) విభాగంలో 150 ప్రశ్నలతో నిర్వహిస్తారు. రెండున్నర గంటల పాటు సాగే ఈ పరీక్ష మొత్తం మార్కులు 150. ఇందులో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వారిని నిర్దేశించిన కేటగి రీలు, రిజర్వేషన్ల వారీగా వడపోసి మెయిన్ పరీక్ష లకు ఎంపిక చేస్తారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యో గ ఖాళీలున్నాయి. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పు న మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ లెక్కన టాప్ 25,150 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో ప్రిలిమ్స్ పరీక్షలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. -
అక్టోబర్ 10న సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తదితర అత్యున్నత స్థాయి పోస్టులకు అర్హుల ఎంపికకు సంబంధించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. ఈ పరీక్షను జూలై 27వ తేదీన నిర్వహించాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మూడు నెలల పాటు వాయిదా వేసి అక్టోబర్ 10న నిర్వహిస్తోంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సీశాట్‌గా ఉదయం, మధ్యాహ్నం ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ వరకు అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి పట్టణాల్లో 68 సెంటర్లలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు వివిధ పరిశీలన ప్రక్రియలు నిర్వహించాల్సి ఉన్నందున నిర్ణీత సమయానికి పది నిమిషాల ముందే పరీక్ష కేంద్రం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మూసివేయనున్నారు. బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఇతర వస్తువులు వేటినీ లోపలకు అనుమతించరు. కోవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేకపోతున్న కారణంగా వయోపరిమితి దాటిపోయే అభ్యర్థుల విషయంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు యూపీఎస్సీ వారికి ఈ సారి పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షల ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో 400 మార్కులకు ఉంటుంది. పేపర్, పెన్ను (ఆఫ్‌లైన్ మోడ్)లతో ఈ పరీక్షలు జరుగుతాయి. నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.66 మార్కు కోతపడుతుంది. -
ఆగస్టు 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 24న జరగనుంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రతిష్టాత్మక పరీక్ష కు పర్యవేక్షకులుగా ఆయా రాష్ట్రాల్లోని కొందరు అధికారులను కేటాయించాలని యూపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నట్టు పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహార మంత్రిత్వ శాఖకు మంగళవారం యూపీఎస్సీ లేఖ రాసింది.