Premier Futsal
-
సెప్టెంబర్ 15న ఫూట్సాల్ సీజన్ 2
-
'ఫుట్సాల్'కు రొనాల్డిన్హో దూరం
పనాజీ: భారత్ లో జరుగుతున్న ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్‌లో ఒక ఓటమి, ఒక గెలుపుతో ఉన్న గోవా-5 జట్టుకు బ్రెజిల్ స్టార్ ఆటగాడు రొనాల్డిన్హో దూరమయ్యాడు. త్వరలో బ్రెజిల్ లో జరిగే ఒలింపిక్స్ లో పారా ఒలింపిక్ కమిటీకి రొనాల్డినోను ఆ దేశం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడంతో అతను ఫుట్ సాల్ ను వైదొలిగాడు. గత ఆదివారం బెంగళూరుతో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డినో ఐదు గోల్స్ చేసి గోవా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాను ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్‌లో గోవాకు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా.. తనకు దేశం అతి పెద్ద బాధ్యతను అప్పగించినందున దాన్ని నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందన్నాడు. 'ఫుట్ సాల్ కు దూరం కావడం చాలా దురదృష్టం. నాకు దేశం ఒక బాధ్యతను అప్పగించింది. నన్ను పారా ఒలింపిక్ కమిటీ అంబాసిడర్ గా ప్రకటించింది. దీంతో వెళ్లక తప్పడం లేదు. గోవా జట్టుతో గడిపిన అతి కొద్ది రోజులు చాలా ఆహ్లాదంగా గడిచాయి. తరువాత సీజన్‌కు మరింత పటిష్టంగా వస్తా'అని రొనాల్డిన్హో తెలిపాడు. ఇటీవల ప్రీమియర్ ఫుట్ సాల్ లీగ్ అనేక వివాదాల నడుమ భారత్ లో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో గ్రూప్ -బిలో ఉన్న గోవా మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తుండగా, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ గా వ్యవహరిస్తున్నాడు. -
'మాకు ఏఐఎఫ్ఎఫ్ గుర్తింపు అవసరం లేదు'
న్యూఢిల్లీ: త్వరలో భారత్ లో నిర్వహించబోతున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్సాల్ (ఫైవ్-ఎ-సైడ్) వ్యవహారం మరింత ముదురుతోంది. ఎటువంటి అధికారిక గుర్తింపు లేని ఫుట్సాల్ లీగ్ తో అనవరసమైన సమస్యలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారని ఇటీవల ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) చేసిన వ్యాఖ్యలపై ఆ లీగ్ తాజాగా మండిపడింది. అసలు తమకు ఏఐఎఫ్ఎఫ్ గుర్తింపే అవసరం లేదంటూ ప్రీమియర్ ఫుట్సాల్ తేల్చి చెప్పింది. తమకు ఫుట్సాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఏఐ) సహకారం ఉన్నందును ఇక ఏఐఎఫ్ఎఫ్ అనుమతి అవసరం లేదని పేర్కొంది. మన ప్రజాస్వామ్యం ప్రకారం లీగ్ ను నిర్వహించే అన్ని అనుమతులు తమకు ఉన్నాయని ఫుట్సాల్ తెలిపింది. న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ లీగ్ నిర్వహించడానికి సిద్దమైనట్లు పేర్కొంది. ఇక ఫుట్సాల్ లీగ్ ను నిర్వహించడమే ఇక తరువాయిగా పేర్కొంది. ఈ మేరకు ఆయా జట్లకు చెందిన యజమానుల పేర్లను మంగళవారం చెన్నైలో వెల్లడిస్తామని తెలిపింది. 'ఫైవ్-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ భారత్ లోని వివిధ నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు. ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తున్నారు. గత నెల్లో ఆ లీగ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ వ్యవహరించడాన్ని ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ తప్పుబట్టిని సంగతి తెలిసిందే.ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)తో ప్రమేయం ఉన్న వ్యక్తి వేరే లీగ్‌లతో ఎలా సంబంధం పెట్టుకుంటాడని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ విమర్శించారు.