Premonmadi attack
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి
బద్వేలు అర్బన్/కడప కార్పొరేషన్/కడప రూరల్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రేమోన్మాది లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్యాయత్నం ఘటనలో తీవ్రగాయాలపాలై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు దస్తగిరమ్మ (16) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సాయంత్రం బద్వేలులో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు దస్తగిరమ్మ మృతదేహాన్ని కడసారి చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఒక్కగానొక్క కుమార్తె ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డుతొలగించుకోవాలనే హత్య: ఎస్పీఇక దస్తగిరమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమెను అడ్డుతొలగించుకోడానికే విఘ్నేష్ ఈ హత్యచేశాడని, అతను విచారణలో కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ హర్షవర్థన్‌రాజు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు కేసు పూర్వాపరాలు వివరించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సిఫారసు చేస్తామని తెలిపారు.నా బిడ్డను తగలబెట్టిన వాణ్ణి నాకు అప్పగించండి..‘నా బిడ్డ లేకలేక పుట్టింది. నిష్కారణంగా ఆమెను తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి’.. అని మృతురాలు దస్తగిరమ్మ తల్లి హుసేనమ్మ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీ వద్ద ఆమె మీడియా ఎదుట విలపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నానని.. ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాల్సిన ఆమెను అన్యాయంగా చంపేసిన వాడిని అలాగే తాను మట్టుబెడతానన్నారు. సీఎం చంద్రబాబుతోపాటు పోలీసులంతా నాకు న్యాయం చేయాలన్నారు. రేపు మీ బిడ్డలకు ఇదే పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకుంటారా?.. అమ్మాయిలను ఏడిపించే వారు బతకకూడదని ఆమె మండిపడ్డారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
వెంకటగిరి/నెల్లూరు (క్రైం): తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ బాలిక గొంతుకోసిన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణం అమ్మవారిపేటకు చెందిన బాలిక జ్యోతి (17) స్థానికంగా ఉన్న విశ్వోదయ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాలేజీమిట్ట ప్రాంతానికి చెందిన రాయపాటి చెంచుకృష్ణ ఆమెను ప్రేమిస్తున్నానని, తనతో మాట్లాడాలని కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చెంచుకృష్ణను మందలించారు. కక్షకట్టిన అతను సోమవారం బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన నిందితుడు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. బాలిక ఇంటికి సమీపంలోనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, వెంకటగిరి ఇన్చార్జి సీఐ శ్రీనివాసులరెడ్డి, వెంకటగిరి, బాలాయపల్లి ఎస్ఐలు కోటిరెడ్డి, జిలానీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం వెంకటగిరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో నిందితుడు హత్యకు వినియోగించిన చాకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసు ఎస్కార్ట్‌తో మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలికి పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు. వారంలో చార్జిషీట్ : ఎస్పీ ఈ ఘటనపై ఎస్పీ సీహెచ్ విజయారావు నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో వివరాలు వెల్లడించారు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు (సెక్షన్లు 354–డి, 452, 324,307ఐపిసి సెక్షన్ 10 ఆర్/డబ్ల్యూ 9 (ఐ) అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సోయాక్ట్ 2012) నమోదు చేశామన్నారు. ఘటనపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి వారంలోపు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిపై సస్పెక్టెడ్ షీట్ తెరుస్తామన్నారు. కాగా, ప్రేమోన్మాది చెంచుకృష్ణ చేతిలో గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న జ్యోతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి పరామర్శించారు. బాధితురాలికి మహిళా కమిషన్ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
ఎడ్లను అమ్ముకుని...
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్య కుటుంబం దీనగాథ ♦ ఆస్పత్రి ఖర్చుల కోసం జీవనాధారం విక్రయం ♦ తమ ఊరి నుంచి ఖమ్మంకు వెళ్లేందుకూ డబ్బులేని వైనం ♦ ఊరిలో అప్పు చేసి ఆస్పత్రికి వెళ్లిన కుటుంబసభ్యులు ♦ నిందితుడు శేఖర్‌ను అరెస్టు చేసిన పోలీసులు మంగపేట, ఇల్లందు : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన తమ కుమార్తె సంధ్యను రక్షించుకొనేందుకు ఆమె కుటుంబం జీవనాధారమైన ఎడ్లను అమ్ముకుంది. ఆ సొమ్మును తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. తమ బిడ్డ పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరవుతోంది. శుక్రవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో డిగ్రీ విద్యార్థిని సంధ్య తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో శేఖర్ అనే యువకుడు లారీ కిందకు తోసేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్యను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలు సంధ్య వరంగల్ జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బడి గోవిందరావు, చంద్రమ్మ దంపతుల కుమార్తె. కనీసం వైద్యం చేయించలేని నిరుపేద గిరిజన కుటుంబం వారిది. తమ ఊరి నుంచి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లేందుకు చార్జీలకు కూడా డబ్బు లేకపోవడంతో... తెలిసిన వారి వద్ద అప్పు చేశారు. కానీ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులేని పరిస్థితి. దీంతో సంధ్య బావ బొగ్గం సురేందర్ శనివారం తన రెండు ఎడ్లను రూ.30 వేలకు అమ్మేసి... ఆస్పత్రి ఖర్చులకోసం తీసుకువచ్చాడు. కాగా సంధ్యను లారీ కిందకు తోసేసిన శేఖర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యపై దాడికి పాల్పడినది జూలూరుపాడు మండలం సత్యనారాయణ గ్రామానికి చెందిన ఈసం శేఖర్ అని డీఎస్పీ వీరేశ్వర్‌రావు వెల్లడించారు. దాడికి పాల్పడ్డ అనంతరం శేఖర్ కొరగుట్ట అటవీ ప్రాంతంలోని రహదారుల మీదుగా కాలినడకన ఇల్లెందుకు చేరుకున్నాడని.. మళ్లీ అదేరోడ్డు ద్వారా ఆటోలో తన గ్రామానికి వెళ్లిపోయాడని చెప్పారు. ఎడ్లను అమ్ముకున్నాం.. ఎన్నో ఆశలతో నా బిడ్డను పైచదువుల కోసం పంపాను. ఆమెను ఓ ప్రేమోన్మాది లారీ కిందకు తోసివేసినట్లు తెలిసి వణికిపోయాం. బిడ్డకు వైద్యం కోసం బిడ్డల్లాంటి ఎడ్లను అమ్ముకున్నాం. శేఖర్లాంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి. ప్రేమ అంటూ ఆడపిల్లల వెంటపడే వారందరికీ అదొక హెచ్చరికలా ఉండాలి. - బడి గోవిందయ్య, సంధ్య తండ్రి ఈ బాధ మరెవరికీ రావద్దు నేను ఖమ్మం డిగ్రీ కాలేజీలో బీజెడ్సీ ఫైనలియర్ చదువుతూ సెల్ఫ్ మేనేజ్డ్ హాస్టల్లో ఉంటున్నా. మూడేళ్లుగా క్లాస్మేట్ కృష్ణవేణి కూడా మా హాస్టల్లోనే ఉంటోంది. ఆమెకు వరుసకు తమ్ముడైన శేఖర్ అప్పుడప్పుడు హాస్టల్ వద్దకు వచ్చేవాడు. కొన్ని రోజులయ్యాక నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నేను నిరాకరించా ను. తర్వాత చాలాకాలం అతను నాకు కనిపించలేదు. మళ్లీ రెండు నెలలుగా వెంటపడుతున్నాడు. శుక్రవారం కాలేజీ నుంచి హాస్టల్‌కు వెళుతుండగా శేఖర్ వచ్చాడు. తనను ఎందు కు ప్రేమించడం లేదో చెప్పాలంటూ నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా కోపంతో నా చేతుల్ని విడిపించుకొని హాస్టల్ వైపు వెళుతున్నా. అంతే.. వెనకాలే వస్తున్న శేఖర్ నన్ను లారీ కిందకు తోసేశాడు. లారీ డ్రైవర్ అది చూసి వేగాన్ని తగ్గించాడు. లేకుంటే నేను ఆ లారీకిందే చనిపోయేదాన్ని. తలకు, ముఖానికి దెబ్బలు తగలడంతో షాక్‌లో స్పృహ తప్పిపడిపోయా.. ఇక అక్కడ ఏం జరిగిందో గుర్తులేదు. స్పృహలోకి వచ్చాక చూస్తే ఆస్పత్రిలో ఉన్నా. నాకు ఎదురైన ఇలాంటి భయంకరమైన సంఘటన మరెవరికీ రావద్దు. నన్ను చంపాలనుకున్న శేఖర్‌ను కఠినంగా శిక్షించాలి.. - బాధితురాలు బడి సంధ్య -
'ఆ తండ్రి' తీర్పు కరెక్టే
- ఆత్మరక్షణకే వల్లభరావు ప్రతిదాడి - ప్రేమోన్మాది రాజు కేసులో ఏసీపీ వెల్లడి - హత్యకేసును తొలగించనున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఓ ప్రేమోన్మాది దాడినుంచి తన కుమార్తెతో పాటు ఇతర కుటుంబీకులను రక్షించుకునేందుకే బాధితురాలు నీరజ తండ్రి వల్లభరావు నిందితుడు రాజుపై దాడి చేశాడని ఏసీపీ సంజీవరావు శనివారం వెల్లడించారు. ఈ దాడి ఘటన గత నెల 17న జరిగిన సంగతి విదితమే. ఈ సంఘటనపై బాధితురాలి తల్లి తులసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో వల్లభరావుపై 302 హత్యానేరం,మల్లేష్ అలియాస్ రాజుపై 307, 448, 449, 462, 354 డి సెక్షన్ల కింద కేసు పెట్టామన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరైన రాజు చనిపోయాడనీ, మిగిలిన నిందితుడు వల్లభరావుపై దర్యాప్తు సాగించామన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే వల్లభరావు రాజుపై దాడి చేశాడని, ఉద్దేశపూర్వకంగా చంపలేదని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో వల్లభరావుపై ఉన్న హత్య కేసును త్వరలో తొలగిస్తామన్నారు. మా నాన్నే లేకుంటే... రాజు దాడిలో కత్తిపోట్లకు గురైన నీరజ ‘సాక్షి’తో మాట్లాడుతూ తన తండ్రి వల్లభరావు ధైర్యం చేసి ప్రతిదాడి చేయకుంటే తామెవ్వరమూ బతికేవారము కామని చెప్పింది. తన కుటుంబీలంతా మృత్యువాత పడి ఉండేవారమనీ తండ్రి తెగించి పోరాడి తమను కాపాడాడని తెలిపింది.