ప్రేమ గౌరవాన్ని పెంచేలా...
‘‘సినిమా అనేది ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కానీ... చెడగొట్టేలా ఉండకూడదు. ఇప్పుడొస్తున్న చిత్రాలు ప్రేమను కించపరిచేలా ఉంటున్నాయి. ఇది నిజంగా బాధాకరం. ఈ సినిమా ప్రేమ గౌరవాన్ని పెంచేలా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని దాసరి నారాయణరావు అన్నారు. శివహరీష్, తనూజ, అక్షయ ప్రధాన పాత్రధారులుగా రాజేంద్రదర్శన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ప్రెజెంట్ లవ్’. కె.వి.రమణారెడ్డి, తాడికొండ వెంకటేష్ నిర్మాతలు. చిన్ని కృష్ణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి చేతుల మీదుగా హైదరాబాద్లో విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తయిందని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.