ప్రేమ గౌరవాన్ని పెంచేలా... | Present Love Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ప్రేమ గౌరవాన్ని పెంచేలా...

Published Wed, Jan 29 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

ప్రేమ గౌరవాన్ని పెంచేలా...

ప్రేమ గౌరవాన్ని పెంచేలా...

‘‘సినిమా అనేది ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కానీ... చెడగొట్టేలా ఉండకూడదు. ఇప్పుడొస్తున్న చిత్రాలు ప్రేమను కించపరిచేలా ఉంటున్నాయి. ఇది నిజంగా బాధాకరం. ఈ సినిమా ప్రేమ గౌరవాన్ని పెంచేలా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని దాసరి నారాయణరావు అన్నారు. శివహరీష్, తనూజ, అక్షయ ప్రధాన పాత్రధారులుగా రాజేంద్రదర్శన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ప్రెజెంట్ లవ్’. కె.వి.రమణారెడ్డి, తాడికొండ వెంకటేష్ నిర్మాతలు. చిన్ని కృష్ణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తయిందని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement