Shiva Harish
-
అదే మా సక్సెస్
‘‘అక్కడొకడుంటాడు’ చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నా మౌత్ టాక్‌తో ఆదివారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. ‘భారతీయుడు, అపరిచితుడు’ చిత్రాల కోవలో మా సినిమాలో అండర్ కరెంట్‌గా డ్రంకన్ డ్రైవ్ పైన సందేశం ఉంటుంది. ఇది పూర్తి కమర్షియల్ చిత్రం. నిర్మాత సి.కల్యాణ్‌గారి వల్లే మాకు మంచి థియేటర్లు లభించాయి’’ అని శివ కంఠంనేని అన్నారు. రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘కొత్తదనానికి పట్టం కడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తోంది. మేము అనుకున్నట్టు ప్రేక్షకులకు చేరువయ్యాం’’ అన్నారు. ‘‘సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చోబెడుతోంది. అదే మా సక్సెస్’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక, డిస్ట్రిబ్యూటర్ దాసరి శ్రీనివాస్, చిత్ర నిర్వాహకులు ఘంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎక్కడుంటాడు?
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్ కార్తీక్, శివ హరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరో, హీరోయిన్లుగా, రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ఈ చిత్రం ఆడియో సీడీలను విడుదల చేసి, నిర్మాత సి. కల్యాణ్‌కి ఇచ్చారు. ‘‘అక్కడొకడుంటాడు.. ఎక్కడుంటాడు? ఎందుకుంటాడు? అనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అని శివ కంఠంనేని అన్నారు. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు శ్రీపాద విశ్వక్. ‘‘పైరసీలో కాకుండా థియేటర్లో చూస్తేనే మా సినిమా సాంకేతికంగా ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. ‘అల్లరి’ రవిబాబు మాట్లాడారు. -
ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది
శివ కంఠమనేని టైటిల్ రోల్లో రామ్ కార్తీక్, రసజ్ఞ, శివ హరీశ్, అలేఖ్య హీరో హీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్ తెరకెక్కించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ –‘‘టైటిల్‌లానే సినిమా కూడా వెరైటీగా ఉంటుంది. ప్రతి సన్నివేశం, ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. పెళ్లి కావాల్సిన ఓ ప్రేమ జంట అనుకోకుండా యాక్సిడెంట్లో చిక్కుకుని అందులో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడవిలోకి ప్రవేశిస్తారు. అక్కడ నా పాత్ర ప్రవేశిస్తుంది. నాకు, వాళ్లకూ మధ్య ఏం జరిగింది అన్నది కథ. నేను అంధుడి పాత్రలో కనిపిస్తా’’ అన్నారు. ‘‘30 ఏళ్ల నుంచి సినిమాతో అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం పేపర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ కాన్సెప్ట్ మీద సినిమా తీశాం. క్వాలిటీగా తీశాం. మా సినిమా చూసి నచ్చడంతో రిలీజ్ విషయంలో నిర్మాత సి. కల్యాణ్‌గారు సహకారం అందించారు’’ అన్నారు రావుల వెంకటేశ్వరరావు. -
స్నేహితుల సాయంతో...
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె. శివశంకర్ రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. శ్రీపాద విశ్వక్ దర్శకుడు. రామ్ కార్తీక్, శివ హరీశ్, అలేఖ్య, రసజ్ఞ దీపికా హీరో, హీరోయిన్లు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ హీరో నాగశౌర్య విడుదల చేయగా, ఈ చిత్రంలోని ‘ఆడి పాడి గడిపేద్దాం..’ అనే పాటను ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు విడుదల చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి’’ అన్నారు నాగశౌర్య. ‘‘టైటిల్ పాత్రలో శివ కంఠంనేని బాగా ఒదిగిపోయారు’’ అన్నారు కేయస్ రామారావు. ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే అనర్థాలను మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు శివ కంఠంనేని. శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. ఆ ప్రేమ జంట ఎలా బయటపడుతుందనే అంశంతో లె రకెక్కిన చిత్రమిది. త్వరలోనే సినిమాలోని అన్ని పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు!
రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞదీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. ‘అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘డ్రంకన్ డ్రైవ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా నేను చూశా. మంచి సందేశం ఉంది. శివ కంఠంనేని సీనియర్ నటుల కోవలో తన పాత్రలో ఒదిగిపోయాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నేను కూడా చూశా. కొత్త నిర్మాతలు తీశారనే భావన ఎక్కడా కలగదు. పేరెంట్స్‌తో పాటు యువత చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు అశోక్ కుమార్. ‘‘మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులను కదలనివ్వకుండా కూర్చోబెట్టే చిత్రమిది’’ అన్నారు శివ కంఠంనేని. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీపాద విశ్వక్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహనిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి. -
మద్యం తాగి వాహనాలు నడిపితే?
శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేక్షకులకు ప్రతిక్షణం ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. దాని నుంచి ఆ ప్రేమజంట ఎలా బయటపడ్డారన్నదే చిత్ర ప్రధానాంశం’’ అని శ్రీపాద విశ్వక్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహ నిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి. -
ఎలా బయటపడ్డారు
శివ కంఠంనేని, రవిబాబు, వినోద్‌కుమార్, ఇంద్రజ, రామ్ కార్తీక్, శివ హరీశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకర రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రకథ బాగా నచ్చి నిర్మించా’’ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. శ్రీపాద విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ఓ ప్రేమ జంట స్నేహితుల సహాయం పొందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. వాటి నుంచి ప్రేమ జంట, ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు? అన్నదే కథ. యాక్షన్, సస్పెన్స్ ఉన్న చిత్రం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్, ఎన్.వి. గోపాల్‌రావు, కె.శ్రీధర్ రెడ్డి, సంగీతం: సార్క్స్. -
ప్రేమ గౌరవాన్ని పెంచేలా...
‘‘సినిమా అనేది ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కానీ... చెడగొట్టేలా ఉండకూడదు. ఇప్పుడొస్తున్న చిత్రాలు ప్రేమను కించపరిచేలా ఉంటున్నాయి. ఇది నిజంగా బాధాకరం. ఈ సినిమా ప్రేమ గౌరవాన్ని పెంచేలా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని దాసరి నారాయణరావు అన్నారు. శివహరీష్, తనూజ, అక్షయ ప్రధాన పాత్రధారులుగా రాజేంద్రదర్శన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ప్రెజెంట్ లవ్’. కె.వి.రమణారెడ్డి, తాడికొండ వెంకటేష్ నిర్మాతలు. చిన్ని కృష్ణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తయిందని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.