preservation of forests
-
వారి ఓవరాక్షన్‌పై కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘అసలేం చేస్తున్నారు. అడవుల సంరక్షణను విస్మరించి తలాతోకా లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. వెంటనే పనితీరు మార్చుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకునేందుకు వెనుకాడను’ అంటూ ఐఎఫ్ఎస్ అధికారులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం కార్యాలయంలోనే అటవీ శాఖ బాధ్యతలను ముగ్గురు ఉన్నతాధికారులకు అప్పగించాం. ఇద్దరు ఐపీఎస్‌లు, ఓ ఐఏఎస్ ఇదే పనిలో ఉన్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? అడవులపై పర్యవేక్షణ లేకపోగా, ప్రభుత్వ కార్యక్రమాలను ఆటంకపరుస్తున్నారు. మీ అంతట మీరే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ అటవీ శాఖ, సీఎంవో అధికారుల తీరుపై మండిపడ్డారు. సంబంధిత అధికారులందరినీ మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌కు పిలిపించి మంత్రుల సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడో విడత హరితహారం అనుకున్నట్లుగా సాగడం లేదని, సరిపడా నియామకాలు చేపడుతుంటే అధికారులు సరిగా పనిచేయటం లేదని సీఎం మండిపడ్డారు. క్షేత్ర స్థాయికి వెళ్లకుండా అరణ్యభవన్లోనే ఉంటున్నారని, అవసరమైతే ఐఎఫ్ఎస్ల నుంచి ఈ సేవలను తప్పించి.. సమర్థంగా పని చేసే రాష్ట్ర అధికారుల సేవలను వాడుకుంటామని, వారికే రాష్ట్రస్థాయి పర్యవేక్షణ బాధ్యతలిస్తామని అరణ్యభవన్, సీఎంవో ఆఫీసు అధికారులను హెచ్చరించారు. అంత అవసరం ఏమొచ్చింది..? ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయలను అటవీ శాఖ అధికారులు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ ఘటనపై అధికారుల ఎదుటే సీఎం పోస్ట్‌మార్టమ్ నిర్వహించినట్లు తెలిసింది. ‘గొత్తికోయల పట్ల ఈ చర్యలకు పాల్పడిందెవరు? అసలు గొత్తికోయలపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాడి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశించింది ఎవరు? చర్యలు తీసుకునే ముందు జిల్లా అధికారులు, లేదా రాష్ట్ర అధికారులు, స్థానిక పోలీసులకు.. ఎవరికైనా సమాచారమిచ్చారా? ఇస్తే ఎవరికిచ్చారు..? అన్ని వివరాలనూ ఇవ్వండి.. బాధ్యులపై చర్యలు తీసుకోండి’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందనే కనీస అవగాహన లేని అధికారులున్నారా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికారుల ఉరుకులు పరుగులు సీఎం ఆగ్రహించడంతో అటవీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. బుధవారం ఉదయాన్నే అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించటంతోపాటు సచివాలయంలో సమావేశమై లోటుపాట్లను సమీక్షించుకున్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, పీసీసీఎఫ్ పి.కె.ఝా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. కనీస అవగాహన లేకుండా నివేదికలా? అటవీ శాఖకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చుతున్నారంటూ అధికారులను సీఎం తప్పుబట్టారు. గోదావరిపై కాళేశ్వరం సమీపంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీతో ఎల్‌మడుగు మొసళ్ల సంరక్షణ కేంద్రానికి ముప్పు ఉందని కేంద్ర పర్యావరణ శాఖకు అటవీ శాఖ సమాచారమిచ్చింది. దీనిపై సీఎం మాట్లాడుతూ.. ‘అన్నారం బ్యారేజీ నీటి నిల్వ 10 కిలోమీటర్లకు విస్తరిస్తుంటే.. 14 కి.మీ. దూరంలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి ముప్పేముంది? నీటిలో బతికే మొసళ్లకు నీటినిల్వతో ప్రమాదమేంటి? కనీస అవగాహన లేకుండా ఎందుకిలా తప్పుడు నివేదికలు పంపుతున్నారు?’ అంటూ నిలదీసినట్లు సమాచారం. ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకుండా వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ ఇలానే విచిత్రంగా ఉన్నాయని మండిపడ్డారు. అసలు టైగర్లు లేని శ్రీశైలం పులుల అభయారణ్యంతో ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు అనుమతులు ఆపుతున్నారని, హైదరాబాద్ నడిబొడ్డున కేబీఆర్ పార్కు వైల్డ్ లైఫ్ పార్కంటూ అభ్యంతరం చెబుతున్నారని పలు ఉదాహరణలను వారి ముందుంచారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు అడ్డుపడే ఎకో టూరిజం లాంటి అటవీ శాఖ ప్రాజెక్టులను అవసరమైతే డీ నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
చింతలమానెపల్లి : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని, వాటిని కాపాడడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అటవీశాఖ కోర్సిని బీట్ అధికారి ప్రభాకర్ అన్నారు. బాబాపూర్ గ్రామపంచాయతీలోని లంబాడిహేటిలో అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం నివారించాలంటే అడవులను పెంచాలన్నారు. అటవీ జంతువులను వేటాడడానికి పలుచోట్ల ఉచ్చులు బిగించారని వీటికారణంగా మనుషులు చనిపోతున్నారన్నారు. అటవీ జంతువుల కారణంగా పంటలు నష్టపోయినా, ఆస్థులు నష్టపోయినా సమాచారం అందిస్తే వాటికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అడవులను నాశనం చేయడం, వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, చట్టాలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మనోరంజితం పటచిత్రం
వేలాది శ్లోకాల్లో ఇమిడి ఉన్న రామాయణ, మహాభారతాలను తన ప్రతిభతో చిత్రరూపం ఇచ్చి మన ముందుంచారు బెంగాలీ ఆర్టిస్ట్ రంజిత్ చిత్రకార్. పటచిత్ర ప్రతిభతో రామాయణానికి చిత్ర రూపం ఇస్తూ 45 షీట్లలో బంధించారు. అంతే మనోరంజకంగా మహాభారతాన్ని చిత్రరాజంగా మలచారు. బంజారాహిల్స్‌లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం మొదలైన ‘పటచిత్ర’ ప్రదర్శన అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ నెల 14 వరకు జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఎయిడ్స్ నియంత్రణ, అడవుల సంరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా చిత్రాలు కొలువు దీరాయి. ‘పదేళ్ల వయసు నుంచే పటచిత్ర ఆర్ట్ నేర్చుకున్నాను. కఠోర సాధనతోనే ఈ రంగంలో పేరు సాధించగలిగాను. శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ, లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఢాకా యూనివర్సిటీ, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్‌లలో నా ఆర్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. నా ఇద్దరు కుమారులు కూడా పటచిత్ర పెయింటింగ్ చేస్తున్నార’ని కుంచెకారుడు రంజిత్ చిత్రకార్ తెలిపారు. వాంకె శ్రీనివాస్ రంగుల కళ మదిలోని అందమైన ఊహలకు రంగులు అద్దితే.. కలలకు రూపమిచ్చి కళాఖండాలుగా కళ్లముందు పెడితే.. ఎంత అద్భుతం..! ఇలాంటి అందమైన అద్భుతమే మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఆవిష్కరించారు. ‘మిలాంజ్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మరో లోకాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే కళాశాలలో పెయింటింగ్ ఓనమాలు దిద్ది, పేరొందిన ఫైన్ఆర్ట్స్ కళాశాలల్లో మాస్టర్స డిగ్రీలు పొంది అంతా కలసి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మండుతున్న అగ్గిపుల్లపై పెద్దపులి, పూలకుండిలోని మొక్క ఆకును అందుకునేందుకు ప్రయత్నిస్తున్న జిరాఫీ.. సీతాకోక చిలుక ఏనుగును పట్టుకుని ఎగిరిపోవడం.. వంటి ఎన్నో చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. -
వీరు పట్టుకుంటారు..వారు పట్టించుకోరు..!
ఆదిలాబాద్ క్రైం : అడవుల సంరక్షణలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటవీ సిబ్బంది కంటే కలప పట్టుకోవడంలో పోలీసులే ముందుండటమే ఇందుకు నిదర్శనం. అటవీ సిబ్బంది కలపను పట్టుకోవడం దేవుడెరుక.. పట్టుకున్న కలపను స్వాధీనం చేసుకోవడం, వచ్చిన సమాచారానికి స్పందిస్తే చాలనే భావన నెలకొంది. జిల్లా విస్తీర్ణంలో 43 శాతం అడవులు ఉన్నాయి. సుమారు 7.15 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. జిల్లాలో టేకు చెట్లకు డిమాండ్ అ ధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కలపస్మగర్ల దాటికి అడవి అంతరించి పోతోంది. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 20 చెక్‌పోస్టులు ఉన్నా కలప స్మగ్లర్ల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా అడవులు కాపాడటంలో అటవీశా ఖ అధికారులు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. పోలీసులదే ముఖ్య భూమిక కొంత కాలంగా జిల్లాలో కలప రవాణాను అడ్డుకోవడంలో పోలీసులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారుల మన్ననలు కూడా అందుకుంటున్నారు. కాగా అటవీ సంపదను కాపాడి.. కలప అక్రమ రవాణాను అడ్డుకునే బాధ్యత కలిగిన అటవీ శాఖ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు, అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు రైలులో అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది. పలు సందర్భాల్లో నిందితులు పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి. పట్టుకున్న కలపను స్వాధీనం చేసుకోవడంలో అటవీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లా పోలీసులకు పలుమార్లు పట్టుబడ్డ కలపను స్వాధీనం చేసుకోవాలని అటవీ సిబ్బందికి సమాచారం అందించిన సరైన సమయానికి రాకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు పోలీసు వర్గాలు చర్చించుకోవడం గమనార్హం. స్వాధీనం చేసుకోవడానికి గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, కొన్ని సందర్భాల్లో రాత్రి సమయంలో పట్టుబడ్డ కలపను తర్వాతి రోజు వచ్చి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ పట్టణానికి తాసిం, తలమడుగు, ఇచ్చోడ, బజార్హత్నూర్ ప్రాంతాల నుంచి కలప రవాణా అవుతుంది. కలప అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసినా అటవీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా అటవీ సిబ్బంది కంటే కలప పట్టుకోవడంలో పోలీసులే కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. తరలుతున్న కలప జిల్లాలో కలప అక్రమ రవాణా మూడేళ్లలో చూసుకుంటే 17,681 కేసులు నమోదు కాగా రూ.24కోట్ల విలువైన కలప ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో కలప, వాహనాలు మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు. నిందితులు పట్టుబ డ్డ సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. అసలు నేరస్తులు మాత్రం దొరకడం లేదు. జిల్లాలో అడవులు నరరకడంతో విలువైన వృక్ష సంపదను కోల్పోతున్నాము. ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, నిర్మల్, మామడ, ఖానాపూర్, బిర్సాయిపేట, తాళ్లపేట్, ఇందన్పల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాల నుంచి కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. రోడ్లు, నదులు, రైల్వే మార్గం గుండా ఈ దందా కొనసాగుతుంది. రోడ్డు మా ర్గం గుండా తరలించే కలపను అక్కడక్కడ పోలీసు తనిఖీల్లో పట్టుబడుతుండగా.. నదులు, రైల్వే, ఇతర అక్రమ దారుల గుండా తరలించే కలపను పట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో అటవీ సిబ్బంది కంటే పోలీసులే ముందుంటున్నార ు. జిల్లాలో ప్రతి ఏటా రూ. 10 కోట్లకు పైగా టేకు స్మగ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ పోతుండడంతో అడవి ఎంత పెద్ద మొత్తంలో నరకబడుతుందో కేసుల సంఖ్యను చూస్తే తెలిసిపోతుంది. ఆయుధాలుంటే అడ్డుకోగలరు.. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు లేకపోవడంతోనే స్మగ్లర్లు భయంలేకుండా యథేచ్ఛగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. కలప రవాణాను అడ్డుకునే సమయంలో తమపై దాడి చేస్తారేమోనని అటవీశాఖ సిబ్బంది భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కలప రవాణాను అడ్డుకోవడంలో పురోగతి సాధించడం లేదని తెలుస్తోంది. తమ వద్ద కూడా తుపాకులుంటే స్మగ్లర్లు భయపడుతారని, కలప అక్రమ రవాణా చేసేందుకు సాహసించరని చెప్పుకొస్తున్నారు. అయితే 1982కు ముందు అటవీశాఖ సిబ్బంది ఆయుధాలు, వైర్లెస్ సెట్లు ఉండేవి. కానీ మావోయిస్టుల ప్రభావంతో ఎక్కడ ఆయుధాలు అపహరించుకుపోయే అవకాశాలు ఉన్నందున 1986లో ప్రభుత్వం ఆయుధాలను వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి అటవీ సంరక్షణలో ఉన్న సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు పెరిగాయి. పలువురు వీరి దాడుల్లో మృత్యువాత కూడా పడ్డారు. దీంతో స్మగ్లర్లను అడ్డుకోవడంతో ఫారెస్టు అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. పోలీసులకు ఆయుధాలు ఉండడంతో స్మగ్లర్లు వారిపై దాడులు చేసేందుకు భయపడుతున్నారు. ఇందులో భాగంగానే పోలీసులకు కలప రవాణా అవుతుందని తెలిస్తే ఆ ప్రాంతంలో నిర్భయంగా తనిఖీలు చేస్తున్నారు. అవే ఆయుధాలు తమకు కూడా ఇస్తే అటవీ సంరక్షణకు పాటుపడుతామని అధికారులు పేర్కొంటున్నారు. కలప రవాణాను అడ్డుకుంటాం.. కలప రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టడం జ రిగింది. కలప తరలించే మార్గాలన్నింటిని మూసివేస్తున్నాం. ప్రస్తుతం 20 శాతం మంది సిబ్బంది కొరత ఉన్నప్పటికి కలప రవాణాను అడ్డుకోవడంలో సిబ్బంది కృషి చేస్తున్నారు. దీనికి పోలీసులు సైతం సహకరిస్తున్నారు. కలప తరులుతున్నట్లు ఎటువంటి సమాచారం వచ్చిన వెంటనే స్పందించి అ క్కడికి చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కలపతో పాటు వాటిని రవాణా చేసేవారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నాం. అటవీ సంపదను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టాం. వచ్చే ఏడాదిలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అడవులను కాపాడే బాద్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.