లారీల సమ్మె ఇక మరింత ఉధృతం
లారీ ఓనర్స్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి
గోకవరం (జగ్గంపేట) :
లారీ యజమానుల డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మెను ఉధృతంగా చేస్తామని లారీ ఓనర్స్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. మండలంలో గుమ్మళ్లదొడ్డి శివారులో ఉన్న ఐఓసీఎల్ ప్లాంట్ ఎదురుగా డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లాలోని పలు లారీ, వ్యా¯ŒS యూనియ¯ŒS నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున ఈ నెల 8 నుంచి ఆలిండియా బంద్‌కు పిలుపు ఇచ్చామన్నారు. మంగళవారానికి సమ్మె ఆరో రోజుకు చేరిందని, అవసరమైతే నిత్యావసర సరుకుల లారీలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. జిల్లా లారీ ఓనర్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎంఆర్ శేఖర్‌రెడ్డి, గోదావరి నేషనల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సీహెచ్ ఆంజనేయప్రసాద్, కార్యదర్శి దుర్గాప్రసాద్, గోకవరం, పిఠాపురం, సోమేశ్వరం, కేశవరం, ఆలమూరు, పెద్దాపురం, రాజమహేంద్రవరం, రావులపాలెం, ద్వారపూడి, అనపర్తి, కత్తిపూడి, బలభద్రపురం, బిక్కవోలు, సామర్లకోట, రాజోలు, కొత్తపల్లి తదితర లారీ, వ్యా¯ŒS అసోసియేష¯ŒS నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న కోరుకొండ సీఐ మధుసూదనరావు, గోకవరం ఎస్సై వెంకటసురేష్, తిరుపతిరావు, సిబ్బందితో ఐఓసీఎల్ ప్లాంట్ బందోబస్తు నిర్వహించారు.