President Award
-
పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్‌కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్‌కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్‌ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్‌ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్‌లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్‌ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్‌తో ఈ యూనిట్‌ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్‌టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్‌ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్‌కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్‌లు, ఆస్పత్రి మెటీరియల్స్‌ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్‌ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్‌గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి. -
'నారీ శక్తిమతి' రాధికా మెనన్
అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా భారత రాష్ట్రపతి భవనం వేడుకలకు వేదికైంది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను రాష్ట్రపతి స్వయంగా ‘నారీశక్తి పురస్కారం’తో సత్కరిస్తున్నారు. వారిలో రాధికా మెనన్ కూడా ఉన్నారు. తుపానులో నడి సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించిన ధీర ఆమె. కెప్టెన్‌గా తొలి మహిళ రాధికామెనన్ పుట్టింది కేరళలోని కోదుంగళ్లూర్‌లో. కొచ్చిలోని ‘ఆల్ ఇండియా మెరైన్ కాలేజ్’లో కోర్సు పూర్తయిన తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రేడియో ఆఫీసర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత 2012లో ఇండియన్ మర్చంట్ నేవీలో కెప్టెన్ అయ్యారు. మర్చంట్ నేవీలో ఒక మహిళ కెప్టెన్ కావడం ఆమెతోనే మొదలు. మెనన్ అదే ఏడాది దాదాపుగా 22 వేల టన్నుల అత్యంత కీలకమైన ఆయిల్ ట్యాంకర్ ‘సువర్ణ స్వరాజ్య’ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆమె ధైర్యసాహసాల గురించి తెలుసుకోవాలంటే ఏడేళ్లు వెనక్కి వెళ్లాలి. లంగరు తెగిపోయింది అది 2015, జూన్ నెల. బంగాళాఖాతంలో పెను తుపాను. సముద్రం అల్లకల్లోలంగా సుడులు తిరుగుతోంది. అలలు 15 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. చేపల వేటకు వెళ్లిన జాలర్ల పడవ ‘దుర్గమ్మ’ ఆ సుడుల్లో చిక్కుకుపోయింది. లంగరు తెగిపోవడంతో పడవ గమ్యం లేకుండా అలల తాకిడికి అల్లల్లాడుతూ కొట్టుకుపోతోంది. ఆహారపదార్థాలు, తాగునీరు ఉప్పునీటి పాలయ్యాయి. పడవలో ఉన్న ఏడుగురు జాలర్లు ప్రాణాలను చిక్కబట్టుకుని తీరం చేరే దారి కోసం చూస్తున్నారు. వారి ఇళ్లలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లిన వాళ్ల జాడలేకపోవడంతో ఆశలు కూడా వదులుకున్నారు. ఆచూకీ దొరకని జాలర్లు పదిహేనేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు వాళ్లు. అన్ని ఇళ్లలో తల్లులు, భార్యాపిల్లలు తమ తమవాళ్ల కోసం ఆశగా ఎదురు చూసి చూసి ఇక ఆశ చంపుకుని మనసు చిక్కబట్టుకుని అంత్యక్రియలకు సన్నద్ధమవుతున్నారు. ఆ సమయంలో సముద్రంలో రాధికా మెనన్ తన టీమ్‌తో ఈ మత్స్యకారులను రక్షించడంలో మునిగిపోయి ఉన్నారు. పడవలో చిక్కుకున్న వాళ్లకు లైఫ్‌జాకెట్లు అందచేసి, పైలట్ ల్యాడర్ సహాయంతో దుర్గమ్మ పడవలో నుంచి ఒక్కొక్కరిని షిప్ మీదకు చేర్చారామె. అలా అందరూ ప్రాణాలతో తమవాళ్లను చేరుకున్నారు. తుపాను సమయంలో నడిసముద్రంలో అంతటి సాహసోపేతంగా విధులు నిర్వర్తించినందుకు గాను 2016 సంవత్సరానికి గాను ఆమె అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేసే ‘ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డు’ను, ఐఎమ్‌వో బ్రేవరీ అవార్డును అందుకున్నారు. షిప్ కమాండర్‌గా ఇవన్నీ విధుల్లో భాగమేనంటారు రాధిక. తోటి మహిళా నావల్ అధికారులు సునీతి బాల, శర్వాణి మిశ్రాలతో కలిసి ముంబయి కేంద్రంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్ సీ ఫారర్స్ ఫౌండేషన్ స్థాపించి యువతులను ఈ రంగంలోకి ప్రోత్సహిస్తున్నారామె. అలాగే ఢిల్లీ నుంచి వెలువడుతున్న మ్యారిటైమ్ మ్యాగజైన్ ‘సీ అండ్ కోస్ట్’ కు సలహామండలి సభ్యురాలు కూడా. ఇవన్నీ తెలిసే కొద్దీ రాధికామెనన్ నారీశక్తి పురస్కారానికి అచ్చంగా మూర్తీభవించిన రూపం అనిపిస్తుంది. -
గణతంత్ర వేళ: తెలుగు రాష్ట్రాలకు పోలీస్ పతకాల పంట
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా పోలీస్ పతకాలు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పోలీస్ పతకాలు ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ తెలుగు రాష్ట్రాలకు భారీగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు పోలీస్ అధికారులకు ఈ పురస్కారాలు దక్కాయి. ఈ పతకాలను త్వరలోనే స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్: 18 పోలీస్ మెడల్స్, ఒక రాష్ట్రపతి విశిష్ట సేవ, 2 గ్యాలంట్రీ పతకాలు, విశిష్ట సేవ కేటగిరీలో 15 మందికి పతకాలు వచ్చాయి. తెలంగాణ 14 పోలీస్ మెడల్స్, రాష్ట్రపతి విశిష్ట సేవ 2, విశిష్ట సేవ కేటగిరీలో 12 పతకాలు ప్రకటించారు. వీరిలో హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్‌కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఆయా అధికారులు తమ విధుల్లో కనబర్చిన ప్రతిభకు ఈ పతకాలు దక్కాయి. పతకాలు పొందిన వారిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. త్వరలోనే వీరు పతకాలు స్వీకరించనున్నారు. -
ఎన్ఎస్ఎస్ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సేవా పథకం ద్వారా అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్ఎస్ఎస్ అధికారులు, వలంటీర్లు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డు గ్రహీతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి ఎం.శీతల్రెడ్డి, వర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్‌కు చెందిన వలం టీర్లు మెంత్రి సౌజన్య, వి.హరికృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఏపీ నుంచి నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆరి్డనేటర్, ప్రస్తుతం డిప్యుటేషన్‌పై రాష్ట్ర సచివాలయంలో స్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డా.రమేష్‌రెడ్డి, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిరెడ్డి పరదేశి నాయుడు పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ హిందీ విభాగానికి చెందిన వాలంటీర్ బందుల మహేంద్రనాథ్, ట్రైనింగ్ ఓరియెంటేషన్ సెంటర్‌కు చెందిన వాలంటీర్ కొటికలపూడి జగదీశ్వరి అవార్డులు దక్కించుకున్నారు. అవార్డు స్ఫూర్తిని నింపింది.. ఈ అవార్డు ఎంతో స్ఫూర్తిని నింపిందని, ప్రజలకు ఎన్ఎస్ఎస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో 44 వేల మంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉంటే అవార్డు దక్కించుకున్న 10 మందిలో తాను ఉండటం ఆనందాన్ని ఇచ్చిందని ఆదిరెడ్డి పరదేశి పేర్కొన్నారు. -
జేఎన్యూకు ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: విద్యార్థులపై రాజద్రోహం కేసులతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ( జేఎన్‌యూ) ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారం దక్కించుకుంది. 'ఉత్తమ పరిశోధన, కొత్త ఆలోచన' విభాగంలో రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకుంది. సందర్శకుల అవార్డుల్లో ప్రొఫెసర్ భట్నాగర్‌కు ఉత్తమ పరిశోధన (ఆంత్రాక్స్ వ్యాక్సిన్‌పై పరిశోధనలో), మాలిక్యులార్ పారాసిటాలజీ విభాగానికి కొత్త ఆలోచనను ప్రోత్సహించినందుకు (యాంటీ మలేరియా, అమీబియాసిస్ పరిశోధనలో) ఈ అవార్డు దక్కింది. సందర్శకుల అవార్డుల్లో అస్సాంలోని తేజ్‌పూర్ వర్సిటీ ఉత్తమ వర్సిటీగా ఎంపికైంది. ఈ నెల 14న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు ప్రదానం చేస్తారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు లక్ష రూపాయల నగదు అందజేస్తారు. -
సెంట్రల్ ఎక్సైజ్ అధికారి నాగేంద్రరావుకు రాష్ట్రపతి అవార్డు
విజయవాడ బ్యూరో: గుంటూరు సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ వి.నాగేంద్రరావు (ఐఆర్ఎస్)కు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవార్డు లభించింది. ఈ నెల 24న ఢిల్లీలో జరిగే సెంట్రల్ ఎక్సైజ్ డే వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నాగేంద్రరావుకు సమాచారం అందింది. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామానికి చెందిన నాగేంద్రరావు 1992లో సివిల్ సర్వీసెస్ పరీక్ష పాసై సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 2002లో అసిస్టెంట్ కమిషనర్‌గానూ, 2015లో అడిషనల్ కమిషనర్‌గానూ పదోన్నతులు పొందిన నాగేంద్రరావు మీరట్, చెన్నై, మంగళూర్ నగరాల్లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెంట్రల్ ఎక్సైజ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోన్న నాగేంద్రరావు మంచి అధికారిగా కేంద్రప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారు. ఈ నెల 24న ఢిల్లీలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోన్న సందర్భంగా ఈయనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపికచేశారు. దేశవ్యాప్తంగా 17మందిని ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచి ఎంపికైంది నాగేంద్రరావు ఒక్కరే. -
ఎస్ఐ సురేష్‌కు రాష్ట్రపతి అత్యున్నత అవార్డు
ఖమ్మం(టేకులపల్లి): ఖమ్మం జిల్లా పోలీసు శాఖాధికారులకు ఎవరికీ దక్కని గౌరవం టేకులపల్లి ఎస్ఐ తాటిపాముల సురేష్‌కు దక్కింది. పోలీసు శాఖలో అత్యున్నత పురస్కారంగా భావించే రాష్ట్రపతి అత్యున్నత అవార్డును ఆయన తీసుకోనున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆయనకు ఉత్తర్వులు అందాయి. పంద్రాగస్టు నాడు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాంత్య్రదినోత్సవ వేడుకలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డును ఎస్ఐ అందుకోనున్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన సురేష్ తొలుత భద్రాచలం సబ్ డివిజన్లో ప్రోబెషనరీ ఎస్ఐగా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఎర్రుపాలెం, ఖమ్మం టూటౌన్‌లలో ఎస్ఐగా చేశారు. నాలుగు నెలల క్రితమే టేకులపల్లి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ఈయన విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పోలీసింగ్ నిర్వహించే వారు. ఎక్కడ పని చేసినా అక్కడి ప్రజల మన్ననలు పొందేవారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు పోలీసు శాఖలో ఇంతటి అత్యున్నత అవార్డు రాకపోవడం విశేషం. -
విజయనగరం వాసికి రాష్ట్రపతి అవార్డు
విజయనగరం టౌన్ : సీఆర్పీఎఫ్ డీఐజీగా తరాలు(బెంగళూరు)లో విశేష సేవలందిస్తున్న విజయనగరానికి చెందిన ఆరాధ్యుల శ్రీనివాస్ సీఆర్పీఎఫ్ డీజీ దిలీప్ త్రివేదీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డును బుధవారం అందుకున్నారు. సర్వీసులో ఉత్తమ సేవలందించినందుకుగాను రాష్ట్రపతి అవార్డు లభించింది. ఈయన ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విజయనగరంలోని మహారాజ మోడల్ హైస్కూల్లో, ఇంటర్, డిగ్రీ మహారాజ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఉత్తరాంధ్రలో సీఆర్పీఎఫ్లో కమాం డెంట్ ఆఫీసర్‌గా పని చేసి, అంచలంచెలుగా ఎదిగారు. 20 ఏళ్ల పాటు అందించిన సేవలకుగాను ప్రభుత్వం అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉందని ఆయన సాక్షికి తెలిపారు. శ్రీనివాస్‌కు రాష్ట్రపతి రావడం పట్ల భార్య పద్మజ, పిల్లలు మేఘన, విష్ణు, తండ్రి ఏవీజీ కృష్ణ, లక్ష్మీయశోద(బాలమ్మ), బావమరిది పిడపర్తి సాంబశివశాస్త్రి, కుటుంబ సభ్యులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.