ఎస్‌ఐ సురేష్‌కు రాష్ట్రపతి అత్యున్నత అవార్డు | tekupalli si kumar selected for president award | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ సురేష్‌కు రాష్ట్రపతి అత్యున్నత అవార్డు

Published Thu, Aug 13 2015 11:16 PM | Last Updated on Sun, Sep 2 2018 3:47 PM

tekupalli si kumar selected for president award

ఖమ్మం(టేకులపల్లి): ఖమ్మం జిల్లా పోలీసు శాఖాధికారులకు ఎవరికీ దక్కని గౌరవం టేకులపల్లి ఎస్‌ఐ తాటిపాముల సురేష్‌కు దక్కింది. పోలీసు శాఖలో అత్యున్నత పురస్కారంగా భావించే రాష్ట్రపతి అత్యున్నత అవార్డును ఆయన తీసుకోనున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆయనకు ఉత్తర్వులు అందాయి. పంద్రాగస్టు నాడు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాంత్య్రదినోత్సవ వేడుకలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డును ఎస్‌ఐ అందుకోనున్నారు.

2009 బ్యాచ్‌కు చెందిన సురేష్ తొలుత భద్రాచలం సబ్ డివిజన్‌లో ప్రోబెషనరీ ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఎర్రుపాలెం, ఖమ్మం టూటౌన్‌లలో ఎస్‌ఐగా చేశారు. నాలుగు నెలల క్రితమే టేకులపల్లి ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ఈయన విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పోలీసింగ్ నిర్వహించే వారు. ఎక్కడ పని చేసినా అక్కడి ప్రజల మన్ననలు పొందేవారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు పోలీసు శాఖలో ఇంతటి అత్యున్నత అవార్డు రాకపోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement