president orders
-
ఇదీ రాష్ట్రపతి ఉత్తర్వు!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ –370ను రద్దు చేస్తూ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. దీనిని రాజ్యాంగ (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వులు, 2019గా పిలుస్తారు. ఈ ఉత్తర్వులు ఇలా ఉన్నాయి. ‘ఆర్టికల్ 370లోని నిబంధన (1) ద్వారా దఖలు పడిన అధికారాలతో రాష్ట్రపతి జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమ్మతితో ఈ కింది ఉత్తర్వులు జారీచేశారు. 1. (1) దీనిని రాజ్యాంగ (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వులు–2019గా పిలుస్తారు. (2). ఇది అమల్లోకి రాగానే రాజ్యాంగ (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వులు–1959 రద్దవుతాయి. 2. రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు, సమయానుసారం సవరించినవి సహా, జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తాయి. అలాగే మినహాయింపులు, మార్పులు ఈ కింది రూపంలో వర్తిస్తాయి. ఆర్టికల్ –367కు నాలుగో నిబంధన జత చేయడమైంది. ‘‘(4) ఈ రాజ్యాంగ ఉద్దేశాలు జమ్మూకశ్మీర్‌లో అమలయ్యేందుకు (ఎ) ఈ రాజ్యాంగ రెఫరెన్సెస్ లేదా నిబంధనలు ఈ రాష్ట్రానికి అన్వయించవచ్చు. (బి) జమ్మూకశ్మీర్ రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు ఆ రాష్ట్ర శాసనసభ సిఫారసుతో రాష్ట్రపతి గుర్తించే వ్యక్తికి చేసే రెఫరెన్సెస్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌కు చేసే రెఫరెన్సెస్గా అన్వయించాలి. (సి) జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెఫెరెన్సెస్ను.. రాష్ట్ర మంత్రివర్గ సలహామేరకు చర్యలు తీసుకునే గవర్నర్‌కు చేసే రెఫరెన్సెస్గా అన్వయించాలి. (డి) 370 ఆర్టికల్‌లోని నిబంధన (3)లో ‘రాష్ట్ర రాజ్యాంగ శాసనసభ’ను ‘రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ’గా చదవాలి..’’ (చదవండి: జన గణ మన కశ్మీరం) -
రాష్ట్రపతి ఉత్తర్వులు సవరిస్తేనే ‘ఉమ్మడి సర్వీసు’
స్పష్టం చేసిన సుప్రీం కోర్టు సాక్షి, న్యూఢిల్లీ: పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకొనేందుకు న్యాయస్థానానికి అభ్యం తరం లేదని, అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అప్పటివరకు యథాతథంగా ఉమ్మడి సర్వీసు నిబంధనలను రూపొం దించుకోవడం సాధ్యం కాదని పరోక్షంగా స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తేనే ఉమ్మడి సర్వీసు నిబంధనలు సాధ్యమని పేర్కొంది. ఈ వ్యవహారంలో బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. తమకు ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు సమానంగా సర్వీసు నిబంధనలు కల్పించాలని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా గతంలో ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి సర్వీసు నిబంధనలను వర్తింపజేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఇందుకు హైకోర్టు సమ్మతించలేదు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు బుధవారం విచారణకు రాగా తొలుత ప్రభుత్వ ఉపాధ్యాయుల తరపున న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, సురేందర్‌రావు వాదనలు వినిపించారు. తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాది పి.పి.రావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. ఈ కేసుపై ధర్మాసనంలోని ఇద్దరు సభ్యులం ఒక నిర్ధారణకు వస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. -
పోస్టుల స్థాయిపై తేల్చుకోండి: కమలనాథన్ కమిటీ
* రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉండాలన్న కమలనాథన్ కమిటీ భిన్నాభిప్రాయం * వ్యక్తమైతే రాష్ట్ర స్థాయి సంస్థగా పరిగణన * సింగిల్ పోస్టులు.. ఖాళీలపై తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సంస్థలా? లేదా ప్రాంత స్థాయి సంస్ధలా? అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాల్సి ఉందని కమలనాధన్ కమిటీ స్పష్టం చేసింది. సంస్థను నిర్ధారించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాకుంటే దాన్ని రాష్ట్ర స్థాయి సంస్థగా కమలనాధన్ కమిటీ పరిగణించనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల కింద నోటిఫై చేసిన సంస్థలను ఏదైనా ప్రాంతం గురించి ఏర్పాటు చేశారా? లేదా రాష్ట్రం మొత్తం గురించి ఏర్పాటు చేశారా? అనే విషయాన్ని ఇరు ప్రభుత్వాలు తేల్చాలని కమిటీ స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాలు రాష్ట్ర స్థాయి సంస్థగా పేర్కొంటే సంస్థలోని పోస్టులను, ఉద్యోగులను రెండిటికీ పంపిణీ చేస్తారు. ఒకే ఒక్క పోస్టు, ఖాళీ చాలా ప్రభుత్వ శాఖల్లో కొన్ని రంగాల్లో ఒకే ఒక్క పోస్టులున్నాయని, అలాగే ఒకే ఖాళీలున్నాయని కమలనాధన్ కమిటీ గుర్తించింది. వీటిని పంపిణీ చేయటం సమస్యగా మారింది. ఇప్పటివరకు నోటిఫై చేసిన శాఖల్లో పెద్ద సంఖ్యలో సింగిల్ పోస్టు లు, సింగిల్ ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక పంపిణీ ఉద్యోగులు తుది పంపిణీ వరకు వేచి చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగిల్ పోస్టులో ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతానికి పోస్టు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరో ప్రాంతానికి చెందిన రాష్ర్టం కొత్త పోస్టును ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి.