presidents house
-
Bolarum : రాష్ట్రపతి నిలయంలో మరిన్ని పర్యాటక హంగులు
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో పలు పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానంగా 1948 నాటి ఫ్లాగ్ పోస్ట్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన వేడుకల్లో ప్రిన్స్ ఆజం షా నుంచి హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం నియమించిన ఎంకే వెల్లోడి బాధ్యతలు స్వీకరిస్తూ హైదరాబాద్ జెండా స్థానంలో జాతీయ జెండాతో కూడిన ఫ్లాగ్ పోస్ట్‌ను ఆవిష్కరించారు. అయితే కాలక్రమేణా ఆ ఫ్లాగ్‌పోస్ట్ పాడవడంతో 2010లో దాన్ని తొలగించారు. తాజాగా అందుకు ప్రతిరూపంగా నూతనంగా టేకుతో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ పోస్ట్‌ను రాష్ట్రపతి గురువారం ప్రారంభించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మ్యూజికల్ ఫౌంటేన్, చిల్డ్రన్స్ పార్క్, పునరుద్ధరించిన మూడు మెట్ల బావులతోపాటు సంప్రదాయ మోట పద్ధతి ద్వారా నీటిని తోడే వ్యవస్థను సైతం ప్రారంభించారు. అలాగే రాతిపై చెక్కిన శివుడు, నంది శిల్పాల నుంచి నీళ్లు జాలువారే వ్యవస్థను రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లుఅధికారులు తెలిపారు. -
Unnao Case: నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని..రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ
ఉన్నావ్ కేసు నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు మధ్యంతర బెయిల్ మంజురైన సంగతి తెలిసిందే. నాటి ఉన్నావ్ అత్యాచార ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖ రాసింది. వాస్తవానికి నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన కుమార్తె పెళ్లి కోసం తనను విడుదల చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అతను విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, అలాగే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను సైతం ప్రభావితం చేస్తాడని బాధిత మహిళ లేఖలో ఫిర్యాదు చేసింది. అతను జైలు వెలుపల ఉంటే తమకు అత్యంత ప్రమాదమని ఆ మహిళ పేర్కొంది. ఇదంతా సెంగార్ కుటుంబం పన్నిన కుట్ర అని కుమార్తె వివాహం పేరుతో బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఆడుతున్న నాటకమని లేఖలో ఆరోపించింది. ఇదిలా ఉండగా, కుమార్తె వివాహానికి హాజరయ్యేలా ఢిల్లీ హైకోర్టు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు పెరోల్‌పై సెంగార్‌ను విడుదల చేయాలని ఆదేశించడం గమనార్హం. మధ్యంతర విడుదలకు సంబంధించిన దరఖాస్తు తనకు అందలేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మెహమూద్ ప్రాచా సోమవారం తెలియజేయడంతో, కోర్టు సెంగార్ తరపు న్యాయవాదిని కాపీని అందించాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. వాస్తవానికి కుల్దీప్ సింగ్ సెంగార్‌కి ఉన్నావ్ 2017 అత్యాచార ఘటనలో దోషిగా తేలడంతో ట్రయల్ కోర్టు జీవత ఖైదు శిక్ష విధించింది. దీన్ని సెంగార్ సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో కూడా సెంగార్‌కు, అతని సోదరుడు అతుల్ సింగ్ సెంగార్తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కాంగ్రెస్ తొలి జాబితా .. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్) -
అధ్యక్ష భవనం ఆక్రమణ
ఆడెన్: సౌదీ అరేబియా నేతృత్వంలో సంకీర్ణ సేనలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా యెమెన్‌లో మిలిటెంట్లు చివరికి అధ్యక్ష భవనాన్ని సైతం ఆక్రమించారు. గురువారం పలువురు హుతీ మిలిటెంట్లు పెద్దఎత్తున ఆయుధాలతో ఆడెన్లోని అధ్యక్ష భవనమైన అల్-మషీక్ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా భవనం ప్రాంగణంలో బలగాలకు, తీవ్రవాదులకు భీకరపోరు సాగింది. 44 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఆడెన్‌లో ఎక్కడ చూసినా భీతావహవాతావరణం కనిపిస్తోందని, చాలాచోట్ల శవాలు పడి ఉన్నాయని స్థానికుడొకరు తెలిపారు. అధ్యక్షుడు అబెడ్రబ్బో మన్సూర్ హదీస్‌కు కాస్తోకూస్తో బలమున్న ఆడెన్లోనే. ఇప్పుడు ఇది కూడా మిలిటెంట్లపరం కావడం గమనార్హం. మరోవైపు యెమెన్‌లోని హద్రామవ్త్లో ఓ జైలును బద్దలు కొట్టి అల్‌కాయిదా ఉగ్రవాదులు 300 మందికి పైగా తమ అనుచరులను విడిపించుకుపోయారు.