Press Releases
-
ప్రభుత్వ పత్రికా ప్రకటనలు ఇక సంస్కృతంలోనూ..
లక్నో, ఉత్తరప్రదేశ్ : యూపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రతికా ప్రకటనలు, ముఖ్యమంత్రి ప్రసంగాలు ఇకనుంచి సంస్కృతంలో కూడా వెలువడనున్నాయని ఆ రాష్ట్ర అధికారులు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించి మొదటి ప్రెస్ రిలీజ్‌ను సంస్కృతంలో విడుదల చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంస్కృతం అనేది మన రక్తంలోనే ఉందని, భారతదేశంలో సంస్కృత భాష ఒక భాగమని కానీ, నేడు కేవలం పుజారులకు వృత్తి భాషగా మాత్రమే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతానికి పునర్వైభవం తీసుకురావడానకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమైన ప్రసంగాలు, ప్రభుత్వ సమాచారం హిందీ, ఇంగ్లీష్ మరియు ఉర్దూలతోపాటు సంస్కృతంభాషలోనూ విడుదల చేయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ప్రసంగపత్రాన్ని సంస్కృతంలో కూడా విడుదల చేశారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రసంగాలను సంస్కృతంలోకి అనువదించడానికి లక్నోకు చెందిన రాష్ట్రీయ సంస్కృత సంస్థ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 25 పత్రికలు సంస్కృతంలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కానీ వాటిలో ఏవి దిన పత్రికలు కావు. -
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చే విధానంలో గందరగోళం నెలకొంది. ఏడాది క్రితం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు ఎంతో ఆర్భాటం చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం పూర్తిగా విఫలం కావటంతో చేతులెత్తేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆ విధానాన్ని కాంట్రాక్టు సంస్థ లింక్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించినట్టు శనివారం పత్రికా ప్రకటనలు వెలువడ్డాయి. అయితే రాష్ట్ర రాజధానిలోనే డబ్బులు చెల్లించిన తర్వాత సకాలంలో ప్లేట్లు అందక గందరగోళం నెలకొన్న తరుణంలో.. జిల్లాల్లో అది సరిగా అమలయ్యే అవకాశం లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ మొత్తం ఈ విధానాన్ని విస్తరిస్తే రవాణాశాఖ పక్షాన తాము పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే ప్రకటనలకు తాము బాధ్యులం కాదంటూ కొట్టిపడేశారు. వెరసి కాంట్రాక్టు సంస్థకు, రవాణా శాఖకు మధ్య అసలు సమన్వయమే లేదని తేల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం ఇప్పుడు గందరగోళంగా మారి, వాహనదారులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ధర లతో పోలిస్తే మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కమీషన్ల కక్కుర్తే దీనికి కారణమనే ఆరోపణ లు గుప్పుమన్నా అధికారులు మిన్నకుండిపోయారు.