priest arrested
-
పబ్జీ ఎఫెక్ట్.. గేర్ సైకిళ్లే టార్గెట్
సాక్షి, హైదరాబాద్ : వ్యవనాలకు బానిసై డబ్బుల కోసం గేర్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న యువ పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, ఇన్స్పెక్టర్లు మన్మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మౌలాలి మంగాపురం కాలనీకి చెందిన నందుల సిద్దార్థ శర్మ అలియాస్ సిద్దూ అర్చకుడిగా పని చేసేవాడు. వ్యసనాలకు అలవాటు పడిన అతను పబ్జీ గేమ్కు బానిస అయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గేర్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్నాడు. వాటిని సైకిల్ దుకాణాలు, తెలిసిన వారికి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. వారికి అనుమానం రాకుండా పూజ చేసినందుకు బహుమతిగా ఇచ్చారని చెప్పేవాడు. మల్కాజిగిరి పీఎస్ పరిధిలో 4 కుషాయిగూడ పరిధిలో 7, నేరెడ్మెట్లో 4, నాచారం పరిధిలో ఒకటి చొప్పున దాదాపు 31 సైకిళ్లను చోరీ చేశాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు గురువారం మంగాపురంలో సిద్దూను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి సుమారు రూ. 3,50,000 విలువ చేసే సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో 16 సైకిళ్ల యజమానుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. యజమానులు ఆధారాలు చూపి సరైన సైకిళ్లను తీసుకెళ్లవచ్చునన్నారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లింగస్వామి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
పాఠాలు చెప్పమని వస్తే...
అయోధ్య : ఆధ్యాత్మిక బోధనలు విందామని వచ్చిన భక్తురాలిపై అయోధ్యలోని ఓ ఆలయ పూజారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంచివాడిగా నటిస్తూ దేవుడి సన్నిధిలో కామంధుడి రూపం దాల్చాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కటకటకాల పాలయ్యాడు. వివరాలు.. అయోధ్యలోని ఓ దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న కృష్ణకాంతాచార్య దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందామని వారణాసికి చెందిన ఓ మహిళ (30) డిసెంబర్ 24న వచ్చారు. బయటకు వెళ్తే బోధనలకు ఇబ్బంది అవుతుందనీ, ఆలయ పరిసరాల్లోని ఓ గదిలో ఉండాలని పూజారి నమ్మబలికాడు. ఆపై ఆమెను లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం గోప్యంగా ఉంచేందుకు ఆమెను బయటకు రాకుండా ప్రతిఘటించాడు. ఎలాగోలా బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమెను రక్షించారు. పూజారి కృష్ణకాంతాచార్యను మంగళవారం అరెస్టు చేశారు. బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపంచామని సీఐ ఏకే.సావ్ తెలిపారు. -
రూ. 25 లక్షలకు టోపీ పెట్టిన పూజారి అరెస్టు
పూజలు, యాగాలు పేరుతో మహిళల నుంచి 25 లక్షల రూపాయలు అక్రమంగా వసూలుచేసిన పూజారిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని ధర్మవరానికి చెందిన సుబ్రహ్మణ్య ఫణిశర్మను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. గాజువాక, సీతమ్మధారకు చెందిన మహిళల ఫిర్యాదుతో ఫణిశర్మను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇన్నాళ్లుగా పూజల పేరుతో అమాయకులను మోసం చేసిన పూజారి సుబ్రహ్మణ్య ఫణిశర్మ బండారం బయటపడింది. పూజారి చేతిలో ఎంతో మంది మహిళలు మోసపోయారు. తాము ఏ విధంగా మోసపోయిందో పలువురు మహిళలు తెలిపారు.