ఫైలిన్ తుపాన్ సహాయక చర్యలపై ప్రధాని సమీక్ష
ఫైలిన్ తుపాన్ బాధితుల్ని ఆదుకునేందుకు సాధ్యమైనంత వరకు సహాయక చర్యల్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ శాఖల్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభావ రాష్ట్రాలకు సహకారమందించాల్సిందిగా సూచించారు. ప్రజల భద్రతపై దృష్టి సారించాల్సిందిగా ఆదేశించారు.
విదేశీ పర్యటన ముగించుకుని శనివారం స్వదేశం తిరిగొచ్చిన ప్రధాని ఫైలిన్ తుపాన్ ప్రభావంపై సమీక్షించారు. చేపడుతున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు.