మూడేళ్లు ఇక్కడ.. నాలుగోది అమెరికాలో..
నిజామాబాద్‌అర్బన్ : ఎస్ఆర్ ఐఐటీ ద్వారా మూడేళ్లు హైదరాబాద్‌లో చదివి నాలుగోఏట అమెరికా యూనివర్శిటీలో విద్యనందిస్తున్నట్లు ఎస్ఆర్ ఐఐటీ హైదరాబాద్ ప్రిన్సిపాల్ గండికోట ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌పై వంశీ హోటల్లో అవగాహన సదస్సు జరిగింది. దీనిలో ఆయన మాట్లాడారు. కళాశాల విద్యార్థులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. అమెరికా విద్యాబోధనకు అనుసంధానం చేసి తద్వారా విద్యార్థులు అంతర్జాతీయ పరిమాణాలతో కూడిన విద్యను అసభ్యసించవచ్చునన్నారు.
అమెరికాలోని సెంట్రల్ వర్సిటీ ఆఫ్ మిస్సోరి ప్రతినిధులు డాక్టర్ ఎలీస్గ్రీఫ్ మాట్లాడుతూ తమ వర్సిటీలో టీమ్‌వర్క్ అనేది ప్రాధాన్యత ఉందన్నారు. విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. యూఎస్ఏ ఎఫ్-1 వీసా ప్రాసెసింగ్, వర్సిటీలో ఫీజుల వివరాలను తెలిపారు. అక్కడి వాతావరణం, క్యాంపస్‌లో ఉండే వసతులను వివరించారు. ఈ వర్సిటీలో ప్రపంచ నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చ చదువుతున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారి యూఎస్ వర్సిటీ ఎస్ఆర్ఐఐటీతో జేఎన్టీయూ అనుబంధంగా ఒప్పందం జరిగిందన్నారు. మిస్సోరీ వర్సిటీ ప్రతినిధులు టేలర్ ఘీ, డాక్టర్ మహ్మద్‌యూసుఫ్, విద్యాసంస్థల జిల్లా ఇన్చార్జి గోవర్ధన్‌రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.