prison guard
-
దారుణ అవమానాలు.. ఎక్కువ కాలం బతకను: మాజీ అధ్యక్షుడు
త్బిల్సి: ఎన్నికల్లో మోసానికి పాల్పడి.. విజయం సాధించారనే ఆరోపణల నేపథ్యంలో జార్జియా అధ్యక్షుడు సాకాష్విలిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. జైలులో ఉన్న సాకాష్విలి.. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 39 రోజులుగా ఆయన ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సాకాష్విలి జైలు సిబ్బందిపై సంచనల ఆరోపణలు చేశారు. జైలులో తనను తిడుతున్నారు.. కొడుతున్నారని.. త్వరలోనే చనిపోతానేమో అని భయమేస్తుంది అన్నారు. సాకాష్విలి 2004-2013 వరకు జార్జియా అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్నికల్లో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఈ సందర్భంగా సాకాష్విలి మాట్లాడుతూ.. ‘‘జైలు సిబ్బంది నన్ను బూతులు తిట్టారు.. నా మెడ మీద కొట్టారు.. జుట్టు పట్టుకుని నేల మీద పడేసి లాక్కెళ్లారు. ఇలానే కొసాగితే.. త్వరలోనే నేను చనిపోతానని భయమేస్తుంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. జైలులో తన పరిస్థితిని వివరిస్తూ.. తన లాయర్‌కు లేఖ రాశాడు. అంతేకాక అనారోగ్యంగా ఉన్న తనను జైలు ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ తనను చంపడమే వారి లక్ష్యమని సాకాష్విలి పేర్కొన్నాడు. (చదవండి: 400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు ) ప్రస్తుతం ఈ లేఖ జార్జియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హక్కుల కార్యకర్తలు జైలు బయట కూర్చొని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు నిరసలో పాల్గొని.. సాకాష్విలికి మద్దతు తెలిపారు. ఆయనను విడుదల చేయాల్సిందిగా కోరారు. సోమవారం ఉదయం, సాకాష్విలిని పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో అనేక అవయవాలు పని తీరు ఇప్పటికే నెమ్మదించిందని.. నిరాహాదర దీక్ష మరి కొంత కాలం కొనసాగితే.. ఆయన ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాకాష్విలికి అత్యవసరంగా హైటెక్ క్లినిక్‌లో చికిత్స చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. (చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి?) సాకాష్విలికి అంతర్లీన రక్త రుగ్మత ఉన్నందున అతని నిరాహారదీక్ష ముఖ్యంగా ప్రమాదకరమైనదిగా మారినందున అతనికి మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. సాకాష్విలిని జైలు ఆసుపత్రికి తరలించడాన్ని ఉక్రెయిన్ నిరసించింది, ఈ చర్య "అదనపు నష్టాలను సృష్టిస్తుంది" అని పేర్కొంది. చదవండి: ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే.. -
ఖైదీతో కామవాంఛ నేరమే!
‘గత 18 నెలలుగా నేను డేనియల్ క్రాప్టన్ (29)తో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నాను. అందులో నేను సుఖం అనుభవించాలనే కోరిక కంటే అతనికి సుఖం అందించాలనే తాపత్రయమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతను యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి లైంగిక సుఖం దొరికే అవకాశం లేదు. పైగా నేను ప్రిజన్ ఆఫీసర్‌ను. అతనిలో సత్ప్రవర్తన తీసుకరావాల్సిన బాధ్యత కూడా నాకుంది. అందులో భాగంగా అతనితో స్నేహంగా మెదలడం వల్ల అనుకోకుండా ఇద్దరి మధ్య ఈ సంబంధం ఏర్పడింది. నన్ను క్షమించండి!’ అంటూ దుర్హమ్ కౌంటీలోని ఫ్రాంక్లాండ్ జైలు అధికారి రాచెల్ వెల్‌బర్న్ (39) ఇటీవల జడ్జీని వేడుకున్నారు. అయినప్పటికీ జడ్జీ కరుణిస్తున్నట్లు కనిపించలేదు. జైలులోని ఓ గది కప్‌బోర్డులో క్రాప్టన్తో రాచెల్ లైంగిక వాంఛ కొనసాగిస్తూ పై అధికారులకు పట్టుబడ్డారు. ఆమె భర్త డేవిడ్ కూడా అదే జైలులో ప్రిజన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ‘నేను 18 ఏళ్లుగా జైల్లో సేవలు అందిస్తున్నాను. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. పైగా పరస్పర అంగీకారంతోనే మేము లైంగిక జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందుకని నన్ను క్షమించి వదిలేయండి’ అంటూ రాచెల్ వేడుకొంది. ఖైదీ డేనియల్ క్రాప్టన్ అయినప్పటికీ దుర్హమ్ క్రౌన్ కోర్టు జడ్జీ క్రిస్టఫర్ వినిపించుకోలేదు. డేనియల్ క్రాప్టన్ సాధారణ నేరస్థుడు కాదని, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన ఫ్రాంక్ వర్సిలే (87)ని హత్య చేశారని, అలాంటి నేరస్థుడికి సెక్స్‌ను అందించాల్సిన అవసరం లేదని జడ్జీ అభిప్రాయపడ్డారు. పైగా ప్రభుత్వ జైలులో ఎలాంటి సెక్స్ అయినా, నేరమేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాబిన్ ప్యాటన్ వాదించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఫ్రాంక్ వర్సిలే రాయల్ నావల్లో ఐదు యుద్ధ నౌకలకు నాయకత్వం వహించారని, ఆయన మాన్‌చెస్టర్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డబ్బుల కోసం క్రాప్టన్ ఆయన ఇంట్లో జొరబడి ఆయనను పిడి గుద్దులతో కిందపడేసి డబ్బులు దోచుకు పోయాడని, ఆస్పత్రిలో మూడు వారాల అనంతరం వర్సిలే మరణించాడని చెప్పారు. కొకైన్కు బానిసై క్రాప్టన్ ఈ దారుణానికి పాల్పడ్డారని కూడా ఆయన పేర్కొన్నారు. క్రాప్టన్ దాడిలో మరణించిన యుద్ధ వీరుడు ఫ్రాంక్ వర్సిలే 2013లో ఈ హత్య జరగ్గా, 2014లో క్రాప్టన్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. క్రాప్టన్తో రాచెల్ లైంగిక సంబంధం మానసికమైనది కాదని, క్షణికావేశంతో కూడుకున్న లైంగిక వాంఛ అని కూడా ప్రాసిక్యూటర్ వాదించారు. అలాంటి వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు జైలు శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఆయన వాదనతో ఏకీభవించిన జడ్జీ క్రిస్టఫర్ ప్రిన్స్, రాచెల్‌కు 12 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇంకా ఎక్కువ కాలం శిక్ష విధించాలిగానీ ఇద్దరు చిన్న పిల్లలను దష్టిలో పెట్టుకొనే తక్కువ శిక్ష విధిస్తున్నానని జడ్జీ వ్యాఖ్యానించారు. -
మహిళా జైలు అధికారితో పారిపోయిన కిలాడి ఖైదీ
స్విట్జర్లాండ్: అతడు అసలే ఓ రేపిస్టు. స్కూల్లో చదువుతున్న ఓ పదిహేనేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు. పదేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. అలాంటి నేరస్తుడికి జైలులో అవకాశం వస్తే పారిపోకుండా ఊరుకుంటాడా.. అదీ కూడా ఓ మహిళా జైలుగార్డుతో మంచి చనువు ఏర్పడితే ఆ జైలుకు ఎక్కడ ప్రవేశ ద్వారాలు ఉన్నాయో, ఎలా బయటకు వెళ్లవచ్చో తెలుసుకోకుండా ఉంటాడా.. స్విట్టర్లాండ్‌లో ఇదే జరిగింది. ఓ పాఠశాల విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన హసన్ కికో (27) అనే ఓ వ్యక్తి అదే జైలులో గార్డుగా పనిచేస్తున్న ఎంజెలా మాగ్డికి (32) అనే మహిళతో కలిసి పారిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హసన్ కికో సిరియాకు చెందిన వలసవాది. అతడు 2010లో స్విట్జర్లాండ్‌కు వచ్చాడు. 2014 నవంబర్ నెలలో క్లిరెన్ జ్యూరిచ్ ప్రాంతంలో ఓ స్కూల్ విద్యార్థినిపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్న హసన్ జైలులోని అధికారుల కళ్లుగప్పి అందులోని మహిళా గార్డు ఎంజెలాను తన బుట్టలో వేసుకున్నాడు. జైలులోనే పలుమార్లు ఆమెతో రోమాన్స్ చేసిన ఈ కిలాడీ ఖైదీ.. అలా చాలా రోజులు గడిచిన తర్వాత ఆమెతో సహా జైలు నుంచి ఉడాయించాడు. దీంతో అసలు ఈ హసన్ జైలు వార్డును ఎప్పుడు బుట్టలో వేసుకున్నాడు, ఎలా మాయచేశాడు? ఇప్పుడు వారిద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారబ్బా అని తలలు పట్టుకుంటున్నారు.