మహిళా జైలు అధికారితో పారిపోయిన కిలాడి ఖైదీ | Syrian migrant rapist who attacked a schoolgirl escapes Swiss jail and goes on the run with female prison guard who fell for him | Sakshi
Sakshi News home page

మహిళా జైలు అధికారితో పారిపోయిన కిలాడి ఖైదీ

Published Wed, Feb 10 2016 6:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

మహిళా జైలు అధికారితో పారిపోయిన కిలాడి ఖైదీ

మహిళా జైలు అధికారితో పారిపోయిన కిలాడి ఖైదీ

స్విట్జర్లాండ్: అతడు అసలే ఓ రేపిస్టు. స్కూల్లో చదువుతున్న ఓ పదిహేనేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు. పదేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. అలాంటి నేరస్తుడికి జైలులో అవకాశం వస్తే పారిపోకుండా ఊరుకుంటాడా.. అదీ కూడా ఓ మహిళా జైలుగార్డుతో మంచి చనువు ఏర్పడితే ఆ జైలుకు ఎక్కడ ప్రవేశ ద్వారాలు ఉన్నాయో, ఎలా బయటకు వెళ్లవచ్చో తెలుసుకోకుండా ఉంటాడా.. స్విట్టర్లాండ్లో ఇదే జరిగింది.

ఓ పాఠశాల విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన హసన్ కికో (27) అనే ఓ వ్యక్తి అదే జైలులో గార్డుగా పనిచేస్తున్న ఎంజెలా మాగ్డికి (32) అనే మహిళతో కలిసి పారిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హసన్ కికో సిరియాకు చెందిన వలసవాది. అతడు 2010లో స్విట్జర్లాండ్కు వచ్చాడు. 2014 నవంబర్ నెలలో క్లిరెన్ జ్యూరిచ్ ప్రాంతంలో ఓ స్కూల్ విద్యార్థినిపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని జైలుకు తరలించారు.

అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్న హసన్ జైలులోని అధికారుల కళ్లుగప్పి అందులోని మహిళా గార్డు ఎంజెలాను తన బుట్టలో వేసుకున్నాడు. జైలులోనే పలుమార్లు ఆమెతో రోమాన్స్ చేసిన ఈ కిలాడీ ఖైదీ.. అలా చాలా రోజులు గడిచిన తర్వాత ఆమెతో సహా జైలు నుంచి ఉడాయించాడు. దీంతో అసలు ఈ హసన్ జైలు వార్డును ఎప్పుడు బుట్టలో వేసుకున్నాడు, ఎలా మాయచేశాడు? ఇప్పుడు వారిద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారబ్బా అని తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement