prisoners released
-
‘విరమణ’ మరో రెండు రోజులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం ముగిసింది. ఒప్పందంలో భాగంగా మిలిటెంట్లు ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలను విడుదల చేశారు. ఇజ్రాయెల్ అధికారులు 117 మంది పాలస్తీనియన్ ఖైదీలను జైలు నుంచి విడిచిపెట్టారు. నాలుగో విడత కింద స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి తర్వాత మరికొంత మంది బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీనిపై సంబంధిత బందీల కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ అధికారులు సమాచారం ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులపాటు పొడిగించడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఒప్పందం పొడిగింపు అమల్లో ఉన్నన్ని రోజులు నిత్యం అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్ వదిలేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే విషయంలో ఈజిప్టు, ఖతార్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాయి. ఇజ్రాయెల్‌లో ఎలాన్ మస్క్ పర్యటన సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టి విమర్శల పాలైన ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్టోబర్ 7న హమాస్ దాడిలో ధ్వంసమైన కిబుట్జ్ పట్టణాన్ని దర్శించారు. అక్కడి పరిస్థితిన పరిశీలించారు. ఈ సందర్భంగా మస్క్ వెంట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నారు. -
ఒక్కడి కోసం వెయ్యి మందిని వదిలిపెట్టి..
పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య కొనసాగుతున్న భీకరపోరు పదో రోజు దాటింది. హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విరుచుకుపడుతున్నాయి.ఇప్పటి వరకు వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ దళాలు.. ఏ క్షణమైనా గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిగా ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకుని దాడుల నుంచి తప్పించుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. అయితే.. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. తాజాగా తమ చెరలో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు(కొందరు విదేశీయలు కూడా) హమాస్ ప్రకటించుకుంది. అందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డానియల్ హగారే చెబుతున్నారు. తొమ్మిది నెలల పాప, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, యువతులు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాదులు కలిగిన వృద్ధులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే.. ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్స్‌ను బందీలుగా పట్టుకోవడం హమాస్‌కు ఇదే తొలిసారి. కానీ, ఈ బందీల వంకతో తమ డిమాండ్లు నెరవేర్చుకోవడం మాత్రం ఇదే తొలిసారి కాదు. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పటి నుంచి యుద్ధ తరహా సంక్షోభాలెన్నింటినో ఎదుర్కొంది. ముఖ్యంగా.. 1955 నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాల్లో తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఖైదీల పరస్పర మార్పిడి చేపడుతోంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. 2011లో జరిగిన ఘటన గురించి.. ఒక్క సైనికుడి కోసం ఏకంగా వెయ్యి మంది ఖైదీల్ని విడిచిపెట్టింది ఇజ్రాయెల్. కార్పొరల్ గిలాద్ షలిత్(19) వెళ్తున్న ట్యాంక్‌పై దాడి చేసిన హమాస్ సభ్యులు.. అతన్ని బందీగా చేసుకున్నారు. ఐదేళ్లపాటు హమాస్ చెరలో ఉన్న షలిత్‌ను విడిపించాలని బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వం మీద ప్రజలు ఒత్తిడి చేశారు. దీంతో.. షలిత్కి బదులుగా ఏకంగా 1,027 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. అందులో 78 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. 1955లో.. నలుగురు సైన్య సిబ్బంది కోసం(మరొకరు బందీగా ఉన్నప్పుడే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని మృతదేహం కోసం కూడా..) 40 మంది సిరియా పౌరుల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 1983లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ ఖైదీల్ని విడిపించుకునేందుకు 4,700 మంది పాలస్తీనా-లెబనీస్ ఖైదీల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అందులో మరణశిక్షలు పడ్డ ఉగ్రవాదులు ఉన్నారు. 1985లో ముగ్గురి కోసం మరో 1,150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. 2004 నుంచి 2008 మధ్య కూడా.. ఖైదీల పరస్సర మార్పిడి జరిగింది. అలా.. ఇజ్రాయెల్ తమ పౌరుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో హమాస్‌కు తెలుసు. అందుకే హమాస్ ఇప్పుడు బందీల ప్లాన్ అమలు చేస్తోందా?.. వీళ్ల ద్వారా ఎంతమందిని విడుదల చేయించాలనుకుంటోంది?.. అనేది త్వరలోనే తేలనుంది. మరోవైపు.. హమాస్ నుంచి తమ దేశస్థుల్ని సురక్షితంగా రప్పించాలంటూ ఇజ్రాయెల్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో.. వాళ్లను విడిపించడం నెతన్యాహూ ప్రభుత్వానికే పెద్ద సవాల్‌గానే మారనుందనే చెప్పాలి. హమాస్-ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరువైపులా మరణించినవారి సంఖ్య 4 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో 700 మంది పిల్లలతో సహా 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా.. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు 1400 మంది మరణించారు. -
స్వేచ్ఛా లోకంలోకి..
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : జిల్లా జైలు నుంచి శనివారం రాత్రి ఐదుగురు ఖైదీలకు విముక్తి కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 వతేదీ లోపు సత్ప్రవర్తన కలిగిన వారి నివేదిక పంపాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అందు కోసం జీవోనం. 286ను విడుదల చేసింది. ఈ మేరకు జైలు సిబ్బంది పంపిన నివేదిక ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన ఆసర ముత్తన్న, కుంటాల మండలం పెంచకల్పాడ్ గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం ఖుద్వాన్పూర్ గ్రామానికి చెందిన కుర్మ చిన్న రాజన్న, ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన గైని పోశెట్టి, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన కూరపాటి ఎల్లయ్యలకు విముక్తి లభించింది. వీరందరూ హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. చేయని నేరానికి శిక్ష చేయని నేరానికి శిక్ష అనుభవించాను. పంటపొలంలో నా కొడుకు ఉరి వేసుకోగా నాపైన నేరం మోపారు. దీంతో జైలు పాలయ్యాను. జైలులో ఉన్నంత కాలం భగవంతుడి సన్నిధిలో గడిపాను. బయట వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎటువంటి నేరాలు చేయకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాను. -ఆసర ముత్తన్న తమ్ముడిని హత్య చేశాను భూమి తగాదాల్లో తమ్ముడిని హత్య చేశాను. అయితే జైలు జీవితం గడిపినందుకు చాలా బాధగా ఉంది. ఇటువంటి జీవితం మరెవరికి రాకూడదు. -గైని పోశెట్టి భిక్షమెత్తుకుని బతుకుతాను దొంగతనాలు చేస్తూ ఒకరి హ త్య చేశాను. తప్పు చేసి చాలా బాదపడ్డాను. జీవితంలో భిక్షమెత్తుకుని బతుకుతాను గానీ తప్పు చేయను. -ఎల్లయ్య జైలు జీవితం పగవాడికి కూడా రావద్దు జైలు జీవితం పగవాడికి కూడా రావద్దు. మంత్రాలు చేస్తున్నాడని మా గ్రామంలో ఎల్లన్న అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో 2004లో జైలుకు వచ్చాను. బయట ప్రపంచంలోకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. అందుకు సహకరించిన జైలు సిబ్బందికి కృతజ్ఞతలు. -దాసరి లక్ష్మన్ నేరాలు చేయరాదు క్షమాభిక్షపై జైలు నుంచి బయటకు వెళ్తున్న వారు శాంతియుత జీవితం గడపాలి. ఐదేళ్లలోపు ఎలాంటి నేరాలకు పాల్పడినా తిరిగి శిక్ష అమలులోకి వస్తుంది. విడులైన ఖైదీలు మూడు నెలలకోసారి సంబంధిత పోలీసు స్టేషన్లలో హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. -శంకరయ్య, జిల్లా జైలు సూపరింటెండెంట్