private company employees
-
టార్గెట్ పూర్తి చేయలేదని వింత శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు టార్గెట్ తప్పనిసరి. అయితే ఇచ్చిన సమయానికి టార్గెట్ పూర్తవ్వకపోతే ఇచ్చే జీతంలో కోత విధించడం లేదా ఎక్కువ టైం పని చేయించుకోవడం చేస్తారు. ఇంకా కంపెనీ రూల్స్ కొంచెం కఠినంగా ఉంటే జాబ్ నుంచి తీసివేస్తారు. కానీ మీరు ఇప్పుడు చదవబోయే ఈ వార్త వీటన్నింటికి భిన్నం. ఎప్పుడూ ఇలాంటి ఫనిష్మెంట్లేనా అనుకుందేమో కానీ చరిత్రలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని శిక్ష విధించింది ఓ చైనా కంపెనీ. ఇయర్ ఎండింగ్ టార్గెట్ పూర్తి చేయలేదని తమ కంపెనీ సిబ్బందిని నడి రోడ్డుపై మోకాళ్లపై నడిపించారు. ట్రాఫిక్ మద్యలో సిబ్బంది అంతా మోకళ్లపై కూర్చోని చిన్న పిల్లాల్లా పాకుతూ వెళ్లారు. వారందరిని చూసి పాదచారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. కాగా కంపెనీ చర్యను కొంత మంది తప్పుపట్టగా, కొంతమంది ఉద్యోగులను విమర్శిస్తున్నారు. ఉద్యోగులను హింసింస్తున్నారని, వారిని అవమానించేలా కంపెనీ వ్యవహరిస్తుందని కొంత మంది మండిపడుతుండగా, డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని ఉద్యోగులను మరికొంత మంది విమర్శిస్తున్నారు. కాగా వీడియో వైరల్తో యాజమాన్యంపై విమర్శలు రావడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా శిక్షించడం చైనా కంపెనీలకు మొదటి సారేంకాదు. గత ఏడాదిలో కూడా ఓ కంపెనీ ఇలాంటి పనిష్మేంటే ఇచ్చింది. టార్గెట్ పూర్తి చేయలేదని తమ సిబ్బందిని వరుసగా నిలబెట్టి అమ్మాయిలలో చెంపదెబ్బలు కొట్టించారు. కాగా ఇలాంటి అవమానకర ఘటనలు చైనా కంపెనీలలో తరచూ జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. -
రూ. కోటిన్నర కొట్టేశారు...
ఏటీఎంలో డబ్బు పెట్టే ఏజెన్సీ సిబ్బంది చేతివాటం కాజేసిన డబ్బుతో గుర్రపు పందాలు నాచారం: ఏటీఎంలో డబ్బును నింపే ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు ఆధునిక టెక్నాలజీలోని లొసుగులను తమకు అనుకూలంగా ఉపయోగించుకొని కొత్త తరహా మోసానికి తెరలేపారు. సుమారు కోటిన్నర నొక్కేసి చివరకు నాచారం పోలీసులకు చిక్కారు. విశ్వసనీయ సమాచారం మేరకు... నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్ రూట్లలో 15 ఏటీఎంల్లో డబ్బులు పెట్టే భాధ్యత ఓ ప్రైవేట్ ఏజెన్సీ తీసుకుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు తమకు తెలిసిన సీక్రేట్ కోడ్తో ఏటీఎంను తెరిచి అందులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. ఆ తమ కార్యాలయానికి డబ్బు డిపాజిట్ చేసినట్టు ఎస్ఎంఎస్ పంపుతున్నారు. తర్వాత అదే కోడ్ను ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తిరిగి డ్రా చేస్తున్నారు. ఇలా కాజేసిన డబ్బుతో గుర్రపు పందాలు ఆడుతున్నారు. రోజూ ఇలా డబ్బు కాజేస్తూ దాదాపు రూ. కోటిన్నరకు పైగా ఖర్చు చేశారు. మోసం బయటపడింది ఇలా... ప్రతి రోజూ నమ్మకంగా డబ్బు ఏటీఎంలో ఉంచుతున్న ఉద్యోగులు సక్రమంగా మేసేజ్లు పంపుతున్నారు. దీంతో ఎక్కడ ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, జనవరి నుంచి మార్చి నెల వరకు డిపాజిట్ చేసిన డబ్బుపై ఆడిట్ చేయగా లెక్కల్లో భారీగా తేడా వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బ్యాంక్లు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దాదాపు రూ.కోటిన్నర వరకు మోసం జరిగినట్లు తెలియడంతో అనుమానితులైన నలుగురు ఉద్యోగులను నాచారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.