private emails
-
ఒబామా వ్యక్తిగత ఈ మెయిల్స్ లీక్
-
ఒబామా వ్యక్తిగత ఈ మెయిల్స్ లీక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమాబా వ్యక్తిగత ఈ-మెయిల్స్‌ను వీకీలీక్స్ బయటపెట్టింది. ఆయన వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ నుంచి పంపిన సందేశాన్ని వీకీలీక్స్ బహిర్గతం చేసింది. రహస్య చిరునామా ద్వారా ఒబామా పంపిన మెయిల్స్ లో కొన్నింటిని తొలి విడతగా బయటపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాలను వీకీలీక్స్ ట్విట్టర్ లో పేర్కొంది. కాగా bobama@ameritech.net నుంచి ఒబామా పంపిన ఏడు సందేశాలను వీకీలీక్స్ తన వెబ్ సైట్లో ప్రచురించిందంటూ న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వీటిలో జి-20 సమావేశాలకు వెళ్లొద్దంటూ 2008 ఎన్నికల సందర్భంగా ఒబామా బృందంలోని జాన్ పొడెస్టా పంపిన మెయిల్ కూడా ఉంది. 2008 నవంబర్ 4న పొడెస్టా ఈ మెయిల్ పంపించారు. ఇప్పటికే హిల్లరీ క్లింటన్ ఈ మెయిళ్ల వ్యవహారంతో డెమోక్రటిక్ పార్టీకి తల బొప్పి కడుతోంది. ఇప్పుడు ఏకంగా ఒబామాకు సంబంధించి ఈ మెయిల్స్ బహిర్గతం కావడంతో డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నారు. పొడెస్టా ప్రస్తుతం హిల్లరీ ప్రచార బృందం సారధిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు చెందిన దాదాపు 23 వేల ఈమెయిల్స్ అపహరణకు గురయ్యాయి. వీటిల్లో ఒబమాకు పంపినవే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మెయిల్స్ వ్యవహారం లీక్ అవ్వడం వెనుక రష్యా హస్తం ఉందేమోనని వైట్ హౌస్ అనుమానిస్తోంది. -
'కంగనా చాలా విషయాలు చెప్పింది'
ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన ఈమెయిల్ హ్యాక్ చేసినట్లు ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పష్టం చేసింది. వీరిద్దరి మధ్య నడుస్తున్న కేసు విషయంలో దర్యాప్తు బృందానికి ఇచ్చిన వివరణలో ఆమె ఈ విషయం పేర్కొంది. కంగనా తరుపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ ఆ వివరాలు తెలియజేశారు. ఆయన చెప్పిన ప్రకారం పోలీసుల ముందు వివరణ ఇచ్చేందుకు కంగనా ఆమె సోదరి రంగోలితో కలిసి వెళ్లారు. 'కంగనా, ఆమె సోదరి వివరణ పట్ల పోలీసులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తాను ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో హృతిక్ పేర్కొనని పలు కొత్త అంశాలు ఇప్పుడు పోలీసులకు తెలిశాయి. అసలు హృతిక్ ఓ వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశాలను ఎందుకు అలా బహిరంగం చేశారనే విషయం గుర్తించకుండానే చాలా విషయాలు ముందుకెళ్లాయి' అని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం 5గంటల నుంచి 8గంటల ప్రాంతంలో పోలీసులు కంగనా వాంగ్మూలాన్ని నమోదుచేసుకున్నట్లు చెప్పారు. అంతకుముందు గత సోమవారం, ఏప్రిల్ 18న ఒకసారి పోలీసులే నేరుగా కంగనా ఇంటి వద్దకు వెళ్లి ఆమె వివరణ తీసుకున్న విషయం తెలిసిందే.