private finance companies
-
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
సర్కారు చేతిలో ‘స్టీరింగ్’
విజయనగరం క్రైం:జీవిత సంద్రాన్ని ఈదడం కోసం పగలనక, రాత్రనక భార్యాబిడ్డలను విడిచిపెట్టి స్టీరింగ్ పట్టుకుని వాహనాలను నడిపే డ్రైవర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దవుతాయని ప్రకటించడంతో ఆ డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జీవన యానాన్ని సాగించడం కోసం అప్పోసప్పో చేసి కొంతమంది కార్లు, టాటా మాజిక్ తదితర నాలుగు చక్రాల వాహనాలను కొనుక్కుని బతుకులీడుస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు ప్రభుత్వం రుణాలు అందించకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల ద్వారా ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుని కాలం గడుపుతు న్నారు. అసలే వాహనాల కొనుగోలుకు చేసిన అప్పులు తీరక వారంతా సతమతమవుతుంటే పులి మీద పుట్రలా నాలుగు చక్రాలు ఉన్న వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో డ్రైవర్లకు దిక్కుతోచడం లేదు. కొనుగోలు చేసిన వాహనాలకు అధికస్థాయిలో అప్పులు తీసుకుని నెలనెల ఫైనాన్స్ కట్టే సరికి జీవితం తెల్లారిపోతోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న కార్లను పరిగణనలోకి తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం..నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి మాటలు పక్కన పెట్టినప్పటికీ..ఎలాగోలా బతుకులీడుస్తున్న తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని వాపోతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాలుగు చక్రాల వాహనదారుల విషయంలో పూర్తిగా పరిశీలించాలని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. డ్రైవర్లు తమ జీవితాలను బాగుచేసుకోవడం కోసం కార్లను కొన్నవారిని కాకుండా కార్లను విలాసం కోసం కొన్ని వారిని.. వారి ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకుని సంక్షేమ పథకాలు రద్దు చేయాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు. స్పష్టత లేని ప్రభుత్వ నిర్ణయం నాలుగు చక్రాల వాహనాలు అంటే విలాసం కోసం కార్లు కొన్నవారికా..ట్రావెల్స్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న కార్లు.. టాటా మేజిక్ తదితర వాహనాలా అన్న విషయంపై ప్రభుత్వం ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, చంద్రబాబు ఎక్కడా లేని నిర్ణయాలను తీసుకుని డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. -
31 ఫైనాన్స్ కంపెనీలపై కొరడా
-
31 ఫైనాన్స్ కంపెనీలపై కొరడా
-
29 ఫైనాన్స్ కంపెనీలపై కొరడా
హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలపై ఆర్ బీఐ కొరడా ఝుళిపించింది. 29 సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ కంపెనీలతో ఇటువంటి లావాదేవీలు జరపొద్దని హెచ్చరించింది. నిషేధించిన ఫైనాన్స్ కంపెనీల్లో 'ఈనాడు' సంస్థకు చెందిన మార్గదర్శి ఫైనాన్స్ సెషన్ ప్రైవేటు లిమిటెడ్, మార్గదర్శి ఇన్వెస్ట్ మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ కూడా ఉన్నాయి. ఆర్ బీఐ నిషేధించిన సంస్థలు 1. మార్గదర్శి ఫైనాన్స్ సెషన్ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 2. మార్గదర్శి ఇన్వెస్ట్ మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 3. యుక్త ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, పద్మరావునగర్, సికింద్రాబాద్ 4. ఎమర్జీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్, హకీంపేట, సికింద్రాబాద్ 5. శ్రీ హైర్ పర్చేజ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్, సీతాఫల్ మండి, సికింద్రబాద్ 6. శ్రీ సిరి ఆటో ఫైనాన్షియర్స్ ప్రైవేటు లిమిటెడ్, కొత్తగూడం, ఖమ్మం జిల్లా 7. శ్రీ విష్ణు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 8. హెచ్ సీజీ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇంప్లెక్స్ లిమిలిటెడ్, జీడిమెట్ల, హైదరాబాద్ 9. అవ్యా ఫైనాన్స్ లిమిటెడ్, కార్ఖానా, సికింద్రాబాద్ 10. డీఎస్ఎల్ ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 11. బీఎన్ఆర్ ఉద్యోగ్ లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 12. నానో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 13. బాంబినో ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, సరూర్ నగర్, హైదరాబాద్ 14. జీఎన్ వాసవి ఫైనాన్స్ లిమిటెట్, పంజాగుట్ట, హైదరాబాద్ 15. శుభం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెట్, బౌద్ధనగర్, సికింద్రాబాద్ 16. చెన్నై ఫైనాన్స్ కో లిమిటెడ్, ఆదర్శ నగర్, హైదరాబాద్ 17. ఆర్ ఆర్ ఫైనాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, అమీర్ పేట, హైదరాబాద్ 18. మహాలక్ష్మి ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్, రామకోటి, హైదరాబాద్ 19. మారుతి సెక్యురిటీస్ లిమిటెడ్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్ 20. ప్రొద్దుటూరు ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, తాడ్ బంద్, సికింద్రాబాద్ 21. మాగ్నిల్ ఫైనాన్స్ అండ్ హైర్ పర్చేజ్ ప్రైవేటు లిమిటెడ్, నల్లకుంట, హైదరాబాద్ 22. సూర్యలక్ష్మి సెక్యురిటీస్ లిమిటెడ్, దోమలగూడ, హైదరాబాద్ 23. భవ్య కేపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నారాయణగూడ, హైదరాబాద్ 24. సీగల్ లీఫిన్ లిమిటెడ్, కేపీహెచ్ పీ, హైదరాబాద్ 25. శ్రీమాన్ సాయి సెక్యురిటీస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఫైనాన్స్ లిమిటెడ్, జగిత్యాల, కరీంనగర్ 26. సెహగల్ లీజింగ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, రాజభవన్ రోడ్, హైదరాబాద్ 27. విక్రాంత్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇంపెక్స్ లిమిటెడ్, బాలానగర్, హైదరాబాద్ 28. సైక్లో ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్, అమీర పేట, హైదరాబాద్ 29. నరియన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, నారాయణగూడ, హైదరాబాద్