private life
-
‘అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం’
హైదరాబాద్: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే మృదుస్వభావి, వివాదరహితుడు. క్రికెట్‌పై అతడికున్న ఆసక్తి, ఇష్టం, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రెటీల జీవితం ఎప్పుడూ పబ్లికే.. కానీ రహానే మాత్రం పర్సనల్ లైఫ్‌ను చాలా గోప్యంగా ఉంచుతాడు. అయితే తొలిసారి తన ప్రయివేట్ లైఫ్ గురించి అనేక అసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రహానే తన భార్య రాధిక, తండ్రి బాధ్యతల గురించి పలు అంశాలను అభిమానులతో పంచుకున్నాడు. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అదృష్టమని, తన లైఫ్‌తో ఈ విషయం రుజువైందని పేర్కొన్నాడు. ఇక టెస్టు మ్యాచ్‌లు ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లి తన కూతురుతో సరదాగా గడుపుతానని పేర్కొన్నాడు. ‘వరుస క్రికెట్ టోర్నీలు, ప్రాక్టీస్ సెషన్స్, విదేశీ టూర్లతో ఎక్కువగా ఇంటికి దూరంగానే ఉంటాను. దీంతో నా భార్య (రాధిక), కూతురుతో సరదాగా గడపడానికి సమయం దొరకదు. అయితే నేను దేనికి ఎక్కువ ప్రాధన్యత ఇస్తాను, నా ప్యాశన్ ఏంటో రాధికకు బాగా తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అదృష్టం. ఆమెకు లైమ్‌లైట్‌లోకి రావడం ఇష్టం ఉండదు. అందుకే అమె గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. అయితే ఆటలో నేను ఆలసిపోయినప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా తనను బయటకు తీసుకెళ్లడం, షాపింగ్ చేయడం, డిన్నరం చేయడం వంటివి చేస్తుంటాం. ఇక క్రికెట్ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా వెంటనే ఇంట్లో వాలిపోతాను. ఆ సమయంలో పాప విషయంలో రాధికకు ఫుల్ రెస్ట్ ఇస్తాను. పాపకు సంబంధించి అన్ని విషయాలు, పనులను నేనే చూసుకుంటాను ఇప్పటికీ గుర్తే.. గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో టెస్టు జరుగుతున్నప్పుడు నాకు పాప పుట్టింది. టెస్టు ముగిసిన వెంటనే పాపను చూడటానికి ఆసుపత్రి వెళ్లాను. తనను నా రెండు చేతుల్లోకి తీసుకోవడం, లాలించిన క్షణాలు ఇంకా గుర్తే ఉన్నాయి. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక నా భార్యకు తగిన సమయం ఇవ్వాడంతో పాటు నా పాపకు మంచి విద్యను అందించాలనుకుంటున్నాను. నాకు సంగీతం అంటే ఇష్టం. నేను మంచి భోజన ప్రియుడుని. ఖాళీ సమయాలల్లో నా భార్య దగ్గర వంట నేర్చుకుంటాను. కొన్ని డిషెస్లు మాత్రమే పర్ఫెక్ట్గా చేయగలను. ప్రపంచకప్ అనేది నా కల. ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిగా ఉండాలనేది నా కోరిక. ఆటలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లే నాకు ప్రేరణ. ఆటేతర విషయాల్లో నా తండ్రే నాకు స్పూర్థి.’అంటూ రహానే వివరించాడు. Hello ❤️ pic.twitter.com/25oQyXOQeV — Ajinkya Rahane (@ajinkyarahane88) October 7, 2019 చదవండి: క్రిస్ లిన్ నెత్తిపై పొగలు వాటే డైవ్.. పిచ్చెక్కించావ్ కదా! -
కొన్ని చెప్పుకోవడం నచ్చదు: హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటీమణులు తమ వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌గా చెప్పుకోవడానికి పెద్దగా సంశయించడం లేదనే చెప్పుకోవాలి. కొందరు వ్యక్తిగత వ్యవహారాలను ఫ్యాన్స్‌తో పంచుకోకపోయినప్పటికీ మీడియా, సోషల్ మీడియా మూలంగా ఏదో ఒక సందర్భంలో బయటపడాల్సి వస్తుంది. బాలీవుడ్ భామ కృతి సనన్‌కు మాత్రం అన్ని విషయాలను పబ్లిక్‌లో పెట్టడం అంతగా నచ్చదట. ‘నేను సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాను. చాలా విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటాను. అయితే.. కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇష్టం ఉండదు. అందరితో అన్ని విషయాలు చెప్పుకోవాలని అనిపించదు కదా’ అంటూ కృతి చెప్పుకొచ్చింది. తన గురించి వ్యక్తిగత విషయాల కన్నా వృత్తిపరమైన విషయాలను మాట్లాడుకోవాలని కోరుకుంటానని మీడియాతో ఈ రాబ్తా భామ వెల్లడించింది. అన్నట్లు రాబ్తా హీరో సుషాంత్‌తో కృతి రిలేషన్లో ఉందంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. -
మహాత్ముడు మంచి తండ్రి కాలేకపోయారా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర పోరాట యోధుడు మహాత్మాగాంధీ జాతిపిత అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన చేసిన గొప్ప పనులే జాతి పిత అని పేరొచ్చేలా చేశాయి. అయితే, ఇది గాంధీ చరిత్రకు ఒక వైపు మాత్రమేనని,మహాత్ముడి జీవితంలో తెలియని మరో అంశం కూడా ఉందని ప్రముఖ రచయిత్రి నీలిమా ద్మాలియా ఆధార్ అన్నారు. గాంధీ భార్య కస్తూర్బా గాంధీ రాసిన డెయిరీ ఆధారంగా ‘ది సీక్రెట్ డైరీ ఆఫ్ కస్తుర్బా’ అనే పేరిట ఆమె పుస్తకాన్ని వెలువరించింది. ఆ పుస్తకంలో మహాత్ముడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు పేర్కొంది. గాంధీ మహాత్ముడి చరిత్రను మకిలబరచడం తన ఉద్దేశం కాదని, ఆయన చరిత్రను మాత్రమే పట్టించుకున్నవారు కస్తుర్బా చరిత్రను మాత్రం వదిలేశారని, ఆమెను గురించి, ఆమె భావాలను గురించి కూడా అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశం అన్నారు. జాతి పిత గాంధీ మంచి తండ్రి కాలేకపోయారని ఆమె పుస్తకంలో ఆరోపించారు. భార్యతో వ్యక్తిగత జీవితం నుంచి కూడా దూరంగా ఉన్నారని చెప్పారు. దేశం కోసం గొప్ప సేవలు అందించిన గాంధీ మహాత్ముడు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారంటే ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపారు. కస్తుర్భా ఎప్పుడూ మౌనంగా ఉండే స్త్రీ మాత్రమే కాదని, చాలా ధైర్యవంతురాలని కూడా పేర్కొన్నారు. ఆమె ఎదుర్కొన్న సవాళ్లను చరిత్ర గురించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఆమె గురించి ఒక్క పదం కూడా పొందుపరిచి లేదని, ఇదంతా ఒక అసాధారణ మహిళను నిర్లక్ష్యం చేసి మర్చిపోవడమే అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కస్తుర్బా వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. -
'ఏదో ఒక రోజు నా రెండో భార్య గురించి చెప్తా'!
మాస్కో: ఏదో ఒక రోజు తన రెండో భార్య గురించి చెప్పి రష్యా ప్రజల సరదా తీరుస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరోక్షంగా చెప్పారు. ఓ సామాన్యుడు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వని ఆయన ఏదో ఒక రోజు మీ ప్రశ్నకు సమాధానం చెప్పి మీ కోరిక తీరుస్తానని అన్నారు. మొదటి భార్య లుద్మిలా నుంచి పుతిన్ 2013లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న ఆయన ఇటీవల ఒకప్పటి ఒలంపిక్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అలినా కాబేవాతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యంతో కూడిన రొమాన్స్ జరుగుతుందని అక్కడి వార్తా పత్రికలు వరుస కథనాలు వెలువరించాయి. కాగా, గురువారం సాయంత్రం పుతిన్ ఓ టీవీకార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ వ్యక్తి పుతిన్ కు ఫోన్ చేసి మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారా? ఆమె ఎవరు అని ప్రశ్నలు సందించారు. దీంతో అవాక్కయిన పుతిన్ అది లైవ్ షో కావడంతో కాస్తంత తడబడినా వెంటనే తేరుకుని తన ప్రైవేటు జీవితం గురించి కన్నా రష్యా అధ్యక్షుడిగా తాను ఎలా పనిచేస్తున్నానన్న విషయంపైనే రష్యా ప్రజలకు ఆసక్తి ఉందని అనుకుంటున్నారని అన్నారు. కానీ, ఏదో ఒక రోజు సమాధానం చెప్పి మీ ఉత్సాహాన్ని తీరుస్తానని చెప్పారు. -
రాత్రివేళ హెల్మెట్ పెట్టుకుని ప్రిమురాలి చెంతకు రాకపోకలు