కొన్ని చెప్పుకోవడం నచ్చదు: హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటీమణులు తమ వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌గా చెప్పుకోవడానికి పెద్దగా సంశయించడం లేదనే చెప్పుకోవాలి. కొందరు వ్యక్తిగత వ్యవహారాలను ఫ్యాన్స్‌తో పంచుకోకపోయినప్పటికీ మీడియా, సోషల్ మీడియా మూలంగా ఏదో ఒక సందర్భంలో బయటపడాల్సి వస్తుంది.
బాలీవుడ్ భామ కృతి సనన్‌కు మాత్రం అన్ని విషయాలను పబ్లిక్‌లో పెట్టడం అంతగా నచ్చదట. ‘నేను సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాను. చాలా విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటాను. అయితే.. కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇష్టం ఉండదు. అందరితో అన్ని విషయాలు చెప్పుకోవాలని అనిపించదు కదా’ అంటూ కృతి చెప్పుకొచ్చింది. తన గురించి వ్యక్తిగత విషయాల కన్నా వృత్తిపరమైన విషయాలను మాట్లాడుకోవాలని కోరుకుంటానని మీడియాతో ఈ రాబ్తా భామ వెల్లడించింది. అన్నట్లు రాబ్తా హీరో సుషాంత్‌తో కృతి రిలేషన్‌లో ఉందంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే.