దేవతలను కించపర్చారని వర్మపై ఫిర్యాదు
హైదరాబాద్: హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లోని మ ల్కాజిగిరి పదో మెట్రోపాలిటన్ కోర్టులో సోమవారం ప్రైవేటు పిటిషన్ దాఖలైంది.
రెండు రోజుల క్రితం ఓ దినపత్రిక (సాక్షి కాదు)కు రామ్‌గోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో హిం దూ దేవతలు శివుడు, సరస్వతి, లక్ష్మిలను కించపరిచేలా మాట్లాడారని కుషాయిగూడకు చెందిన న్యాయవాది సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. రామ్‌గోపాల్ వర్మపై 295 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నివేదిక రెండు నెలల్లో ఇవ్వాలని జడ్జి శ్రీదేవి కుషాయిగూడ పోలీసులను ఆదేశించినట్లు న్యాయవాది తెలిపారు.