ప్రైవేటు వర్సిటీలు వద్దు
మంత్రి గంటా పర్యటనను అడ్డుకొనేందుకు ఏఐఎస్ఎఫ్ విఫలయత్నం
ఎస్కేయూ: ప్రైవేటు వర్సిటీలను అనుమతించవద్దని ఏఐఎస్ఎఫ్ విద్యార్థినాయకులు మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటనను అడ్డుకొనేందుకు విఫల యత్నం చేశారు. ఎస్కేయూ పాలక భవనం ఎదురుగా శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. వర్సిటీల్లోని ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను జాన్సన్బాబు, మధు, మనోహర్, రామాంజినేయులును అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు భౌతిక దాడులు చేశారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాన్సన్బాబు ఆరోపించారు. ఇటుకలపల్లి పోలీసులు తమను దుర్భాషలాడి , కొట్టారన్నారు. ఇందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇటుకలపల్లి పోలీస్స్టేçÙన్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.