నిశ్చితార్థానికి వెళుతూ మహిళా జర్నలిస్టు దుర్మరణం
నాసిక్ : ముంబై- ఆగ్రా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా జర్నలిస్ట్ సహా ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంబాద్ పోలీసు స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. నాసిక్ సమీపంలో అతి వేగంగా వెళ్తున్న క్యాబ్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ముంబైలోని మరాఠీ దినపత్రికకు చెందిన 26 ఏళ్ల మహిళా జర్నలిస్టు ప్రియాంక దాహ్లే, క్యాబ్ డ్రైవర్ భూపీందర్ సింగ్, మరో ప్రయాణికుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గతంలో స్థానిక పత్రికలో పనిచేసిన ప్రియాంక ఈ మధ్యనే ముంబైలోని మరో ప్రతికలో చేరినట్టు సమాచారం. ఈ మధ్య ఆమెకు ముంబైకి షిప్ట్ అయ్యారు. ముంబై నుంచి తన నిశ్చితార్థం కోసం వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిశ్చితార్థ వేడుకలో మునిగి తేలాల్సిన ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం ఉదయం ప్రియాంక మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.